బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ చైర్మన్ సీనియర్ జనరల్ మింగ్ ఆంగ్ హ్లాయింగ్‌తో ప్రధానమంత్రి భేటీ

బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ చైర్మన్ సీనియర్ జనరల్ మింగ్ ఆంగ్ హ్లాయింగ్‌తో ప్రధానమంత్రి భేటీ

April 04th, 09:43 am

మయన్మార్‌లో విధ్వంసకర భూకంపం తరువాతి స్థితినీ, మయన్మార్‌కు మానవతాపూర్వక సహాయంతోపాటు వైద్యసహాయం అందించడానికీ, ఉపశమన చర్యలు చేపట్టడానికీ ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’లో భాగంగా భారత్ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల గురించీ నేతలిద్దరూ చర్చించారు. భారత్ సహాయ కార్యకలాపాలకుగాను సీనియర్ జనరల్ కృతజ్ఞ‌త వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో.... మొదటి ప్రతిస్పందన దేశంగా భారత్.. మయన్మార్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుందనీ, అవసరమైతే మరింత సహాయక సామగ్రిని, వనరులను కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉందనీ ప్రధాని శ్రీ మోదీ తెలిపారు.

భూకంప విషాదం నేపథ్యంలో మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి

భూకంప విషాదం నేపథ్యంలో మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి

March 29th, 01:41 pm

భూకంప విషాదం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్‌కు అండగా నిలవడంలో సన్నిహిత మిత్రదేశంగా, పొరుగుదేశంగా భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ విపత్తుకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించినట్లు తెలిపిన ప్రధానమంత్రి.. బాధిత ప్రాంతాలకు తక్షణ ఉపశమనాన్ని, అవసరమైన సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.