ఒక రంగం లో జరుగుతున్న ప‌రిశోధ‌న‌ల తాలూకు ఫ‌లితాల‌ను ఇతర రంగంలో సమర్ధంగా ఉప‌యోగించుకోవాల‌ని, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సంస్థాగత రూపాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్ర‌ధాన మంత్రి

January 04th, 03:20 pm

ప‌రిశోధ‌న‌ కూడా మనిషి ఆత్మ మాదిరి గానే ఒక నిత్య వ్యవస్థే అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభివ‌ర్ణించారు. ఒక రంగంలో జరిగే ప‌రిశోధ‌న తాలూకు ఫ‌లితాల‌ను ఇతర రంగాలలో ఉప‌యోగించుకోవ‌డం, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ కు సంస్థాగత రూపాన్ని ఇవ్వడం అనే రెండు ల‌క్ష్యాల‌ను అందుకొనే దిశ లో ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ‘నేశ‌న‌ల్ మెట్రలాజి కాన్‌క్లేవ్ 2021’ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మం లో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ‘నేశ‌న‌ల్ అటామిక్ టైమ్ స్కేల్’ ను, ‘భార‌తీయ నిర్దేశ‌క్ ద్ర‌వ్య ప్ర‌ణాళి’ ని కూడా దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. అంతేకాకుండా, నేశ‌న‌ల్ ఇన్‌వైర‌న్‌ మంట‌ల్ స్టాండ‌ర్డ్ స్ లబారటరి కి కూడాను శంకుస్థాప‌న చేశారు.