
భారత ప్రధానమంత్రి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంయుక్త ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం
August 05th, 11:06 am
భారతదేశానికి వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, ఆయన బృందానికి మొదట హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. ఈ ఏడాది భారత్, ఫిలిప్పీన్స్ 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకలను జరుపుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వీరి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన దౌత్య సంబంధాలు ఈమధ్యే ప్రారంభమైనవైనప్పటికీ, మన నాగరికతల బంధం చాలా పురాతనమైనది. ఫిలిప్పీన్స్ రామాయణ రూపం అయిన మహారదియా లవానా మన సాంస్కృతిక సంబంధాల ప్రత్యేకతను తెలియజెబుతుంది. ఇరుదేశాల జాతీయ పుష్పాలతో విడుదల చేసిన తపాలా స్టాంపులు మన స్నేహ పరిమళాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
భారత్- బ్రిటన్ దార్శనికత 2035
July 24th, 07:12 pm
జూలై 24న జరిగిన సమావేశంలో “భారత్- బ్రిటన్ దార్శనికత 2035”ను ఇరు దేశాల ప్రధానమంత్రులు ఆమోదించారు. రెండు దేశాలు తమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకునేలా చేసే వాణిజ్య ఒప్పందం కుదిరిన అనంతరం దీనికి ఆమోదం తెలపటం అనేది నాయకుల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంతో పరస్పర వృద్ధి, శ్రేయస్సు కోసం ఉభయ దేశాలు కలిసి చేయనున్నాయి. వేగంగా మారుతోన్న ప్రస్తుత సమయంలో సుసంపన్న, సురక్షిత, సుస్థిర ప్రపంచాన్ని రూపొందించేందుకు రెండు దేశాల సంకల్పాన్ని ఈ ఒప్పందం తెలియజేస్తోంది.
రోజ్‌గార్ మేళా కింద 51,000కు పైగా నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
July 12th, 11:30 am
కేంద్ర ప్రభుత్వంలో యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే దిశగా మా చర్యలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సిఫార్సు లేదు, అవినీతి లేదు- ఈ విధానానికి మేం కట్టుబడి ఉన్నాం. నేడు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందించాం. ఇలాంటి రోజ్‌గార్ మేళాల ద్వారా లక్షలాది మంది యువత ఇప్పటికే భారత ప్రభుత్వంలో శాశ్వత కొలువులను పొందారు. ఈ యువత ఇప్పుడు దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోంది. నేడు మీలో చాలా మంది భారతీయ రైల్వేలలో బాధ్యతలను మొదలుపెట్టారు. కొందరు దేశ భద్రతకు రక్షకులవుతుండగా, మరికొందరు తపాలా శాఖలో నియమితులై ప్రభుత్వ సేవలను ఊరూరా చేరవేయబోతున్నారు. ‘అందరికీ ఆరోగ్యం’ మిషన్‌లో అడుగుపెట్టబోయే సైనికులు మరికొందరు. ఆర్థిక సమ్మిళిత్వాన్ని వేగవంతం చేసేలా సేవలందించేందుకు యువ నిపుణులనేకులు సిద్ధమవుతుండగా, మరికొందరు దేశ పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించబోతున్నారు. మీ విభాగాలు వేరు కావచ్చు... కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. విభాగం, పని, హోదా, ప్రాంతం ఏవైనా సరే – దేశ సేవే ఏకైక లక్ష్యం. మళ్లీమళ్లీ మనం దీన్ని మననం చేసుకోవాలి. ప్రజలే ప్రథమం: ఇదే మన మార్గదర్శక సూత్రం. దేశ ప్రజలకు సేవ చేయడానికి మీకు గొప్ప వేదిక లభించింది. జీవితంలోని ఈ ముఖ్యమైన దశలో ఇంత గొప్ప విజయాన్ని సాధించిన మీ అందరికీ అభినందనలు. కెరీర్‌లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న మీకు నా శుభాకాంక్షలు.రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 12th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు వీడియో అనుసంధానం ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఈ యువత కొత్త బాధ్యతలు ప్రారంభించనున్నదని తెలిపారు. వివిధ విభాగాల్లో తమ సేవలను ప్రారంభిస్తున్న యువకులను ఆయన అభినందించారు. ఉద్యోగ నిర్వహణలో ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ.. పౌరులకు ప్రథమ ప్రాధాన్యం అనే సూత్ర మార్గనిర్దేశంలో దేశానికి సేవ చేయడమే వారి సమష్టి లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.పత్తి దిగుబడిపై చర్చ కోసం ఉన్నత స్థాయి సమావేశాన్ని
