కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, టీకా నిర్వహణ, పంపిణీ మరియు పరిపాలనపై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన – ప్రధానమంత్రి

October 17th, 04:25 pm

దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, టీకా నిర్వహణ, పంపిణీ మరియు పరిపాలన యొక్క సంసిద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు సమీక్షించారు. ఈ సమావేశంలో – కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ హర్ష వర్ధన్; ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి; నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం); ప్రధాన శాస్త్రీయ సలహాదారు; సీనియర్ శాస్త్రవేత్తలు, ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు భారత ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య మరియు వృద్ధి రేటులో నమోదౌతున్న స్థిరమైన క్షీణతను ప్రధానమంత్రి గుర్తించారు.