ఉత్తర‌ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న సెమీకాన్ ఇండియా 2024లో

September 11th, 04:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా‌లో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సదస్సును సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ‘సెమీకండక్డర్ భవిష్యత్తును తీర్చిదిద్దటం’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల సదస్సులో సెమీకండక్టర్ల విషయంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు. ఈ పరిశ్రమకు చెందిన ప్రపంచ నాయకత్వ స్థాయి వ్యక్తులు, కంపెనీలు, నిపుణులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఈ సదస్సులో ప్రపంచ సెమీకండక్టర్ దిగ్గజాల అగ్రనాయకత్వం పాల్గొంటోంది. సదస్సులో 250 మందికి పైగా ప్రదర్శనదారులు, 150 మంది వక్తలు పాల్గొంటున్నారు.

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీకి అగ్ర‌శ్రేణి సెమీకండ‌క్ట‌ర్ సీఈఓల ప్ర‌శంస‌లు

September 10th, 11:44 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం లోక్‌ క‌ల్యాణ్ మార్గ్ 7లో సెమీకండ‌క్ట‌ర్ రంగంలోని కార్య నిర్వహణాధికారులతో రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. సెమీకండ‌క్ట‌ర్ల రంగానికి సంబంధించిన వివిధ అంశాల‌పై వారితో ప్ర‌ధాన‌మంత్రి విస్తృతంగా చ‌ర్చించారు. ప్ర‌పంచ అభివృద్ధిప‌థాన్ని ఈ రంగం ఎలా ముందుకు తీసుకెళ్ల‌గ‌ల‌దో శ్రీ మోదీ వివ‌రించారు. భార‌త్‌ను పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా మార్చేందుకు దేశంలో తీసుకుంటున్న సంస్క‌ర‌ణ‌ల‌ను సైతం ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు.

ప్రధానమంత్రిని కలుసుకున్న ‘ఎన్‌ఎక్స్’పి’ సెమికండక్టర్‌ సంస్థ సీఈవో

March 30th, 10:16 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ‘ఎన్‌ఎక్స్‌’పి’ సెమికండక్టర్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ కుర్త్‌ సీవర్స్‌ ఇవాళ కలుసుకున్నారు.