'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ

September 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.

'హర్ ఘర్ తిరంగ అభియాన్' త్రివర్ణ పతాకం యొక్క వైభవాన్ని నిలబెట్టడంలో ఒక ప్రత్యేకమైన పండుగగా మారింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

July 28th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్‌.!!