ఎఫ్ ఐపిఐసి 3 సదస్సులో ప్రధాన మంత్రి ముగింపు ప్రకటన
May 22nd, 04:33 pm
మీ అభిప్రాయాలకు ధన్యవాదములు. మా చర్చల నుంచి వచ్చిన ఆలోచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. పసిఫిక్ ద్వీప దేశాల కొన్ని భాగస్వామ్య ప్రాధాన్యతలు, అవసరాలను మేము కలిగి ఉన్నాము. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలన్నదే మా ప్రయత్నం. FIPICలో మా సహకారాన్ని మరింత పెంపొందించడానికి, నేను కొన్ని ప్రకటనలు చేయాలనుకుంటున్నాను:పాపువా న్యూ గినీ లో అత్యున్నత పౌరపురస్కారాన్ని ప్రధాన మంత్రి కి ప్రదానం చేయడమైంది
May 22nd, 03:09 pm
పాపువా న్యూ గినీ (పిఎన్ జి) యొక్క రాజధాని పోర్ట్ మోరెస్ బీ లో గల గవర్నమెంట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం లో పాపువా న్యూ గినీ గవర్నర్- జనరల్ సర్ శ్రీ బాబ్ డాడే గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లోగోహు (జిసిఎల్) ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రదానం చేశారు. ఈ పురస్కారం పిఎన్ జి లో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం; ఈ పురస్కారాన్ని అందుకొనే వ్యక్తుల కు ‘చీఫ్’ అనే బిరుదు ను కూడా ఇవ్వడం జరుగుతుంది.పాపువా న్యూ గినీ లో ఐటిఇసి మేధావుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
May 22nd, 02:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే 22వ తేదీ నాడు ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) యొక్క మూడో శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం పోర్ట్ మోరెస్ బీ ని తాను సందర్శించిన సందర్భం లో. పసిఫిక్ ఐలండ్ దేశాల ఇండియన్ టెక్నికల్ ఎండ్ ఇకానామిక్ కోఆపరేశన్ (ఐటిఇసి) కోర్సు ల పూర్వ విద్యార్థుల తో మాట్లాడారు. ఈ పూర్వ విద్యార్థుల లో ప్రభుత్వ సీనియర్ అధికారులు, అగ్రగామి వృత్తి నిపుణులు మరియు సాముదాయిక నాయకులు ఉన్నారు. వారంతా ఐటిఇసి లో భాగం గా భారతదేశం లో శిక్షణ ను అందుకొన్నారు. వారు భారతదేశం లో ఆర్జించిన నైపుణ్యాల ను ఉపయోగిస్తూ వారి వారి సమాజాల కు తోడ్పాటు ను అందిస్తున్నారు.న్యూ జీలండ్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
May 22nd, 02:51 pm
ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో 2023 మే నెల 22వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లో న్యూ జీలండ్ ప్రధాని శ్రీ క్రిస్ హిప్ కిన్స్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఇద్దరు ప్రధాను ల మధ్య ఈ విధమైన సమావేశం జరగడం ఇదే మొదటి సారి.ఫిజీ గణతంత్రం ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
May 22nd, 02:37 pm
ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 22వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లో ఫిజీ గణతంత్రం ప్రధాని శ్రీ సిత్వేనీ లిగామామాదా రాబుకా తో సమావేశమయ్యారు. ఇద్దరు నేత ల మధ్య ఇది మొట్ట మొదటి సమావేశం. 2014 వ సంవత్సరం నవంబరు లో ఫిజీ ని తాను సందర్శించిన కాలం లో ఎఫ్ఐపిఐసి ప్రారంభం అయిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆ తరువాత పసిఫిక్ ఐలండ్ కంట్రీస్ (పిఐసి) తో భారతదేశం యొక్క సహకారం నిరంతరం బలోపేతం అయింది అని ఆయన అన్నారు.Prime Minister honoured with the highest civilian awards of Papua New Guinea, Fiji and Palau
May 22nd, 02:18 pm
