ఇరవై నాలుగు అంగుళాల వ్యాసం కలిగిన సహజ వాయువు సరఫరా గొట్టపు మార్గాన్నిహెచ్ డిడి పద్ధతి లో బ్రహ్మపుత్ర నది లో నిర్మించడం ద్వారా నార్థ్ఈస్ట్ గ్యాస్గ్రిడ్ ప్రాజెక్టు లో ఒక ప్రధానమైన మైలురాయి ఆవిష్కారం కావడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి

April 26th, 02:53 pm

బ్రహ్మపుత్ర నది లో ఇరవై నాలుగు అంగుళాల వ్యాసం కలిగిన సహజ వాయువు సరఫరా గొట్టపు మార్గాన్ని హెచ్ డిడి పద్ధతి లో బ్రహ్మపుత్ర నది లో ఏర్పాటు చేయడం ద్వారా నార్థ్ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్టు లో ఒక ప్రధానమైన మైలురాయి వంటి ఘట్టం ఆవిష్కారం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

గౌహతిలో బిహు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 14th, 06:00 pm

రొంగలీ బిహు సందర్భంగా అస్సాం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు!

అస్సాం లోని గువాహటిలో రూ. 10,900 కోట్ల విలువచేసే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని

April 14th, 05:30 pm

అస్సాం లోని గువాహతి లో సారూసజయ్ స్టేడియం లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రూ.10,900 కోట్లకు పైగా విలువచేసే ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో బ్రహ్మపుత్ర నాది మీద పాలాష్ బారి, సువాల్ కుచి మధ్య వంతెనకు శంకుస్థాపన, రంగ్ ఘర్, శివసాగర్ సుందరీకరణ పనుల శంకు స్థాపనలు, నామ్ రూప్ లో 500 టిపిడి మెంథాల్ ప్లాంట్ ఆవిష్కరణ, ఐదు రైల్వే ప్రాజెక్ట్ లు జాతికి అంకితం చేయటం ఉన్నాయి. పది వేల మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన రంగురంగుల బిహు నాట్యాన్ని కూడా ప్రధాని తిలకించారు.

ప్రపంచ శాంతి కోసం కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తనలో ప్రధానమంత్రి ప్రసంగం

February 03rd, 07:48 pm

కృష్ణగురు సేవాశ్రమంలో గుమిగూడిన సాధువులు, ఋషులు మరియు భక్తులందరికీ నా గౌరవప్రదమైన ప్రణామాలు. కృష్ణగురు ఏకనామ అఖండ కీర్తన గత నెల రోజులుగా జరుగుతోంది. కృష్ణగురు జీ ప్రచారం చేసిన ప్రాచీన భారతీయ విజ్ఞానం, సేవ మరియు మానవత్వం ఈనాటికీ కొనసాగడం నాకు సంతోషంగా ఉంది. గురుకృష్ణ ప్రేమానంద్ ప్రభు జీ ఆశీస్సులు మరియు సహకారంతో మరియు కృష్ణగురు భక్తుల కృషితో, ఈ కార్యక్రమంలో ఆ దైవత్వం స్పష్టంగా కనిపిస్తుంది. నేను అస్సాం వచ్చి మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుకున్నాను! నేను గతంలో కృష్ణగురువు జీ పవిత్ర నివాసానికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. కానీ నేను అక్కడికి రాలేకపోయిన నా ప్రయత్నాలలో కొన్ని వైఫల్యాలు ఉండవచ్చు. ఆ కృష్ణగురువును కోరుకుంటున్నాను'

ప్రపంచ శాంతి కోసం ‘కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన’ నుద్దేశించి ప్రధాని ప్రసంగం

February 03rd, 04:14 pm

ప్రపంచ శాంతికోసం పాటుపడుతూ అస్సాంలోని బారపేటలో ఉన్న కృష్ణ గురు సేవాశ్రంలో జరుగుతున్న ‘కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన’ నుద్దేశించి ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యకమం జనవరి 6 న మొదలై నెలరోజులపాటు సాగింది. దీనికి హాజరైన వారినుద్దేశించిన ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. కృష్ణగురు పురాతన భారత సంప్రదాయ జ్ఞానాన్ని, సేవను, మానవతావాదాన్ని ప్రచారం చేయగా ఆ బోధనలు నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. గురు కృష్ణ ప్రేమానంద ప్రభు జీ బోధనల దైవిక స్వభావం, ఆయన శిష్యుల కృషి ఈ సందర్భంగా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. గతంలోనూ, ఈ రోజు కూడా వ్యక్తిగతంగా నేరుగా పాల్గొనాలని భావించినా కుదరకపోవటంతో వీలైనంత త్వరలో అలాంటి అవకాశం దక్కేలా కృష్ణగురు ఆశీస్సులందుకున్నారు.

అస్సాంలో భారతదేశం యొక్క అతి పొడవైన వంతెనను ప్రారంభించనున్న ప్రధాని

May 25th, 06:41 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలోని అతి పొడవైన నది వంతెన- అస్సాంలోని దోలా-సడియా వంతెన ను ప్రారంభిస్తారు. ఇది రహదారుల సదుపాయం లేని సుదూరం మరియు వెనుకబడిన ప్రాంతాలకు సమర్థవంతమైన రోడ్ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ వంతెన ఎగువ అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర ఉత్తర ప్రాంతాల యొక్క సంపూర్ణ ఆర్థిక అభివృద్ధికి కూడా ఒక గొప్ప ప్రోత్సాహం కానుంది.

సోషల్ మీడియా కార్నర్ - 31 మార్చి

March 31st, 06:23 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

నమామి బ్రహ్మపుత్ర ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

March 31st, 12:47 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నమామి బ్రహ్మపుత్ర’ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.