పోలిష్ కబడ్డీ క్రీడాకారులతో ప్రధాన మంత్రి సమావేశం
August 22nd, 09:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పోలాండ్ లోని వార్సాలో పోలెండ్ కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు మీహాల్ ష్పిజ్ కోవ్, సభ్యురాలు అన్నా కాల్బార్చిక్ తో సమావేశమయ్యారు. పోలాండ్‌లో కబడ్డీని పురోగమనంలోనూ, యూరప్‌లో క్రీడను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలోనూ ష్పిజ్ కోవ్, కాల్బార్చిక్‌లు అంకితభావంతో కృషి చేశారని ప్రధాన మంత్రి ప్రశంసించారు. భారతదేశం, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడంలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ప్రధాని అన్నారు.‘బిలీనియం’ సీఈవో గవెల్ లోపిన్స్కితో ప్రధానమంత్రి సమావేశం
August 22nd, 09:22 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘బిలీనియం’ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) గవెల్ లోపిన్స్కితో సమావేశమయ్యారు. ఇది మహారాష్ట్రలోని పుణె నగరంలోగల ప్రముఖ పోలాండ్ సమాచార సాంకేతిక రంగ కంపెనీ.‘టిజడ్ఎంఒ’ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అలీనా పోస్లుజ్నీతో ప్రధానమంత్రి సమావేశం
August 22nd, 09:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పోలాండ్‌లో విభిన్న పరిశుభ్రత ఉత్పత్తుల తయారీ సంస్థ ‘టిజడ్ఎంఒ’, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అలీనా పోస్లుజ్నీతో సమావేశమయ్యారు.పోలాండ్‌లోని ప్రముఖ ఇండాలజిస్టులతో ప్రధానమంత్రి సమావేశం
August 22nd, 09:18 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పోలాండ్‌లోని ప్రముఖ ఇండాలజిస్టుల (భారత చరిత్ర అధ్యయనకారులు)తో సమావేశమయ్యారు. ఈ బృందంలోని ప్రముఖులలో...:భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక
August 22nd, 08:22 pm
భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక అమలు దిశగా రెండు దేశాల ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగం పుంజుకోవడాన్ని 2024 ఆగస్టు 22న వార్సాలో సమావేశం సందర్భంగా వారిద్దరూ గుర్తించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2024-28 మధ్య ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన-అమలుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కింది ప్రాధాన్యాంశాల పరంగా ద్వైపాక్షిక సహకారానికి ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది:‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు’’పై భారత-పోలెండ్ సంయుక్త ప్రకటన
August 22nd, 08:21 pm
పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.పోలాండ్ అధ్యక్షునితో సమావేశమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 22nd, 08:14 pm
పోలాండ్ అధ్యక్షుడు శ్రీ ఆంద్రేవ్ సెబాస్టియన్ డూడాతో వార్సాలోని బెల్వడియర్ ప్యాలెస్ లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.వార్సాలోని అనామక సైనిక సమాధివద్ద ప్రధాని ఘన నివాళి
August 22nd, 08:12 pm
వార్సాలోని అనామక సైనిక ( అన్ నౌన్ సోల్జర్) సమాధివద్ద ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు.పోలాండ్ ప్రధానితో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ
August 22nd, 06:10 pm
ఫెడరల్ ఛాన్సలరీని చేరుకున్న ప్రధానికి పోలాండ్ ప్రధాని శ్రీ డోనాల్డ్ టస్క్ సంప్రదాయబద్దంగా సాదర స్వాగతం పలికారు.పోలండ్ ప్రధానితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల ఆంగ్ల అనువాదం
August 22nd, 03:00 pm
అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మోంటె కేసినో యుద్ధ స్మారక కట్టడం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
August 21st, 11:55 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వార్సా లో బుధవారం మోంటె కేసినో యుద్ధ స్మారకానికి చేరుకొని, ఒక పూల హారాన్ని అక్కడ ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.పోలాండ్ లోని వార్సా లో భారతీయ సమాజం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 21st, 11:45 pm
ఇక్కడి దృశ్యం నిజంగా అద్భుతం... మీ ఉత్సాహం కూడా అమోఘం. నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, మీరు అలసిపోలేదు. మీరందరూ పోలాండ్‌లోని వివిధ భాషలు, మాండలికాలు, వివిధ ఆహారపు అలవాట్లున్న ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ భారతీయతే మిమ్మల్ని ఒకటిగా కలిపింది. మీరు ఇక్కడ నాకు స్వాగతం పలికారు... మీరు చూపిన ఈ ఆదరణకు మీ అందరికీ, ముఖ్యంగా పోలాండ్ ప్రజలకు చాలా కృతజ్ఞతలు.వార్సాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 21st, 11:30 pm
ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు ఆత్మీయతతో, ఉత్సాహంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి పోలండ్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్-పోలండ్ సంబంధాలను బలోపేతం చేసేందుకు పోలండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా, ప్రధానమంత్రి డోనాల్డ్ టస్క్ తో సమావేశానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లివంటిదని, పోలండ్‌తో భారతదేశపు విలువలను పంచుకోవడం వల్ల రెండు దేశాలు చేరువయ్యాయని అన్నారు.పోలెండ్ లోని వార్సాలో కొల్హాపుర్ స్మారకానికి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి
August 21st, 10:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోలెండ్ లోని వార్సాలో గల కొల్హాపుర్ స్మారకానికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ స్మారకం కొల్హాపుర్ కు చెందిన మహనీయ రాజకుటుంబానికి ఒక నివాళిగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంలో భయానక స్థితిగతుల కారణంగా ఆశ్రయాన్ని కోల్పోయిన పోలెండుకు చెందిన మహిళలకు, బాలలకు తలదాచుకొనే నీడను ఇవ్వడంలో ఈ రాజకుటుంబం అగ్ర స్థానాన నిలిచింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.PM Modi pays tributes to Jam Saheb of Nawanagar Memorial in Warsaw, Poland
August 21st, 10:27 pm
PM Modi paid tributes to Jam Saheb of Nawanagar Memorial in Warsaw, Poland. Shri Modi said that the Jam Saheb of Nawanagar Memorial in Warsaw, Poland highlights the humanitarian contribution of Jam Saheb Digvijaysinhji Ranjitsinhji Jadeja, who ensured shelter as well as care to Polish children left homeless due to the Second World War.పోలాండ్‌లోని వార్సా చేరుకున్న ప్రధాని మోదీ
August 21st, 06:11 pm
ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్‌లోని వార్సా చేరుకున్నారు. 45 ఏళ్లలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఆయన అధ్యక్షుడు హెచ్‌ఈ. శ్రీ. Andrzej అండ్రేజెయి సెబాస్టియన్ డూడ అలాగే ప్రధాన మంత్రి H.E. శ్రీ. డొనాల్డ్ టస్క్ లను కలవనున్నారు, మరియు పోలాండ్‌లోని భారతీయ సమాజంతో సంభాషించనున్నారు.పోలెండ్ , ఉక్రెయిన్ సందర్శనకు ముందు ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన
August 21st, 09:07 am
మన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో పోలెండును నేను సందర్శించబోతున్నాను. మధ్య ఐరోపాకు చెందిన పోలెండ్ ఒక ప్రముఖ ఆర్థిక భాగస్వామ్య దేశంగా ఉంది.