July 09th, 07:55 pm
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పంటల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఈనెల 11న కోయంబత్తూరులో పత్తి దిగుబడి అంశంపై కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో తెలిపారు. భారత రైతు సోదరసోదరీమణులంతా పత్తి దిగుబడి పెంపు గురించి సూచనలు ఇవ్వాలని ఆయన ఆహ్వానించారు.ఘనా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన... ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం
July 03rd, 12:32 am
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాను సందర్శించారు.ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
July 02nd, 07:34 am
జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వాతో చర్చిస్తాను.ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
June 20th, 04:16 pm
ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన మన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఘీ, నా కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ జువాల్ ఓరం, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ అశ్వినీ వైష్ణవ్, ఒడిశా ఉప ముఖ్యమంత్రులు శ్రీ కనక్ వర్ధన్ సింగ్ దేవ్, శ్రీమతి ప్రవతి పరీడా, రాష్ట్ర మంత్రులూ, పార్లమెంటు సభ్యు లూ, శాసనసభ సభ్యులూ, ఇంకా నా ఒడిశా సోదరసోదరీమణులారా!ఒడిశా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రూ. 18,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు
June 20th, 04:15 pm
ఒడిశా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భువనేశ్వర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఒడిశా సమగ్ర అభివృద్ధి పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా.. తాగునీరు, నీటిపారుదల, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, గ్రామీణ రహదారులు-వంతెనలు, జాతీయ రహదారుల విభాగాలు, కొత్త రైల్వే లైన్ పనులు సహా కీలక రంగాలకు సంబంధించి, రూ. 18,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 18th, 08:02 am
అల్బెర్టాలోని కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఈ రోజు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.పరాగ్వే అధ్యక్షునితో ప్రతినిధి వర్గ స్థాయి చర్చల సందర్భంగా ప్రధానమంత్రి ఆహ్వాన ప్రకటన
June 02nd, 03:00 pm
మీతో పాటు మీ ప్రతినిధి వర్గానికి మేం చాలా స్నేహపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతున్నాం. దక్షిణ అమెరికాలో పరాగ్వే ఒక ముఖ్య భాగస్వామ్య దేశంగా ఉంది. భౌగోళికంగా చూస్తే మన దేశాలు వేరు కావచ్చు, కానీ మనం ఒకే తరహా ప్రజాస్వామిక విలువలను పంచుకొంటున్నాం. అంతేకాక మన దేశాల ప్రజల అభ్యున్నతి పట్ల కూడా మనం శ్రద్ధ తీసుకొంటున్నాం.ఇండియా స్టీల్ 2025 కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
April 24th, 02:00 pm
నేటి నుంచి రెండు రోజుల వరకు, భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ఉక్కు రంగ సామర్థ్యం, అవకాశాల గురించి విస్తృతమైన చర్చల్లో మనం పాల్గొనబోతున్నాం. దేశాభివృద్ధికి వెన్నెముకగా వికసిత్ భారత్ కు బలమైన పునాదిగా దేశాభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని ఈ రంగం లిఖిస్తుంది. ఇండియా స్టీల్ 2025కు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. నూతన ఆలోచనలు పంచుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఓ మంచి వేదికగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. స్టీలు రంగంలో నూతన అధ్యాయ ప్రారంభానికి ఇది పునాది వేస్తుంది.ఇండియా స్టీల్ 2025 కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 24th, 01:30 pm
