స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొనే విద్యార్థులతో డిసెంబర్ 11న ప్రధానమంత్రి మాటామంతీ
December 09th, 07:38 pm
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో భాగంగా గ్రాండ్ ఫినాలేని 2024 డిసెంబర్ 11న నిర్వహించనున్నారు. ఆ పోటీలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం సుమారు 4:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. గ్రాండ్ ఫినాలేలో 1300 మందికి పైగా విద్యార్థి బృందాలు పాలుపంచుకోనున్నాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.డబ్ల్యుహెచ్ఒ యొక్క డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెసస్ కు భారతదేశం లో స్వాగతం పలికిన ప్రధాన మంత్రి
August 16th, 02:39 pm
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) యొక్క డైరక్టర్ జనరల్ డాక్టర్ శ్రీ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెసస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశాని కి ఆహ్వానించారు. డాక్టర్ శ్రీ టెడ్రోస్ ఇదివరకు భారతదేశాన్ని సందర్శించిన సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ‘తులసి భాయి’ అనే పేరు ను పెట్టారు.