Congress has always been an anti-middle-class party: PM Modi in Hyderabad

May 10th, 04:00 pm

Addressing his second public meeting, PM Modi highlighted the significance of Hyderabad and the determination of the people of Telangana to choose BJP over other political parties. Hyderabad is special indeed. This venue is even more special, said PM Modi, reminiscing about the pivotal role the city played in igniting hope and change a decade ago.

PM Modi addresses public meetings in Mahabubnagar & Hyderabad, Telangana

May 10th, 03:30 pm

Prime Minister Narendra Modi addressed public meetings in Mahabubnagar & Hyderabad, Telangana, emphasizing the significance of the upcoming elections for the future of the country. Speaking passionately, PM Modi highlighted the contrast between the false promises made by Congress and the concrete guarantees offered by the BJP-led government.

Transformation of Indian Railways is the guarantee of Viksit Bharat: PM Modi

March 12th, 10:00 am

PM Modi dedicated to the nation and laid the foundation stone of various developmental projects worth over Rs 1,06,000 crores at Dedicated Freight Corridor’s Operation Control Centre in Ahmedabad, Gujarat. He added that in the 75 days of 2024, projects worth more than Rs 11 lakh crores have been inaugurated or foundation stones laid while projects worth Rs 7 lakh crores have been unveiled in the last 10-12 days.

గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో రూ.1,06,000 కోట్లకుపైగా విలువైన

March 12th, 09:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌లోని ప్రత్యేక రవాణా కారిడార్ (డిఎఫ్‌సి) కార్యకలాపాల నియంత్రణ కేంద్రం ప్రాంగణంలో రూ.1,06,000 కోట్లకుపైగా విలువైన ప్రగతి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో రైల్వే మౌలిక సదుపాయాలు సహా అనుసంధానం, పెట్రో రసాయనాల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్యక్రమాలతోపాటు 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 200కుపైగా ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాలతో మమేకమైన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నేటి ఈ కార్యక్రమం స్థాయి, పరిణామం రైల్వేల చరిత్రలో మునుపెన్నడూ ఎరుగనిదని ప్రధాని అభివర్ణించారు. దీనికి సంబంధించి రైల్వే రంగానికి అభినందనలు తెలిపారు.

Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi: PM Modi

February 28th, 10:00 am

PM Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth more than Rs 17,300 crores in Thoothukudi, Tamil Nadu. He reiterated the journey of Viksit Bharat and the role of Tamil Nadu in it. He recalled his visit 2 years ago when he flagged off many projects for the expansion of the Chidambaranar Port capacity and his promise of making it into a major hub of shipping.

పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయల కు పైగా విలువైనఅనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు తమిళ నాడు లోని తూత్తుక్కుడి లో శంకుస్థాపన జరిపి, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి

February 28th, 09:54 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17,300 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగినటువంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు తమిళ నాడు లోని తూత్తుక్కుడి లో ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు గా వాటిని దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ప్రధాన మంత్రి వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో అవుటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణాని కి శంకుస్థాపన చేశారు. భారతదేశం లో మొట్టమొదటిసారి గా పూర్తి గా దేశీయం గా రూపొందించిన గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్‌లాండ్ వాటర్‌వే వెసల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో ఉన్న 75 లైట్ హౌస్ లలో యాత్రికుల సదుపాయాల ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. వాంచీ మణియాచ్చి - తిరునెల్‌వేలి సెక్శన్, ఇంకా మేలప్పాలయమ్ - అరళ్‌వాయ్‌మొళి సెక్శన్ లు సహా వాంచీ మణియాచ్చి - నాగర్‌కోయిల్ రైలు మార్గం యొక్క డబ్లింగ్ ప్రాజెక్టుల ను కూడా ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. సుమారు గా 4,586 కోట్ల రూపాయల మొత్తం ఖర్చు తో తమిళ నాడు లో అభివృద్ధి పరచిన నాలుగు రహదారి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు.

Namo Bharat Train is defining the new journey of New India and its new resolutions: PM Modi

October 20th, 04:35 pm

The Prime Minister, Shri Narendra Modi inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor at Sahibabad RapidX Station in Ghaziabad, Uttar Pradesh today. He also flagged off the Namo Bharat RapidX train connecting Sahibabad to Duhai Depot, marking the launch of the Regional Rapid Transit System (RRTS) in India. Shri Modi dedicated to the nation, two stretches of east-west corridor of Bengaluru Metro.

