బ్రూనై సుల్తానుతో సమావేశం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం ఆంగ్ల పాఠానికి అనువాదం
September 04th, 03:18 pm
సాదర వచనాలతో స్వాగతించి, ఘనంగా ఆతిథ్యమిచ్చిన మీకు, రాజ కుటుంబానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.బ్రూనై సుల్తానుతో విందు సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠానికి ఆంగ్లానువాదం
September 04th, 12:32 pm
సాదరంగా స్వాగతించి, ఘనంగా ఆతిథ్యమిచ్చిన గౌరవనీయులైన రాజుగారికీ, రాజ కుటుంబానికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక్కడ నాకు లభించిన ఆప్యాయత, మీరు చూపిన ఆదరణ మన దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి అనుబంధాన్ని నాకు గుర్తు చేసింది.బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియాతో ప్రధాన మంత్రి సమావేశం
September 04th, 12:11 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున బందర్ సెరీ బెగవాన్ లోని ఇస్తానా నూరుల్ ఇమాన్ కు చేరుకున్నారు. అక్కడ బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియా ప్రధాన మంత్రి కి స్నేహపూర్వకంగా స్వాగతం పలికారు.బందర్ శేరి బెగావన్ లోని ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించిన ప్రధాని
September 03rd, 08:07 pm
బందర్ శేరి బెగావన్ లోని ప్రసిద్ధ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. బ్రూనై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హాజీ మహమ్మద్ ఇషామ్ తో కలిసి ఆ దేశ మత వ్యవహారాల మంత్రి హెచ్‌ఈ పెహిన్ దాటో ఉస్తాజ్ హాజీ అవాంగ్ బదరుద్దీన్ ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి భారతీయులు కూడా వచ్చి ప్రధానిని కలిశారు.బ్రూనైలో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి మోదీ
September 03rd, 05:56 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బ్రూనైలో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దీపం వెలిగించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.అధికారిక పర్యటన నిమిత్తం బ్రూనై చేరుకున్న ప్రధాని
September 03rd, 03:46 pm
భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి పర్యటన చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది.