జపాన్ మాజీ ప్రధాని/జపాన్-ఇండియా అసోసియేషన్ (జిఐఎ) చైర్మన్‌ మాననీయ యోషిడే సుగాతో ప్రధానమంత్రి సమావేశం

July 06th, 07:03 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇవాళ జపాన్‌ మాజీ ప్రధాని/జపాన్-ఇండియా అసోసియేషన్ (జిఐఎ) చైర్మన్‌ మాననీయ యోషిడా సుగా సమావేశమయ్యారు. ‘గణేశ నో కై’ పార్లమెంటేరియన్లతోపాటు ‘కెడాన్‌రెన్’ (జపాన్‌ వాణిజ్య సమాఖ్య) పారిశ్రామిక ప్రతినిధులు, ప్రభుత్వాధికారులతో కూడిన 100 మంది బృందంతో శ్రీ సుగా తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం భారత-జపాన్‌ల మధ్య ప్రత్యేక-వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం విస్తరణపై వారిద్దరూ అభిప్రాయాలు వెల్లడించుకున్నారు. పెట్టుబడులు, ఆర్థిక సహకారం, రైల్వేలు, ప్రజల మధ్య స్నేహబంధాలు, నైపుణ్యాభివృద్ధి భాగస్వామ్యం తదితర అంశాలపైనా వారు చర్చించారు.