Prime Minister Narendra Modi, during his historic visit to Papua New Guinea, was conferred with three prestigious civilian awards. He was conferred the ‘Grand Companion of the Order of Logohu’ by Papua New Guinea, ‘Companion of the Order of Fiji’ by Republic of Fiji and ‘Ebakl’ Award by Republic of Palau.మూడవ ఎఫ్ ఐ పి ఐ సి సమ్మిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ ప్రకటన తెలుగు l అనువాదం
May 22nd, 02:15 pm
మూడవ ఎఫ్ఐపిఐసి శిఖరాగ్ర సమావేశానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం! ప్రధాన మంత్రి జేమ్స్ మరాప్ నాతో కలిసి ఈ సదస్సుకు సహ ఆతిథ్యం ఇస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. పోర్ట్ మోరెస్బీలో ఇక్కడ సమ్మిట్ కోసం చేసిన అన్ని ఏర్పాట్లకు గానూ నేను ఆయనకు , వారి బృందానికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను..పాపువా న్యూ గినీ గవర్నర్ జనరల్ తో ప్రధాన మంత్రి సమావేశం
May 22nd, 08:39 am
ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 22వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లోని ప్రభుత్వ అతిథి గృహం లో పాపువా న్యూ గినీ (పిఎన్ జి) గవర్నర్- జనరల్ సర్ శ్రీ బాబ్ డాడే తో సమావేశమయ్యారు.పాపువా న్యూ గినీ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశం
May 22nd, 08:39 am
ఫొరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 22 వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లో పాపువా న్యూ గినీ (పిఎన్ జి) ప్రధాని శ్రీ జేమ్స్ మారాపే తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం లో పాలుపంచుకొన్నారు.పాపువా న్యూ గినీ లోని పోర్ట్ మోరెస్బీ కి చేరుకున్న ప్రధాన మంత్రి
May 21st, 08:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం మే నెల 21వ తేదీ నాటి సాయంత్రం పూట పోర్ట్ మోరెస్ బీ కి చేరుకొన్నారు. పాపువా న్యూ గినీ ప్రధాని శ్రీ జేమ్స్ మారాపే విమానాశ్రయం వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఆత్మీయ గా ఆహ్వానం పలికారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి 19 శతఘ్నుల వందనం తో పాటు గౌరవ వందనాన్ని సమర్పించడం జరిగింది.ప్రధాన మంత్రి జాపాన్ ను, పాపువా న్యూ గినీ ని మరియు ఆస్ట్రేలియా ను సందర్శించడానికి బయలుదేరే ముందు ఆయన చేసిన ప్రకటన
May 19th, 08:38 am
జాపాన్ ప్రధాని శ్రీ ఫుమియొ కిశిదా ఆహ్వానించిన మీదట జాపాన్ అధ్యక్షత న జరిగే జి-7 సమిట్ కు హాజరు కావడం కోసం జాపాన్ లోని హిరోశిమా కు నేను పయనం అవుతున్నాను. ఇండియా-జాపాన్ సమిట్ లో పాలుపంచుకోవడం కోసం ప్రధాని శ్రీ కిశిదా ఇటీవలే భారతదేశాన్ని సందర్శించిన తరువాత మరో సారి ఆయన ను కలుసుకోవడం ఆనందదాయకమే కాగలదు. భారతదేశం జి-20 కి అధ్యక్షత ను వహిస్తున్న ఈ సంవత్సరం లో, జి-7 శిఖర సమ్మేళనాని కి నేను హాజరు కానుండడం మరీ ముఖ్యం గా మహత్వపూర్ణమైందేనని చెప్పాలి. నేను జి-7 సభ్యత్వ దేశాల తో మరియు ఆహ్వానాలు అందిన సభ్యత్వ దేశాల తో ప్రపంచం ఎదుటకు వస్తున్నటువంటి సవాళ్లకు మరియు వాటినన్నింటిని ఉద్దేశించి సామూహికం గా ప్రసంగించడం ద్వారా సంబంధి ఆలోచనల ను వెల్లడించడం కోసం ఉత్సాహంతో ఉన్నాను. దీనికి తోడు హిరోశిమా జి-7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొనే కొందరు నేతల తో కలసి ద్వైపాక్షిక సమావేశాల ను సైతం నేను నిర్వహించనున్నాను.