అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

August 03rd, 09:35 am

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..

వ్య‌వ‌సాయ ఆర్థిక‌వేత్త‌ల 32వ అంత‌ర్జాతీయ స‌మావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 03rd, 09:30 am

అంత‌ర్జాతీయ వ్య‌వ‌సాయ ఆర్థిక‌వేత్త‌ల 32వ స‌మావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్య‌వ‌సాయ‌శాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) స‌ముదాయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ ఏడాది స‌మావేశ థీమ్ సుస్థిర వ్య‌వ‌సాయ‌, ఆహార వ్య‌వ‌స్థ‌ల దిశ‌గా ప‌రివ‌ర్త‌న‌. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాట‌డ‌మే ఈ సమావేశ‌ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

దేశ‌వ్యాప్త యువ నూత‌న ఆవిష్క‌ర్త‌లు మ‌రియు స్టార్ట్‌-అప్ ఆంత్ర‌ప్రెన్యోర్ ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

June 06th, 11:15 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ‌వ్యాప్తంగా ఉన్నటువంటి యువ నూత‌న ఆవిష్క‌ర్త‌ల‌తోను, స్టార్ట్‌-అప్ ఆంత్ర‌ప్రెన్యోర్ ల‌తోను ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు చెందిన వేరు వేరు ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జ‌రుపుతున్న ముఖాముఖి స‌మావేశాల‌లో ఇది నాలుగో స‌మావేశం.

ఆస్ట్రేలియా ప్రధాని భారతదేశంలో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన పాఠం

April 10th, 02:15 pm

భారతదేశంలో మీరు మొదటిసారిగా పర్యటిస్తున్న సందర్భంగా మీకు స్వాగతం పలకడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. కిందటి నెలే, మనం బార్డర్ - గావస్కర్ ట్రాఫి ఉద్వేగభరితంగా ముగియడాన్ని వీక్ష‌ించాం. 2014లో ఆస్ట్రేలియా పార్లమెంటులో నేను ఇచ్చిన ఉపన్యాసంలో విశిష్ఠులైన శ్రీ బ్రాడ్ మేన్ మరియు శ్రీ తెందుల్కర్ లను గురించి ప్రస్తావించాను. ఈ రోజు భారతదేశంలో శ్రీ విరాట్ కోహ్లీ మరియు ఆస్ట్రేలియాలో శ్రీ స్టీవెన్ స్మిత్ లు క్రికెట్ లో యువ సేనలను తీర్చిదిద్దుతున్నారు. శ్రీ స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ తరహాలోనే మీ భారతదేశ సందర్శన కూడా సఫలం అవుతుందని నేను ఆశిస్తున్నాను