14,15న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సుకు అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి
December 13th, 12:53 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 14,15 తేదీల్లో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సు ఏర్పాటవుతోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు కీలకమైన మరో అడుగు కానుంది.ఉపాధి సమ్మేళనంలో 51,000 మందికిపైగా అభ్యర్థులకు నియామకపత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 29th, 11:00 am
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మంత్రిమండలి సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దేశవ్యాప్తంగాగల యువ మిత్రులు, సోదరసోదరీమణులారా!రోజ్‌గార్ మేళాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 29th, 10:30 am
వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల్లో నూతనంగా నియమితులైన 51 వేల మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు నియామకపత్రాలు అందించారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు ఉద్యోగాలను కల్పించే అంశంలో ప్రధానమంత్రి కృతనిశ్చయాన్ని ఈ రోజ్‌గార్ మేళా తెలియజేస్తుంది. ఇది యువతకు తగిన అవకాశాలు కల్పించి జాతి నిర్మాణానికి సహకరిస్తుంది.'కర్మయోగి సప్తాహ్' - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
October 19th, 06:57 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కర్మయోగి సప్తాహ్ - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించారు.‘కర్మయోగి శపథ్’-జాతీయ అభ్యాస వారాన్ని అక్టోబర్ 19న ప్రారంభించనున్న ప్రధానమంత్రి
October 18th, 11:42 am
‘‘కర్మయోగి శపథ్’’ – జాతీయ అభ్యాస వారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (అక్టోబర్ 19) ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.Rozgar Melas plays a crucial role in enhancing the contribution of our Yuva Shakti in nation building: PM Modi
February 12th, 11:00 am
PM Modi distributed more than 1 lakh appointment letters to newly inducted recruits via video conferencing. “Today, every youth believes that they can cement their job position with hard work and skills”, PM Modi said, highlighting that the government strives to make the youth a partner in the development of the nation. He informed that the present government in the last 10 years has handed out jobs to the youth 1.5 times more than the previous governments.ఉపాధి సమ్మేళనం కింద ప్రభుత్వ శాఖలు.. సంస్థల్లో కొత్తగా చేరేవారికి లక్షకుపైగా నియామక లేఖలు అందజేసిన ప్రధానమంత్రి
February 12th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వివిధ విభాగాలు.. సంస్థలలో కొత్తగా చేరేవారికి లక్షకుపైగా నియామక లేఖలు అందజేశారు. అలాగే న్యూఢిల్లీలోని ‘‘కర్మయోగి భవన్’’ సమీకృత ప్రాంగణం తొలిదశ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మిషన్ కర్మయోగి సంబంధిత వివిధ మూలస్తంభాల మధ్య సహకారం, సమన్వయానికి ఈ ప్రాంగణం తోడ్పడుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- నియామక లేఖలు అందుకున్న యువతరానికి, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో యువతరానికి ఉద్యోగావకాశాల కల్పన కార్యక్రమం పూర్తిస్థాయిలో కొనసాగుతున్నదని ఆయన ఉద్ఘాటించారు.రోజ్‌గార్ మేళా కింద, ఫిబ్రవరి 12న ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారు 1 లక్షకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి
February 11th, 03:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 12 ఫిబ్రవరి, 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన రిక్రూట్‌లకు 1 లక్షకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా, న్యూఢిల్లీలోని సమీకృత కాంప్లెక్స్ కర్మయోగి భవన్ మొదటి దశకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కాంప్లెక్స్ మిషన్ కర్మయోగి వివిధ విభాగాల మధ్య సహకారం, సినర్జీని ప్రోత్సహిస్తుంది. రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. ఈ చొరవకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు/యుటీలలో రిక్రూట్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కొత్త రిక్రూట్‌లు వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో ప్రభుత్వంలో చేరతారు. రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, అణు శక్తి శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ హోదాల్లో ఈ నియామకాలు జరిగాయి.Fight against corruption, action against corrupt people has been the priority of the govt: PM Modi
January 16th, 04:00 pm
Prime Minister Narendra Modi inaugurated the new campus of National Academy of Customs, Indirect Taxes & Narcotics at Palasamudram, Sri Sathya Sai District in Andhra Pradesh. He also took a walkthrough of the exhibition showcased on the occasion. Highlighting the speciality of the region of Palasamudram, the Prime Minister said that it is associated with spirituality, nation building and good governance and represents the heritage of India. He expressed confidence that the new campus of NACIN will create new dimensions of good governance and give a boost to trade and industry in the nation.ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో కస్టమ్స్-పరోక్ష పన్నులు-నార్కోటిక్స్ జాతీయ అకాడమీ కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
January 16th, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం గ్రామంలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్-నార్కోటిక్స్ (ఎన్ఎసిఐఎన్-నాసిన్) కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. అలాగే ‘ఇండియన్ రెవెన్యూ సర్వీస్’ (కస్టమ్-పరోక్ష పన్నులు) 74, 75వ బృందాల ఆఫీసర్ ట్రైనీలతోపాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతోనూ ప్రధాని కొద్దిసేపు మాటామంతీలో పాల్గొన్నారు.రోజ్ గార్ మేళా లో 51,000 పై గా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
November 30th, 04:30 pm
దేశంలో లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న ప్రచారం కొనసాగుతోంది. నేడు 50 వేల మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారు. ఈ నియామక పత్రాలు అందుకోవడం మీ కృషి, ప్రతిభ ఫలితమే. మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక అభినందనలు.రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
