మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభంలో భాగంగా ప్రధాని చేసిన ప్రసంగానికి అనువాదం

September 29th, 12:45 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్, శ్రీ అజిత్ పవార్, పుణే పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు, మంత్రివర్గ యువ సహచరుడు శ్రీ మురళీధర్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటున్న ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమానికి హాజరైన సోదర సోదరీమణులందరికీ..

మహారాష్ట్రలో వీడియో అనుసంధానం ద్వారా పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 29th, 12:33 pm

మహారాష్ట్రలో రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో అనుసంధానం ద్వారా శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

మహారాష్ట్రలో రేపు రూ.11,200 కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన.. ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి

September 28th, 07:00 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర‌లో సెప్టెంబరు 29న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ.11,200 కోట్లకుపైగా వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.

జాతీయ పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమం కింద 12 పారిశ్రామిక సంగమాలు/నగరాలకు మంత్రిమండలి ఆమోదం

August 28th, 05:46 pm

కేంద్ర ప్రభుత్వం నేడు తీసుకున్న అత్యంత కీలక నిర్ణయంతో భారత్ త్వరలోనే అత్యాధునిక పారిశ్రామిక నగరాల హారంతో శోభిల్లనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సిసిఇఎ) జాతీయ పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమం (ఎన్ఐసిడిపి) కింద రూ.28,602 కోట్ల విలువైన ప్రతిపాదిత 12 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. భారత పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక పరివర్తనను తెచ్చే ఈ నిర్ణయం ఫలితంగా ఆర్థిక వృద్ధిని, అంతర్జాతీయ పోటీతత్వాన్ని గణనీయంగా ప్రోత్సహించగల పారిశ్రామిక సంగమాలు, నగరాలతో బలమైన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.