యుగాండా కు ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భంగా భారతదేశం-యుగాండా సంయుక్త ప్రకటన

July 25th, 06:54 pm

కగూటా

యుగాండా పార్ల‌మెంట్ లో ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం

July 25th, 01:00 pm

ఈ మహనీయమైన చ‌ట్ట‌ స‌భ‌ ను ఉద్దేశించి ప్ర‌సంగించే ఆహ్వానాన్ని అందుకోవ‌డం నాకు ల‌భించిన అరుదైనటువంటి గౌర‌వంగా భావిస్తున్నాను. కొన్ని ఇత‌ర దేశాల చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ ప్ర‌సంగించే అవ‌కాశం నాకు ల‌భించింది; అయిన‌ప్ప‌టికీ, ఇది మాత్రం చాలా విశిష్ట‌మైంది. ఇటువంటి గౌర‌వం భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి కి ల‌భించ‌డం ఇదే తొలి సారి. ఇది మా దేశం లోని 125 కోట్ల‌ మంది భార‌తీయుల‌కు ద‌క్కిన గొప్ప‌ స‌త్కారం. వారు అంద‌రి స్నేహ‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు, హృద‌య‌పూర్వ‌క ఆశీస్సుల‌ను ఈ చ‌ట్ట‌ స‌భ‌ కోసం.. యుగాండా ప్ర‌జ‌లు అంద‌రి కోసం నేను మోసుకొచ్చాను. గౌర‌వ‌నీయురాలైన మేడమ్ స్పీక‌ర్‌ గారూ, మీరు అధ్య‌క్ష స్థానంలో ఉండ‌డం నాకు మా లోక్‌ స‌భ‌ ను గుర్తుకు తెస్తోంది. అక్క‌డ కూడా స్పీక‌ర్‌ గా ఒక మ‌హిళ ఉండ‌డం ఇందుకు కార‌ణం. ఇక ఈ చ‌ట్ట‌ స‌భ‌ లో యువ స‌భ్యులు పెద్ద సంఖ్య‌లో ఉండ‌డం కూడా చూస్తున్నాను. ఇది ప్ర‌జాస్వామ్యానికి శుభ‌క‌రం. నేను యుగాండా కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఈ ‘‘ఆఫ్రికా ఆణిముత్యం’’ న‌న్ను మంత్ర‌ముగ్ధుడిని చేస్తూనే ఉంది. ఈ గడ్డ అపార సౌంద‌ర్యానికి, గొప్ప స‌హ‌జ వ‌న‌రుల సంప‌ద‌ కు, సుసంప‌న్న వార‌స‌త్వానికి నిలయంగా ఉంది. ఇక్క‌డి న‌దులు, స‌ర‌స్సులు ఈ అతి పెద్ద ప్రాంతం లో నాగ‌రక‌త‌ లను పెంచి పోషించాయి.

ఇండియా-ఉగాండా బిజినెస్ ఫోరమ్ లో ప్రధాని మోదీ ఉపన్యాసం

July 25th, 12:41 pm

భారతదేశం-ఉగాండా బిజినెస్ ఫోరమ్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ యుగాండాతో కలిసి పనిచేయడం, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యం అభివృద్ధి, ఆవిష్కరణ, దేశంలో విస్తృతమైన సహజ వనరులకు విలువను పెంపొందించుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. భారతదేశం యొక్క వృద్ధి పథం మరియు దేశంలో జరుగుతున్న మార్పులను కూడా ప్రధాని వివరించారు.

యుగాండా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

July 24th, 08:58 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుగాండా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. కంపాలా లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యుగాండా అధ్యక్షుడు శ్రీ ముసెవెనీ కూడా హాజరయ్యారు.

భారతదేశం ఎల్లప్పుడూ ఆఫ్రికా అభివృద్ధిలో భాగస్వామిగా ఉంది మరియు అలానే కొనసాగుతుంది: ప్రధాని మోదీ

July 24th, 08:58 pm

ఉగాండాలో భారతీయ సంతతితో చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ, భారత్, ఆఫ్రికా దేశాల మధ్య బలమైన సంబంధాలను ఉద్ఘాటించారు. భారతదేశం యొక్క వృద్ధి పథం గురించి ప్రధానమంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు మరియు దేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్నారు.

ఉగాండా అధ్యక్షుడు కగట ముసెవెనీతో ప్రధాని మోదీ చర్చలు

July 24th, 08:36 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగాండా అధ్యక్షుడు కగట ముసెవెనీతో ఫలవంతమైన చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు ప్రతినిధి బృందంతో కలిసి చర్చలు జరిపారు మరియు ద్వైపాక్షిక సంబంధాల యొక్క అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షించారు.

యుగాండా లో ప్రధాన మంత్రి పర్యటన సందర్బంగా భారతదేశానికి, ఇంకా యుగాండా కు మధ్య సంతకాలు జరిగిన ఎంఓయూ ల జాబితా

July 24th, 05:52 pm

యుగాండా లో ప్రధాన మంత్రి పర్యటన సందర్బంగా భారతదేశానికి, ఇంకా యుగాండా కు మధ్య సంతకాలు జరిగిన ఎంఓయూ ల జాబితా

ఉగాండా ప్రెసిడెంట్ యోవేరి ముసేవేనితో సంయుక్త పత్రిక సమావేశం వాడ ప్రధాని మోదీ

July 24th, 05:49 pm

ఉగాండా అధ్యక్షుడు ముసెన్నితో ఉమ్మడి పత్రికా సమావేశంలో, ప్రధాని మోదీ, ఇరు దేశాల మధ్య లోతైన సంబంధాలు గురించి నొక్కిచెప్పారు. శిక్షణ, సామర్థ్య నిర్మాణానికి, సాంకేతిక పరిజ్ఞానం మరియు మౌలిక సదుపాయాల వంటి విషయాలలో ఇరు దేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుచుకోగాలవో ఆయన వివరించారు. $ 200 మిలియన్ల విలువైన రెండు రకాలైన రుణాలను ప్రధాని ప్రకటించారు.

ఉగాండా చేరుకున్న ప్రధాని మోదీ

July 24th, 05:12 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా రెండో దేశంగా ఉగాండాలోను ఎంటెబే చేరుకున్నారు. తన పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ ఉగాండా అధ్యక్షుడితో చర్చలు జరిపి, సమాజ సంభాషణ నిర్వహించి, ఉగాండా పార్లమెంటులో కీలక ప్రసంగాన్నిచేస్తారు.