2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో స్పెయిన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా భారత్-స్పెయిన్ సంయుక్త ప్రకటన
October 28th, 06:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో శాంచెజ్ 2024 అక్టోబర్ 28, 29 తేదీల్లో భారత్ లో అధికారికంగా పర్యటించారు. అధ్యక్షుడు శాంచెజ్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. 18 ఏళ్ల తర్వాత స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట రవాణా, సుస్థిర రవాణా శాఖ మంత్రి, పరిశ్రమలు, పర్యాటక శాఖ మంత్రులతో పాటు ఉన్నత స్థాయి అధికార, వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.గ్రీస్ ప్రధాన మంత్రి భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం (ఫిబ్రవరి 21, 2024)
February 21st, 01:30 pm
ప్రధాన మంత్రి మిత్సోటకిస్ కు , ఆయన ప్రతినిధి బృందానికి భారత్ కు స్వాగతం పలకడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గత ఏడాది గ్రీస్ లో నేను జరిపిన పర్యటన తరువాత ఆయన భారత పర్యటన కు రావడం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటానికి సంకేతం. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత, పదహారేళ్ల తర్వాత గ్రీస్ ప్రధాని భారత్ కు రావడం చారిత్రాత్మక ఘట్టం.