ఈజిప్టు అధ్యక్షడితో ప్రధానమంత్రి సమావేశం

June 25th, 08:33 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మోదీకి 2023 జూన్‌ 25న అరబ్ గణతంత్ర ఈజిప్టులోని అల్-ఇత్తెహాదియా రాచభవనంలో దేశాధ్యక్షుడు మాననీయ అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ ఏడాది (2023) జనవరిలో భారత గణతంత్ర దినోత్సవాలకు అధ్యక్షుడు సిసి ముఖ్య అతిథిగా హాజరు కావడాన్ని నాయకులిద్దరూ సౌహార్దపూర్వకంగా గుర్తు చేసుకున్నారు. ఈ ఘట్టంతో ద్వైపాక్షిక సంబంధాలు వేగం పుంజుకోవడంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు నడపడంలో ఇటీవల ఈజిప్టు మంత్రిమండలిలో ఏర్పాటైన ‘భారత యూనిట్‌’ ప్రయోజనకర ఉపకరణం కాగలదని వారు పేర్కొన్నారు.

ప్రధానమంత్రికి ‘ఆర్డర్‌ ఆఫ్‌ నైల్‌’ పురస్కార ప్రదానం

June 25th, 08:29 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ నైల్‌’ అందుకున్నారు. ఈ మేరకు కైరో నగరంలోని అరబ్‌ గణతంత్ర ఈజిప్ట్‌ అధ్యక్ష భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దేశాధ్యక్షుడు మాననీయ అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.

హీలియోపోలిస్ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

June 25th, 04:06 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఈజిప్టు పర్యటనలో భాగంగా కైరోనగరంలోని హీలియోపోలిస్ కామన్‌వెల్త్‌ యుద్ధవీరుల శ్మశానవాటికను సందర్శించారు. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈజిప్టుతోపాటు ఆడెన్‌ నగరంలో అమరులైన 4,300 మంది భారత వీర సైనికులకు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నివాళి అర్పించారు.

అల్‌-హకీమ్‌ మసీదును సందర్శించిన ప్రధానమంత్రి

June 25th, 04:04 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఈజిప్టు పర్యటనలో్ భాగంగా కైరో నగరంలోని ‘అల్‌-హకీమ్‌’ మసీదును సందర్శించారు.

హసన్‌ ఆలం హోల్డింగ్‌ కంపెనీ సీఈవోతో ప్రధాని సమావేశం

June 25th, 05:22 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2023 జూన్ 24న కైరో నగరానికి చెందిన అతిపెద్ద ఈజిప్టు సంస్థ హసన్‌ ఆలం హోల్డింగ్‌ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి హసన్‌ ఆలంతో సమావేశమయ్యారు. ఈ సంస్థ ప్రధానంగా మధ్యప్రాచ్యంతోపాటు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూంటుంది.

ఈజిప్టులో ప్రముఖ యోగా శిక్షకులు రీమ్‌ జబక్‌.. నదా అడెల్‌లతో ప్రధాని భేటీ

June 25th, 05:21 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈజిప్టు రాజధాని కైరో నగరంలో 2023 జూన్‌ 24న ప్రముఖ యోగా శిక్షకులు శ్రీమతి రీమ్‌ జబక్‌, శ్రీమతి నదా అడెల్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యోగాభ్యాసంపై వారి అంకితభావాన్ని ప్రధాని ప్రశంసిస్తూ- భారత్‌ సందర్శనకు రావాల్సిందిగా కోరారు. కాగా, ఈజిప్టులో యోగాభ్యాసంపై ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని వారు ప్రధానమంత్రికి వివరించారు.

ప్రముఖ ఈజిప్ట్ రచయిత, పెట్రోలియం వ్యూహకర్త తరెక్ హెగ్గీ తో ప్రధాని భేటీ

June 25th, 05:20 am

ప్రముఖ ఈజిప్షియన్ రచయిత. పెట్రోలియం వ్యూహకర్త శ్రీ తరెక్ హెగ్గీతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 24 న కైరోలో భేటీ అయ్యారు.

ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

June 25th, 05:18 am

ఈజిప్ట్ అధికార పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 2023 జూన్ 24 న ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రాహీం అల్లామ్ తో భేటీ అయ్యారు.

ఈజిప్ట్ లోని భారతీయులతో ప్రధాని మోదీ ముఖాముఖి

June 25th, 05:16 am

ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్ట్ లో అధికారిక పర్యటన సందర్భంగా 2023 జూన్ 24 న కైరోలో భారతీయులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.

ఈజిప్ట్ ప్రధాని సారధ్యంలోని మంత్రిమండలిలో ‘భారత విభాగం’ తో ప్రధాని మోదీ భేటీ

June 25th, 05:13 am

అధికారిక పర్యటన మీద కైరో చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ 2023 జూన్ 24 న ఈజిప్ట్ మంత్రిమండలి లోని ‘భారత విభాగం’ తో భేటీ అయ్యారు. 2023 రిపబ్లిక్ డే కి ఈజిప్ట్ ఉపాధ్యక్షుడు ఆబ్డెల్ ఫత్తా ఎల్ సిసి ముఖ్య అతగీతిగా హాజరైన సమయంలో ఈ ఏడాది ఆరంభంలో ఈ విభాగం ఏర్పాటైంది. ఈ భారత విభాగానికి ఈజిప్ట్ ప్రధాని ముస్తఫా మాద్ బౌలీ నాయకత్వం వహిస్తున్నారు.

Prime Minister Modi arrives in Cairo, Egypt

June 24th, 06:30 pm

Prime Minister Narendra Modi arrived in Cairo, Egypt a short while ago. In a special gesture he was received by the Prime Minister of Egypt at the airport. PM Modi was given a ceremonial welcome upon arrival.

ప్రధాన మంత్రి యుఎస్ఎ కు మరియు ఈజిప్టు కు తనయాత్రార్థం బయలుదేరి వెళ్ళే కంటే ముందుగా జారీ చేసిన ప్రకటన

June 20th, 07:00 am

అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ మరియు ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ గారు లు ఆహ్వానించిన మీదట నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల కు ఆధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరి వెళుతున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం మన ఉభయ ప్రజాస్వామ్య దేశాల మధ్య నెలకొన్న భాగస్వామ్యం యొక్క శక్తి కి మరియు కీలకత్వాని కి అద్దం పడుతున్నది.