జాతీయ గంగా మండలి సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని అధ్యక్షత

December 30th, 10:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతీయ గంగా మండలి సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా అధ్యక్షత వహించారు. నమామి గంగే కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చలకు ఇదొక సదవకాశమని శ్రీ మోదీ ఈ సందర్భంగా అన్నారు. చిన్న పట్టణాలలో మురుగు శుద్ధి కర్మాగారాల నెట్‌వర్క్‌ విస్తరణసహా పరిశుభ్రత చర్యలను మెరుగుపరిచే మార్గాలను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.

పశ్చిమ బంగాల్ లో ఈ రోజు న నిర్వహించాలని ముందుగానే నిర్ణయం జరిగినకార్యక్రమాల లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి

December 30th, 09:20 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పశ్చిమ బంగాల్ ను సందర్శించవలసి ఉండగా, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా పశ్చిమ బంగాల్ లో నిర్ధారిత కార్యక్రమాల లో ఆయన పాలుపంచుకోనున్నారు.

డిసెంబర్ 30వ తేదీ న పశ్చిమ బంగాల్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి

December 29th, 12:35 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ న పశ్చిమ బంగాల్ ను సందర్శించనున్నారు. సుమారు 11 గంటల 15 నిమిషాల వేళ లో ప్రధాన మంత్రి హావ్ డా రైల్ వే స్టేశన్ కు చేరుకొని, హావ్ డా నుండి న్యూ జల్ పాయిగుడి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచకంగా ఆకుపచ్చటి జెండా ను చూపెడతారు. కోల్ కాతా మెట్రో యొక్క పర్పల్ లైన్ లో భాగం గా ఉన్నటువంటి జోకా-తారాతలా మార్గాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అంతేకాకుండా, వివిధ రైల్ వే ప్రాజెక్టుల కు ఆయన శంకుస్థాపన చేయడం తో పాటు గా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం కూడా చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వేళ లో ప్రధాన మంత్రి ఐఎన్ఎస్ నేతాజీ సుభాష్ కు చేరుకొని నేతాజీ సుభాష్ విగ్రహాని కి పుష్పాంజలి ని సమర్పిస్తారు. దీనితో పాటు గా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ - నేశనల్ ఇన్స్ టీట్యూట్ ఆఫ్ వాటర్ ఎండ్ సేనీటేశన్ (డిఎస్ పిఎమ్-ఎన్ఐడబ్ల్యుఎఎస్) ను ప్రారంభిస్తారు. స్వచ్ఛ గంగ జాతీయ ఉద్యమం లో భాగం గా పశ్చిమ బంగాల్ కై అనేక మురికినీటి సంబంధి మౌలిక సదుపాయాల పథకాల కు ఆయన శంకుస్థాపన చేయడమే కాకుండా ఆ పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయన మధ్యాహ్నం దాదాపు గా 12 గంటల 25 నిమిషాల వేళ లో నేశనల్ గంగ కౌన్సిల్ యొక్క రెండో సమావేశాని కి అధ్యక్షత వహిస్తారు.

Prime Minister reviews “Project Arth Ganga” : Correcting imbalances; connecting people

May 15th, 08:43 pm

Prime Minister Shri Narendra Modi today reviewed the plans being envisaged for implementing “Project Arth Ganga”.

నేశనల్ గంగ కౌన్సిల్ ఒక‌టో స‌మావేశాని కి అధ్య‌క్ష‌త వ‌హించిన ప్ర‌ధాన మంత్రి

December 14th, 03:43 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని కాన్‌ పుర్ లో ఈ రోజు న జ‌రిగిన నేశ‌న‌ల్ గంగ కౌన్సిల్ ఒక‌టో స‌మావేశాని కి అధ్య‌క్ష‌త వ‌హించారు.