ఇండోర్‌లో ప‌ట్ట‌ణాభివృద్ధి ప్రాజెక్టుల‌ను ప్రారంభించి, స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డుల‌ను బ‌హుక‌రించిన ప్ర‌ధానమంత్రి

June 23rd, 06:00 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు మ‌ద్య‌ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల‌లో గ‌ల ప‌లు ప‌ట్ట‌ణాభివృద్ధి ప్రాజెక్టుల‌ను రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఇందులో ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద‌గ‌ల ఇళ్లు, ప‌ట్ట‌ణ నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాలు, ప‌ట్ట‌ణ ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, ప‌ట్ట‌ణ పారిశుధ్యం, ప‌ట్ట‌ణ ర‌వాణా, ప‌ట్ట‌ణ సుంద‌రీక‌ర‌ణ ప్రాజ‌క్టులు ఉన్నాయి.

మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌ లో 2018 జూన్ 23వ తేదీన మోహ‌న్‌ పురా నీటి పారుదల ప‌థ‌కం ప్రారంభ కార్యక్రమం లో ప్ర‌ధాన‌ మంత్రి ఉపన్యాసం

June 23rd, 02:04 pm

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ లోని రాజ్గఢ్ జిల్లాలో మోహన్పురా నీటిపారుదల ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేశారు. నేడు అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. అక్కడ సమావేశంలో ప్రసంగిస్తూ, తమ ప్రభుత్వం ఆకాంక్షగలిగిన జిల్లాలలోని ప్రతీ గ్రామానికి గ్యాస్ కనెక్షన్, ప్రతి ఇంటికి విద్యుత్, అందరికీ బ్యాంక్ అకౌంట్, ప్రతి గర్భవతి మరియు బిడ్డకు టీకా అందిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన‌మంత్రిః మోహ‌న్‌పురా నీటిపారుద‌ల ప్రాజెక్టు జాతికి అంకితం

June 23rd, 02:00 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు మోహ‌న్‌పురా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు రాజ్‌ఘ‌ర్ జిల్లాలోని భూముల‌కు నీటిపారుద‌ల సౌక‌ర్యం క‌ల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని గ్రామాల‌కు తాగునీటిని కూడా స‌ర‌ఫ‌రా చేస్తుంది. ప్ర‌ధాన‌మంత్రి వివిధ మంచినీటి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు.