2025 కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన ప్రారంభం: కేవలం 15 రోజుల్లోనే దార్శనికతను వాస్తవంలోకి మార్చడం

January 16th, 02:18 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 సంవత్సరాన్ని అనేక పరివర్తనాత్మక కార్యక్రమాలతో ప్రారంభించారు, ప్రగతిశీల, స్వావలంబన మరియు ఐక్య భారతదేశం కోసం తన దార్శనికతను ప్రదర్శించారు. మౌలిక సదుపాయాలు మరియు శాస్త్రీయ పరిశోధనలను అభివృద్ధి చేయడం నుండి యువతకు సాధికారత కల్పించడం మరియు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకోవడం వరకు, ఆయన నాయకత్వం రాబోయే అద్భుతమైన సంవత్సరానికి నాంది పలికింది.

వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

January 06th, 01:00 pm

తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు గారు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా గారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా గారు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ గారు, నా మంత్రివర్గ సహచరులు - శ్రీ అశ్వనీ వైష్ణవ్ గారు, శ్రీ జి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ సోమయ్య గారు, శ్రీ రణవీత్ సింగ్ బిట్టూ గారు, శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, విశిష్ట అతిథులు, సోదర, సోదరీమణులారా!

వివిధ రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

January 06th, 12:30 pm

వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించడమే కాక కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ రైల్వే డివిజనును ప్రధాని ప్రారంభించారు. ఆయన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, తెలంగాణలో చర్లపల్లి న్యూ టర్మినల్ స్టేషనును ప్రారంభించారు.

ఢిల్లీలో రూ.12,200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

January 05th, 12:15 pm

రూ. 12,200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని మెరుగుపరిచి, ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాహిబాబాద్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ ‌నగర్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైల్లో ప్రధానమంత్రి ప్రయాణించారు.

పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి చేతులమీదుగా జనవరి 5న ఢిల్లీలో ప్రారంభించడంతోపాటు శంకుస్థాపన: విలువ రూ. 12,200 కోట్లకు పైనే

January 04th, 05:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 5న మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీలో అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతోపాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ రూ.12,000 కోట్లకు పైనే. ప్రధాని దాదాపుఉదయం 11 గంటల 15 నిమిషాల వేళలో నమో భారత్ రైలులో సాహిబాబాద్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ వరకు ప్రయాణించనున్నారు.