PM Modi thanks President of Guyana for his support to 'Ek Ped Maa ke Naam' initiative
November 25th, 10:39 am
The Prime Minister, Shri Narendra Modi today thanked Dr. Irfaan Ali, the President of Guyana for his support to Ek Ped Maa Ke Naam initiative. Shri Modi reiterated about his appreciation to the Indian community in Guyana in yesterday’s Mann Ki Baat episode.గయానాలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారులను కలిసిన ప్రధానమంత్రి
November 22nd, 05:31 am
గయానాలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. భారతదేశానికి, గయానాకు మధ్య ఆత్మీయతను క్రికెట్ పెంచిందని, రెండు దేశాల సాంస్కృతిక సంబంధాలను బల పరిచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నివాళి
November 22nd, 03:09 am
గయానా లోని జార్జ్ టౌన్ లో ఉన్న ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గయానాలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో వారి కృషి, పాత్ర ప్రశంసనీయమని శ్రీ మోదీ కొనియాడారు. స్వామి దయానంద సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు.గయానాలో భారత సంస్కృతీ సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయి: ప్రధాన మంత్రి
November 22nd, 03:06 am
భారత్-గయానా సాంస్కృతిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో స్వామి అక్షరానంద విశేష కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సరస్వతీ విద్యా నికేతన్ పాఠశాలను సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయని వ్యాఖ్యానించారు.గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 22nd, 03:02 am
మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.గయానాలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం గయానాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాలను ప్రభావితం చేస్తూ గయానా అభివృద్ధికి దోహదపడ్డారు: ప్రధానమంత్రి
November 22nd, 03:00 am
గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.సురినామ్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 10:57 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండవ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సురినామ్ దేశాధ్యక్షుడు శ్రీ చంద్రికాపర్సాద్ సంతోఖీతో నవంబర్ 20వ తేదీన భేటీ అయ్యారు.గ్రెనడా ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 21st, 10:44 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, నవంబర్ 20వ తేదీన గ్రెనడా ప్రధానమంత్రి శ్రీ డికన్ మిచెల్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రితో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 21st, 10:42 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 20వ తేదీన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీ కీత్ రౌలీతో సమావేశమయ్యారు.భారత ఆగమన స్మృతి చిహ్నాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
November 21st, 10:00 pm
జార్జ్ టౌన్ లోని స్మారకోద్యానవనంలో భారత ఆగమన స్మృతిచిహ్నాన్ని ప్రధానమంత్రి సందర్శించారు. ఆయన వెంట గయానా ప్రధానమంత్రి బ్రిగేడియర్ (విశ్రాంత) మార్క్ ఫిలిప్స్ ఉన్నారు. అక్కడ పూలమాలలు వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రికి టస్సా డోలు బృందం స్వాగతం పలికింది. స్మృతిచిహ్నం వద్ద నివాళి అర్పించిన ప్రధానమంత్రి.. గయానాలోని భారత సంతతికి చెందిన వారి పోరాటాన్నీ, త్యాగాలనూ.. గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి విశేష కృషినీ గుర్తుచేసుకున్నారు. స్మృతిచిహ్నం వద్ద ఆయన బేల్ పత్ర మొక్క నాటారు.మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ప్రధానమంత్రి
November 21st, 09:57 pm
గయానాలోని జార్జ్ టౌన్ లో ఉన్న చారిత్రక విహారోద్యానవనంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. బాపూ బోధించిన శాంతి, అహింసా విలువలను గుర్తుచేసుకున్న ఆయన.. అవి మానవాళికి ఎప్పటికీ దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయన్నారు. గాంధీజీ శతజయంతి సందర్భంగా 1969లో ఆ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పారు.డొమినికా ప్రధానమంత్రిని కలిసిన భారత ప్రధానమంత్రి
November 21st, 09:29 pm
భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గయానాలోని జార్జ్ టౌన్‌లో డొమినికా ప్రధానమంత్రి శ్రీ రూజ్‌వెల్ట్ స్కెరిట్‌తో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi
November 21st, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.గయానా పార్లమెంటునుద్దేశించి భారత ప్రధానమంత్రి ప్రసంగం
November 21st, 07:50 pm
గయానా పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అలా ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రి ఆయనే. ఈ ప్రసంగం కోసం స్పీకర్ శ్రీ మంజూర్ నాదిర్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.సెయింట్ లూసియా ప్రధానితో భారత ప్రధాని భేటీ
November 21st, 10:13 am
భారత్-కారికోమ్ రెండో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సెయింట్ లూసియా ప్రధానమంత్రి హెచ్.ఇ. ఫిలిప్ జె. పియర్ తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చలు నిర్వహించారు. నవంబరు 20న జరిగిన ఈ చర్చలు ఫలప్రదంగా జరిగాయి.PM Modi meets with Prime Minister of Antigua and Barbuda
November 21st, 09:37 am
PM Modi met Antigua and Barbuda PM Gaston Browne during the 2nd India-CARICOM Summit in Guyana. They discussed trade, investment, and SIDS capacity building. PM Browne praised India’s 7-point CARICOM plan and reiterated support for India’s UN Security Council bid.బహమాస్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 09:25 am
బహమాస్ ప్రధాని శ్రీ ఫిలిప్ డేవిస్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కారికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. ప్రధానమంత్రులు ఇరువురూ సమావేశం కావడం ఇదే మొదటిసారి.బార్బడోస్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 09:13 am
బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్‌లీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కేరికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. భారత- బార్బడోస్‌ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ఘాటించడంతోపాటు ఆ సంబంధాలను బల పరచడానికి ఇద్దరు నేతలకు ఒక అవకాశాన్ని ఈ ఉన్నతస్థాయి సమావేశం అందించింది.PM Modi conferred with The Order of Excellence of Guyana
November 21st, 07:41 am
PM Modi was conferred Guyana's highest national award, The Order of Excellence, by President Dr. Mohamed Irfaan Ali for his visionary leadership and efforts to strengthen India-Guyana ties. The PM dedicated the honor to the people of India and the deep historical bond between the nations.PM Modi conferred with Dominica's highest National Award
November 21st, 05:39 am
PM Modi received the Dominica Award of Honour, the highest national award of Dominica, from President Sylvanie Burton for his leadership, pandemic support, and efforts to strengthen ties. The ceremony, attended by several CARICOM leaders, highlighted the deep-rooted historical and cultural bonds between India and Dominica. PM Modi dedicated the award to the people of India, reaffirming his commitment to enhancing bilateral relations.