భారతదేశం లో తొలిరీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ను ఉత్తర్ ప్రదేశ్ లోనిగాజియాబాద్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 20th, 12:15 pm

దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లోని ప్రయారిటీ సెక్శను ను ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో సాహిబాబాద్ రేపిడ్ఎక్స్ స్టేశన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలిపేటటువంటి నమో భారత్ రేపిడ్ఎక్స్ రైలు కు కూడా ఆయన ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. దీని తో భారతదేశం లో రీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) కు నాంది పలికినట్లు అయింది. బెంగళూరు మెట్రో కు చెందిన ఈస్ట్-వెస్ట్ కారిడార్ తాలూకు రెండు భాగాల ను దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.

We are moving towards a future where the Blue Economy will be the medium to create a Green Planet: PM Modi

October 17th, 11:10 am

PM Modi inaugurated the 3rd edition of Global Maritime India Summit 2023 in Mumbai via video conferencing. PM Modi said that history bears testimony that India's maritime capabilities have always benefited the world. PM Modi listed the systematic steps undertaken to strengthen the sector in the last few years. He underlined the transformative impact of the historic G20 consensus on the proposed India-Middle East Europe Economic Corridor. He said that as the Silk Route of the past changed the economy of many countries, this corridor too will transform the picture of global trade.

ప్రపంచ సముద్ర భారత సదస్సు-2023కు ప్రధాని శ్రీకారం

October 17th, 10:44 am

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తూ- 2021లో సదస్సు నిర్వహించిన సమయంలో కోవిడ్ మహమ్మారి ప్రభావిత అనిశ్చితితో యావత్‌ ప్రపంచం ఎంత తల్లడిల్లిందో గుర్తుచేశారు. జన జీవనాన్ని అతలాకుతలం చేసిన ఆనాటి దుస్థితి నుంచి నేడు సరికొత్త ప్రపంచ క్రమం రూపుదిద్దుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచం ఇవాళ కొత్త ఆకాంక్షలతో భారతదేశం వైపు చూస్తున్నదని ప్రధానమంత్రి వివరించారు. యావత్‌ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిరంతరం బలపడుతున్నదని వ్యాఖ్యానించారు. తదనుగుణంగా ప్రపంచంలోని 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ పరివర్తన చెందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో సముద్ర మార్గాల పాత్రను ప్రధాని వివరిస్తూ- కరోనా అనంతర ప్రపంచంలో విశ్వసనీయ ప్రపంచ సరఫరా శ్రేణి అవసరాన్ని నొక్కిచెప్పారు.

తెలంగాణలోని మహబూబ్ నగర్ లో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 01st, 02:43 pm

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, పార్లమెంటులో నా సహచరులు శ్రీ సంజయ్ కుమార్ బండి గారు, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నమస్కారం!

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పథకాలు జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధాని

October 01st, 02:42 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో రూ.13,500 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప‌థ‌కాలను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాప‌న చేశారు. వీటిలో రహదారి, రైల్వే, పెట్రోలియం-సహజ వాయువు, ఉన్నత విద్య వంటి కీలక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగానే ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ సదుపాయం ద్వారా ఒక కొత్త రైలు‌ను కూడా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తూ- పండుగల సమయం ఆసన్నం అవుతున్నదని గుర్తుచేశారు. మరోవైపు పార్లమెంట్‌లో ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు (నారీశక్తి వందన్ అధినియం)కు ఆమోదం ద్వారా నవరాత్రి వేడుకల ఆరంభానికి ముందే నారీశక్తి పూజా స్ఫూర్తి ఆవిష్కృతమైందని ఆయన అభివర్ణించారు.

Day is not far when Vande Bharat will connect every part of the country: PM Modi

September 24th, 03:53 pm

PM Modi flagged off nine Vande Bharat trains across 11 states via video conferencing. He added that the speed and scale of infrastructure development in the country is exactly matching the aspirations of 140 crore Indians.

తొమ్మిది వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి.