November 30th, 04:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో రోజ్ గార్ మేళానుద్దేశించి ప్రసంగించి, నియామకప్రక్రియలో కొత్తగా ఎంపికైన 51,000 మందికి నియామకపత్రాలు పంపిణీ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ అభ్యర్థులు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/రెవిన్యూ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ; పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ; ఆర్థిక వ్యవహారాల శాఖ, రక్షణ శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ; కార్మిక, ఉపాధికల్పన శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో చేరనున్నారు.ప్రభుత్వ విభాగాల లో మరియు సంస్థల లో క్రొత్త గా ఉద్యోగాల లో నియమించిన వ్యక్తుల కు 51,000 కు పైగా నియామక లేఖల ను రోజ్ గార్ మేళా లో భాగంగా నవంబరు 30 వ తేదీ నాడుపంపిణీ చేయనున్న ప్రధాన మంత్రి
November 28th, 05:19 pm
ఉద్యోగాల లో క్రొత్త గా నియమించిన వారికి సంబంధించిన 51,000 కు పైచిలుకు నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 నవంబరు 30 వ తేదీ నాడు సాయంత్రం పూట నాలుగు గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఉద్యోగ నియామకం జరిగిన వ్యక్తుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రసంగించనున్నారు.India made G20 a people-driven national movement: PM Modi
September 26th, 04:12 pm
PM Modi addressed the G20 University Connect Finale programme at Bharat Mandapam in New Delhi. Addressing the event, PM Modi credited the happenings in India to the youthful energy of the nation and said, Events of such scale are bound to be a success when the youth associate themselves with it.” It is evident from the activities of the last 30 days that India is becoming a happening place, the Prime Minister added.జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం భారత్‌లో జి-20 సదస్సు సంబంధిత నాలుగు ప్రచురణల ఆవిష్కరణ;
September 26th, 04:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూఢిల్లీలోని భారత మండపంలో ‘జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. దేశంలోని యువతరంలో భారత జి-20 అధ్యక్షతపై అవగాహన పెంపు, సంబంధిత కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం లక్ష్యంగా విశ్వవిద్యాలయ అనుసంధానం కార్యక్రమం చేపట్టబడింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాని జి-20 సంబంధిత 4 ప్రచురణలు- “జి20 అధ్యక్షతలో భారత్ ఘన విజయం-దార్శనిక నాయకత్వం-సార్వజనీన విధానం; జి-20కి భారత అధ్యక్షత- వసుధైవ కుటుంబకం; జి-20 విశ్వవిద్యాలయ అనుసంధాన కార్యక్రమ సంగ్రహం; జి-20లో భారతీయ సంస్కృతీ ప్రదర్శన”ను ఆవిష్కరించారు.రోజ్ గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం
September 26th, 11:04 am
నేటి రోజ్ గార్ మేళాలో ప్రభుత్వోద్యోగాలకు నియామక పత్రాలు అందుకుంటున్న అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎంతో కఠిన శ్రమ అనంతరం మీరందరూ ఈ విజయం సాధించారు. లక్షలాది మంది పోటీదారులను ఎదుర్కొని మీరు ఈ విజయం సాధించినందున మీ జీవితంలో ఇది అత్యంత ప్రత్యేకమైనది.రోజ్‌గార్ మేళానుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
September 26th, 10:38 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రోజ్‌గార్ మేళాలో ప్రసంగించారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఉద్యోగాలలో చేరిన వారికి దాదాపు 51,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిక్రూట్‌లు వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో చేరారు. అవి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిఫెన్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. దేశవ్యాప్తంగా 46 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా జరిగింది.రోజ్ గార్ మేళా లో భాగం గా ప్రభుత్వ విభాగాల లో, సంస్థల లో క్రొత్త గా భర్తీ చేసుకొన్న వారికి 51 ,000 నియామక లేఖల ను సెప్టెంబరు 26 వ తేదీ నాడు పంపిణీ చేయనున్న ప్రధాన మంత్రి
September 25th, 02:55 pm
ఉద్యోగాల లోకి క్రొత్త గా నియామకం అయిన వారికి సంబంధించిన సుమారు 51,000 నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబరు 26 వ తేదీ నాడు ఉదయం పూట పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. నూతనం గా నియామకం జరిగిన వారిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు కూడాను.యశోభూమిని జాతికి అంకితం చేసి, పిఎం విశ్వకర్మ పథకం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 17th, 06:08 pm
నేడు భగవాన్ విశ్వకర్మ జయంతి మహోత్సవం. మన సాంప్రదాయిక కళాకారులు, హస్తకళాకారులకు ఈ రోజు అంకితం. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వకర్మ మిత్రులతో కూడా ఈ సందర్భంగా అనుసంధానం అయ్యే అవకాశం నాకు కలిగింది. కొద్ది సమయం క్రితమే నేను విశ్వకర్మ సోదరసోదరీమణులతో నేను సంభాషించాను. వారితో సంభాషిస్తూ ఉండడం వల్లనే నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చాలా అద్భుతమైనది, అది వదిలి వెళ్లాలని నేను భావించలేకపోయాను. దాన్ని సందర్శించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ ప్రదర్శన మరో రెండు మూడు రోజులుంటుందని నాకు చెప్పారు. ప్రదర్శనను సందర్శించాలని నేను ఢిల్లీ ప్రజలను కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను.న్యూఢిల్లీలో భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి
September 17th, 12:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ‘భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం’ (ఐసిఇసి) ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అద్భుతమైన సదస్సుల వేదిక, బహుళ ప్రదర్శనశాలలు, ఇతర అధునాతన సౌకర్యాలున్నాయి. మరోవైపు విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ వృత్తి నిపుణులు, హస్తకళాకారుల కోసం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ కూడా ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైంది. అలాగే ‘పీఎం విశ్వకర్మ’ లోగో, నినాదం, పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపుల ఫలకం, ఉపకరణసమూహ కరదీపికలతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 18 మంది లబ్ధిదారులకు విశ్వకర్మ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.