నేపాల్‌లో జరిగిన 2566వ బుద్ధ జయంతి మరియు లుంబినీ దినోత్సవం 2022 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

May 16th, 09:45 pm

గతంలో కూడా, వైశాఖ పూర్ణిమ రోజున, భగవాన్ బుద్ధునికి సంబంధించిన దివ్య స్థలాలను, ఆయనతో సంబంధం ఉన్న కార్యక్రమాల కోసం సందర్శించే అవకాశాలు నాకు లభిస్తున్నాయి. మరియు ఈ రోజు, భారతదేశానికి స్నేహితుడైన నేపాల్‌లోని బుద్ధ భగవానుడి పవిత్ర జన్మస్థలమైన లుంబినీని సందర్శించే అవకాశం నాకు లభించింది. కొంతకాలం క్రితం మాయాదేవి ఆలయాన్ని సందర్శించే అవకాశం కూడా నాకు మరచిపోలేనిది. బుద్ధ భగవానుడు జన్మించిన ప్రదేశం, అక్కడి శక్తి, చైతన్యం, అది భిన్నమైన అనుభూతి. 2014లో ఈ స్థలంలో నేను సమర్పించిన మహాబోధి వృక్షం యొక్క మొక్క ఇప్పుడు చెట్టుగా అభివృద్ధి చెందడం చూసి నేను కూడా సంతోషిస్తున్నాను.

నేపాల్‌లోని లుంబినిలో బుద్ధజయంతి వేడుకలు

May 16th, 03:11 pm

నేపాల్‌లోని లుంబినీలోగల అంతర్జాతీయ సమావేశ కేంద్రం-ధ్యాన మందిరంలో నిర్వహించిన 2566వ బుద్ధ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతోపాటు గౌరవనీయులైన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా, ఆయన సతీమణి డాక్టర్ అర్జు రానా దేవ్‌బా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపాల్‌లోని లుంబినీలో మాయాదేవి ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

May 16th, 11:59 am

నేపాల్‌లో ఒకరోజు పర్యటనలో భాగంగా 2022 మే 16న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముందుగా అక్కడి లుంబినీలోగల మాయాదేవి ఆలయాన్ని సందర్శించారు. గౌరవనీయులైన నేపాల్‌ ప్రధానమంత్రి షేర్‌ బహదూర్‌ దేవ్‌బా, ఆయన సతీమణి డాక్టర్‌ అర్జు రానా దేవ్‌బా కూడా ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధుని కచ్చితమైన జన్మస్థలాన్ని సూచించే ఆలయ ప్రాంగణంలోని శిలవద్ద దేశాధినేతలిద్దరూ నివాళి అర్పించారు. అటుపైన బౌద్ధ సంప్రదాయాల ప్రకారం నిర్వహించిన పూజా కార్యక్రమాలకూ వారు హాజరయ్యారు.