September 24th, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తొమ్మది వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త వందే భారత్ రైళ్లు ,దేశవ్యాప్త అనుసంధానతను మెరుగుపరచాలన్న, రైలు ప్రయాణికులకు ప్రపంచశ్రేణి సదుపాయాలు కల్పించాలన్న ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేయడంలో పడిన ముందడుగు గా చెప్పుకోవచ్చు.

యశోభూమిని జాతికి అంకితం చేసి, పిఎం విశ్వకర్మ పథకం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

September 17th, 06:08 pm

నేడు భగవాన్ విశ్వకర్మ జయంతి మహోత్సవం. మన సాంప్రదాయిక కళాకారులు, హస్తకళాకారులకు ఈ రోజు అంకితం. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ నా హృద‌యపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వకర్మ మిత్రులతో కూడా ఈ సందర్భంగా అనుసంధానం అయ్యే అవకాశం నాకు కలిగింది. కొద్ది సమయం క్రితమే నేను విశ్వకర్మ సోదరసోదరీమణులతో నేను సంభాషించాను. వారితో సంభాషిస్తూ ఉండడం వల్లనే నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చాలా అద్భుతమైనది, అది వదిలి వెళ్లాలని నేను భావించలేకపోయాను. దాన్ని సందర్శించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ ప్రదర్శన మరో రెండు మూడు రోజులుంటుందని నాకు చెప్పారు. ప్రదర్శనను సందర్శించాలని నేను ఢిల్లీ ప్రజలను కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను.

న్యూఢిల్లీలో భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి

September 17th, 12:15 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ‘భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం’ (ఐసిఇసి) ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అద్భుతమైన సదస్సుల వేదిక, బహుళ ప్రదర్శనశాలలు, ఇతర అధునాతన సౌకర్యాలున్నాయి. మరోవైపు విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ వృత్తి నిపుణులు, హస్తకళాకారుల కోసం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ కూడా ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైంది. అలాగే ‘పీఎం విశ్వకర్మ’ లోగో, నినాదం, పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపుల ఫలకం, ఉపకరణసమూహ కరదీపికలతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 18 మంది లబ్ధిదారులకు విశ్వకర్మ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

మయన్మార్‌లో కాలాదాన్‌ మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టు కింద నిర్మించిన సిట్వే రేవుకు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఓడరేవు నుంచి తొలి నౌకను నడపడంపై ప్రధానమంత్రి ప్రశంస

May 05th, 11:38 am

భారత్‌లోని శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఓడరేవు నుంచి మయన్మార్‌లో ‘కాలాదాన్‌ మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ ట్రాన్స్‌’పోర్ట్‌ ప్రాజెక్టు’ కింద నిర్మించిన ‘సిట్వే’ రేవుకు తొలి నౌకను నడపడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

తిరువనంతపురంలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, అంకితం సందర్భంగా ప్రధాని ప్రసంగం

April 25th, 11:50 am

కేరళ గవర్నరు శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహాచరులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, కేరళ ప్రభుత్వ మంత్రులు, స్థానిక ఎంపి శశి థరూర్ గారు, ఇతర ప్రముఖులు, కేరళకు చెందిన నా ప్రియమైన సోదరసోదరీమణులు. మలయాళ నూతన సంవత్సరం కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. విషు పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉత్సాహభరిత వాతావరణంలో కేరళ అభివృద్ధి వేడుకల్లో పాల్గొనే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేడు కేరళకు తొలి వందేభారత్ రైలు లభించింది. ఈ రోజు కొచ్చికి రైల్వేకు సంబంధించిన అనేక ప్రాజెక్టులతో పాటు వాటర్ మెట్రో రూపంలో కొత్త బహుమతి లభించింది. కనెక్టివిటీతో పాటు నేడు కేరళ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ కేరళ ప్రజలకు అభినందనలు తెలిపారు.

కేరళలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలోరూ.3200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలుచేసిన ప్రధానమంత్రి

April 25th, 11:35 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రూ.3200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

హైదరాబాద్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

April 08th, 12:30 pm

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు అశ్విని వైష్ణవ్ గారు, తెలంగాణ బిడ్డ, మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ జి.కిషన్ రెడ్డి గారు, పెద్దసంఖ్యలో ఇక్కడికి తరలివచ్చిన తెలంగాణ సోదర సోదరీమణులారా,