కరోనా కు వ్యతిరేకం గా పోరాడడం లో 130 కోట్ల మంది దేశ ప్రజలు కనబరచిన సంకల్పంన్యూ ఇండియా యొక్క శక్తి కి సంకేతంగా ఉంది: ప్రధాన మంత్రి

April 12th, 01:23 pm

ప్రపంచం లో కెల్లా అత్యంత భారీ స్థాయి లో జరిగిన ఉచిత టీకా మందు పంపిణీ కావచ్చు, లేదా వైద్య సంబంధి మౌలిక సదుపాయల అభివృద్ధి కావచ్చు.. భారతదేశం ఆరోగ్యం రంగం లో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కరోనా కు వ్యతిరేకం గా పోరాడడం లో 130 కోట్ల మంది దేశ ప్రజలు చాటినటువంటి సంకల్పం అనేది న్యూ ఇండియా యొక్క శక్తి ని సూచిస్తోంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఆరోగ్య రంగం పై కేంద్ర బడ్జెటు తాలూకు సకారాత్మక ప్రభావం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

February 26th, 02:08 pm

కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు; దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన నిపుణులందరూ అలాగే పారామెడిక్స్, నర్సింగ్, హెల్త్ మేనేజ్‌మెంట్,టెక్నాలజీ మరియు పరిశోధనలకు సంబంధించిన ప్రముఖులందరూ; మహిళలు,పెద్దమనుషులారా

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ బ‌డ్జెట్ అనంత‌ర వెబినార్‌ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

February 26th, 09:35 am

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన బ‌డ్జెట్ అనంత‌ర వెబినార్ ను ఈరోజు ప్రారంభించారు. బ‌డ్జెట్ ను ప్ర‌భుత్వం ప్రవేశ‌పెట్టిన అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించిన వెబినార్ల‌లో ఇది ఐద‌వ‌ది. కేంద్ర మంత్రులు, ఆరోగ్య రంగ ప్రొఫెష‌నళ్లు, ప‌బ్లిక్‌, ప్రైవేటు రంగానికి చెందిన వారు, పారామెడిక్స్‌కు సంబంధించిన ప్రొఫెష‌న‌ళ్లు, న‌ర్సింగ్‌, హెల్త్ మేనేజ్‌మెంట్‌, టెక్నాల‌జీ, ప‌రిశోధ‌న రంగానికి చెందిన వారు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.

చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (CNCI) రెండవ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 07th, 01:01 pm

గౌరవనీయులైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీమతి మమతా జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు మన్సుఖ్ మాండవియా జీ, సుభాస్ సర్కార్ జీ, శంతను ఠాకూర్ జీ, జాన్ బార్లా జీ మరియు నిసిత్ ప్రమాణిక్ జీ, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి జీ, సభ్యులు CNCI కోల్‌కతా పాలకమండలి, ఆరోగ్య రంగానికి సంబంధించిన కష్టపడి పనిచేసే స్నేహితులందరూ, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మన్!

కోల్ కాతా లో ‘చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్’ కు చెందిన రెండో కేంపస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

January 07th, 01:00 pm

కోల్ కాతా లో చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ లో రెండో కేంపస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం లో హాజరు అయిన వారిలో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బనర్జీ గారు, ఇంకా కేంద్ర మంత్రులు డాక్టర్ మన్ సుఖ్ మాండవియా, డాక్టర్ సుభాష్ సర్ కార్, శ్రీ శాంతను ఠాకుర్, శ్రీ జాన్ బార్ లా మరియు శ్రీ నిసిథ్ ప్రామాణిక్ లు ఉన్నారు.

