వాద్నగర్న లో అపూర్వమైన స్వాగతం అందుకున్న ప్రధాన మంత్రి; హాట్ కేశ్వర్ దేవాలయంలో పూజ చేశారు
October 08th, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను ప్రధాన మంత్రి పదవిని స్వీకరించిన నాటి నుండి మొట్టమొదటి సారి ఈ రోజు తన స్వంత ఊరు వడ్ నగర్ లో పర్యటించినప్పుడు అపూర్వమైన స్వాగతం అందుకున్నారు. పట్టణ నివాసులు ప్రధాన మంత్రికి స్వాగతం పలికేందుకు వీధులలో గుమిగూడారు. ఆయన హాట్ కేశ్వర్ దేవాలయంలో పూజలో పాల్గొన్నారు. తాను బాలుడిగా ఉన్నప్పుడు చదువుకున్న బడికి ఆయన వెళ్లి అక్కడ కొద్దిసేపు ఉన్నారు.