ముంబయిలో నిర్వహిస్తున్న ఇండియా స్టీల్ 2025 కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. భారత్‌లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న, భవిష్యత్తులో విస్తృతంగా అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలున్న ఉక్కు రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ వచ్చే రెండు రోజులపాటు చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రంగం భారత పురోగతికి పునాది వేస్తుందని, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేలా భారత మూలాలను బలోపేతం చేస్తుందని, విప్లవాత్మకమైన మార్పుల దిశగా దేశంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా స్టీల్- 2025 కార్యక్రమానికి ప్రతి ఒక్కరికీ ఆయన ఆహ్వానం పలికారు. కొత్త ఆలోచనలను పంచుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ప్రయోగ వేదికగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఉక్కు రంగంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.చిలీ అధ్యక్షుడు గేబ్రియల్ బోరిక్ ఫాంట్ కు ఢిల్లీలో ప్రధానమంత్రి ఆతిథ్యం
April 01st, 09:33 pm
భారత్-చిలీ భాగస్వామ్యంలో మరో కీలక అడుగుకి సంకేతంగా చిలీ అధ్యక్షుడు గేబ్రియల్ బోరిక్ ఫాంట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో సాదర స్వాగతం పలికారు. లాటిన్ అమెరికాలో భారత్ కు చిలీ కీలక భాగస్వామి అని, అధ్యక్షుడు బోరిక్ కు ఆతిథ్యం ఇవ్వడం సంతోషాన్నిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.భారత్-న్యూజిలాండ్ సంయుక్త పత్రికా సమావేశం సందర్భంగా ప్రధాని ప్రకటన
March 17th, 01:05 pm
న్యూజిలాండ్ ప్రధానమంత్రి లగ్జాన్, ఆయన ప్రతినిధి బృందానికి హృదయపూర్వకంగా భారత్‌కు స్వాగతం పలుకుతున్నాను. ప్రధానమంత్రి లగ్జాన్‌కు ఈ దేశంతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఆక్లాండ్‌లో హోలీ పండుగను ఆనందోత్సాహాలతో ఆయన ఎలా జరుపుకొన్నారో కొన్ని రోజుల కిందటే మనమందరం చూశాం. భారత్ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయన వెంట వచ్చిన ప్రతినిధులను బట్టి, న్యూజిలాండ్ లో నివసిస్తున్న భారత సంతతి ప్రజల పట్ల ప్రధాని లగ్జాన్‌కు ఎంతటి ఆప్యాయతాభిమానాలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఆయనలాంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రతిభావంతుడైన నాయకుడు ఈ ఏడాది రైజీనా డైలాగ్‌కు ముఖ్య అతిథిగా రావడం సంతోషదాయకం.రూ. 34,300 కోట్లతో ఏడేళ్ల కాలానికి ‘జాతీయ కీలక ఖనిజాల మిషన్’ను ఆమోదించిన క్యాబినెట్..
January 29th, 03:08 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి రూ. 16,300 కోట్ల వ్యయంతో జాతీయ కీలక ఖనిజాల మిషన్ (ఎన్ సీఎంఎం)ను ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగం.. మరి ఇతర సంస్థల ద్వారా రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.Experts and investors around the world are excited about India: PM Modi in Rajasthan
December 09th, 11:00 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.PM Modi inaugurates Rising Rajasthan Global Investment Summit
December 09th, 10:34 am
PM Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit 2024 and Rajasthan Global Business Expo in Jaipur, highlighting India's rapid economic growth, digital advancements, and youth power. He emphasized India's rise as the 5th largest economy, doubling exports and FDI, and the transformative impact of tech-driven initiatives like UPI and DBT.Odisha is experiencing unprecedented development: PM Modi in Bhubaneswar
November 29th, 04:31 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.PM Modi's Commitment to Making Odisha a Global Hub of Growth and Opportunity
November 29th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.