దేశమంతటా కోవిడ్-19 యొక్క స్థితి, ఓమిక్రాన్ మరియు ఆరోగ్య వ్యవస్థ లసన్నద్ధత ను సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి

December 23rd, 10:07 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సమావేశం లో కోవిడ్-19 స్థితి మరియు ఓమిక్రాన్, ఆందోళనను కలిగిస్తున్నటువంటి కొత్త వేరియంట్ (విఒసి), కోవిడ్-19 వ్యాప్తి ని నిరోధించడం, ఇంకా దానిని సంబాళించడానికి గాను సార్వజనిక స్వాస్థ్యపరమైన స్పందన తాలూకు ఉపాయాలు, మందుల అందుబాటు సహా ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల ను పటిష్టపరచడం, ఆక్సీజన్ సిలిండర్ లు మరియు కంసెన్టేటర్ లు, వెంటిలేటర్ లు, పిఎస్ఎ ప్లాంటు లు, ఐసియు/ఆక్సీజన్ సౌకర్యం కలిగిన పడకలు, మానవ వనరులు, ఐటి సహాయం, ఇంకా టీకాకరణ ఏ స్థాయి లో ఉందీ అనేటటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది.

వార‌ణాసిలో పిఎం ఆయుష్మాన్ భార‌త్ ఆరోగ్య మౌలిక వ‌స‌తుల కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

October 25th, 01:33 pm

మీ అంద‌రి అనుమ‌తితో నేను ప్రారంభిస్తున్నాను. హ‌ర హ‌ర మ‌హాదేవ్‌, బాబా విశ్వ‌నాథ్‌, మాతా అన్న‌పూర్ణ‌ల ప‌విత్ర భూమి అయిన కాశీకి చెందిన సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ వంద‌నాలు తెలియ‌చేస్తున్నాను. అంద‌రికీ హాపీ దీవాళి, దేవ్ దీపావ‌ళి, అన్న‌కూట్‌, భాయి దూజ్‌, ప్ర‌కాశోత్స‌వ్‌, చాత్ శుభాకాంక్ష‌లు.

పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ ను ప్రారంభించినప్రధాన మంత్రి

October 25th, 01:30 pm

‘పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన సుమారు 5200 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పథకాల ను కూడా వారాణసీ లో ప్రారంభించారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి లతో పాటు, కేంద్ర మంత్రులు డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ, డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, రాష్ట్ర మంత్రులు మరియు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

గోవాకు చెందిన హెచ్ సిడ‌బ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేష‌న్ ల‌బ్ధిదారుల‌తో ముఖాముఖి స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

September 18th, 10:31 am

నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్ర‌జాద‌ర‌ణ గ‌ల గోవా ముఖ్య‌మంత్రి శ్రీ ప్ర‌మోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ స‌హ‌చ‌రుడు శ్రీ శ్రీ‌పాద్ నాయ‌క్ జీ, కేంద్ర ప్ర‌భుత్వంలో నా మంత్రి మండ‌లి స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్ర‌జాప్ర‌తినిధులు, క‌రోనా పోరాట యోధులు, సోద‌ర‌సోద‌రీమ‌ణులారా!

గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి

September 18th, 10:30 am

గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.

భార‌త రాయ‌బార కార్యాల‌యాల అధిప‌తులు, వ్యాపార & వాణిజ్య రంగాల ప్ర‌తినిధుల స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ఆంగ్ల ప్ర‌సంగం పూర్తి పాఠం

August 06th, 06:31 pm

నా కేంద్ర కేబినెట్ స‌హ‌చ‌రులు, రాయ‌బారులు, హై క‌మిష‌న‌ర్లు; ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ని చేస్తున్న‌ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల అధికారులు; వివిధ ఎగుమ‌తి మండ‌లులు, వాణిజ్య మ‌రియు పారిశ్రామిక మండ‌లుల నాయ‌కులు, సోద‌ర‌సోద‌రీమ‌ణులారా!

వ‌ర్త‌క‌,, వాణిజ్య సంఘాల ప్ర‌తినిధులు; విదేశాల్లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాల అధిప‌తుల‌తో ప్ర‌ధాన‌మంత్రి స‌మావేశం

August 06th, 06:30 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం విదేశాల్లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాల అధిప‌తులు; వ్యాపార‌, వాణిజ్య సంఘాల ప్ర‌తినిధుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సంప్ర‌దింపుల‌ స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌ధాన‌మంత్రి ఇలాంటి స‌మావేశం నిర్వ‌హించ‌డం ఇదే ప్రథ‌మం. కేంద్ర వాణిజ్య మంత్రి, విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. 20కి పైగా ప్ర‌భుత్వ శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, రాష్ట్రప్ర‌భుత్వాల అధికారులు, ఎగుమ‌తుల ప్రోత్స‌హ‌క మండ‌లి, వాణిజ్య మండ‌లుల ప్ర‌తినిధులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

ఈరోజు పేదల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది: ప్రధాని మోదీ

August 03rd, 12:31 pm

గుజరాత్‌లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఈ పథకం గురించి మరింత అవగాహన కల్పించడానికి రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్య కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద గుజరాత్‌లోని లక్షలాది కుటుంబాలు ఉచిత రేషన్ పొందుతున్నాయని ప్రధాని ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ఉచిత రేషన్ పేదలకు బాధను తగ్గిస్తుంది మరియు వారికి విశ్వాసాన్ని ఇస్తుంది.

గుజరాత్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతోమాట్లాడిన ప్రధాన మంత్రి

August 03rd, 12:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’’ లబ్ధి దారుల తో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ పథకాన్ని గురించి మరింత జాగృతి ని వ్యాప్తి చేయడం కోసం ఆ రాష్ట్రం లో ఒక ప్రజా భాగస్వామ్య కార్య్రకమాన్ని ప్రారంభించడం జరిగింది.

కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ కోర్సు ప్రోగ్రామ్' ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 18th, 09:45 am

కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచ యుద్ధంలో ఒక ముఖ్యమైన ప్రచారం యొక్క తదుపరి దశ ఈ రోజు ప్రారంభమవుతుంది. కరోనా మొదటి తరంగంలో, దేశంలో వేలాది మంది నిపుణులు నైపుణ్య అభివృద్ధి ప్రచారంలో చేరారు. ఈ ప్రయత్నం కరోనాను ఎదుర్కోవడానికి దేశానికి గొప్ప బలాన్ని ఇచ్చింది. కరోనా రెండవ తరంగం తరువాత పొందిన అనుభవాలు, ఆ అనుభవాలు నేటి కార్యక్రమానికి ప్రధాన ఆధారం అయ్యాయి.

కోవిడ్‌-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమం’ ప్రారంభించిన ప్రధానమంత్రి

June 18th, 09:43 am

దేశవ్యాప్తంగాగల కోవిడ్‌-19 ముందువరుస సిబ్బంది కోసం ‘ప్రత్యేక సత్వర శిక్షణ కార్యక్రమాని’కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో వారికి శిక్షణ ఇస్తారు. ఈ వినూత్న కార్యక్రమం కింద 2-3 నెలల వ్యవధిలోనే సుమారు లక్షమంది సిబ్బంది శిక్షణ పొందుతారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ మంత్రి డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పాండే, పలువురు ఇతర శాఖల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నిపుణులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.

‘కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ కోసం ఉద్దేశించినటువంటి క్రాశ్ కోర్సు’ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 18న ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

June 16th, 02:33 pm

‘కోవిడ్‌-19 ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ కు ఉద్దేశించిన స్వల్పకాలిక పాఠ్యక్రమం’ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 18 న ఉద‌యం 11 గంట‌ల‌ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించ‌నున్నారు. దీనితో 26 రాష్ట్రాల లో విస్త‌రించివున్న 111 శిక్ష‌ణ కేంద్రాల లో ఈ కార్య‌క్ర‌మం మొదలవుతుంది. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం ఉంటుంది. నైపుణ్యాభివృద్ధి, న‌వ‌పారిశ్రామిక‌త్వ శాఖ కేంద్ర మంత్రి కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొంటారు.