కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ
July 26th, 09:30 am
లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు
July 26th, 09:20 am
కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.పుల్‌వామా లో ప్రాణసమర్పణం చేసిన వీర జవానుల కు శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి
February 14th, 11:10 am
పుల్‌వామా లో 2019 వ సంవత్సరం లో ప్రాణసమర్పణం చేసినటువంటి వీర జవానుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.విజయ్ దివస్ నేపథ్యంలో అమరవీరులకు ప్రధానమంత్రి హృదయపూర్వక నివాళి
December 16th, 09:44 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ విజయ దివస్ సందర్భంగా 1971నాటి యుద్ధంలో కర్తవ్యబద్ధులై దేశానికి సేవలందిస్తూ అమరులైన వీర సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పించారు.PM pays heartfelt tributes to brave security personnel martyred in the Parliament attack in 2001
December 13th, 09:47 am
The Prime Minister, Shri Narendra Modi has paid heartfelt tributes to the brave security personnel who were martyred in the Parliament attack in 2001.విజయ్ దివస్ కు ముందు రోజు న ఆర్మీ హౌస్ లో ఏర్పాటు చేసిన ‘అట్ హోమ్’ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి
December 15th, 08:13 pm
‘విజయ్ దివస్’ కు ముందు రోజు న ఆర్మీ హౌస్ లో ఏర్పాటు చేసిన ‘అట్ హోమ్’ స్వాగత సమారోహాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.మన యువత ప్రతి రంగంలో దేశం గర్వించేలా చేస్తున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 31st, 11:30 am
మిత్రులారా! జులై 31న అంటే ఈ రోజున దేశవాసులం అందరం అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ జీకి వందనం చేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అలాంటి గొప్ప విప్లవకారులందరికీ నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను.నీటిని పొదుపు చేసేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
March 27th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాము. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్ల అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు. కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు, ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్ల విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని కూడా దీని అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలలకంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.భారతీయ సంస్కృతి యొక్క వైభవం ఎల్లప్పుడూ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 30th, 11:30 am
మిత్రులారా! ఈ ప్రయత్నాల ద్వారా దేశం తన జాతీయ చిహ్నాలను స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో పున: ప్రతిష్టించుకుంటుంది. ఇండియా గేట్ దగ్గర ఉన్న 'అమర్ జవాన్ జ్యోతి'ని, సమీపంలోని 'నేషనల్ వార్ మెమోరియల్' వద్ద వెలిగించిన జ్యోతినిఏకం చేశాం. ఈ ఉద్వేగభరితమైన సంఘటన సందర్భంగా పలువురు దేశప్రజలు, అమరవీరుల కుటుంబాల కళ్లలో నీళ్లు తిరిగాయి.'నేషనల్ వార్ మెమోరియల్'లోస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండిఅమరులైన దేశంలోని వీరులందరి పేర్లను చెక్కారు. ‘అమర జవాన్ల స్మృతి చిహ్నం ముందు వెలిగించే ‘అమర్ జవాన్ జ్యోతి’ అమరవీరుల అమరత్వానికి ప్రతీక’ అని కొందరు మాజీ సైనికులు నాకు లేఖ రాశారు. నిజంగా 'అమర్ జవాన్ జ్యోతి' లాగా మన అమరవీరులు, వారి స్ఫూర్తి, వారి త్యాగం కూడా అజరామరం.మీకు అవకాశం దొరికినప్పుడల్లా 'నేషనల్ వార్ మెమోరియల్'ని తప్పక సందర్శించండని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ కుటుంబాన్ని, పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఇక్కడ మీరు భిన్నమైన శక్తిని, స్ఫూర్తిని అనుభవిస్తారు.పార్లమెంట్పై 2001వ సంవత్సరం లో జరిగిన దాడి లో అమరులైన వారికిశ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
December 13th, 11:42 am
పార్లమెంట్ పై 2001వ సంవత్సరం లో దాడి జరిగిన సందర్భం లో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రాణ సమర్పణం చేసిన భద్రత సిబ్బంది అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహనశ్రేణిపై దాడిని ఖండించిన ప్రధానమంత్రి
November 13th, 07:15 pm
మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై బాంబు దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. ఈ మేరకు ఇవాళ అమరులైన సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఆయన నివాళి అర్పించారు.న్యూఢిల్లీలో రక్షణ కార్యాలయ సముదాయాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం యొక్క వచనం
September 16th, 11:01 am
న్యూఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్ మరియు ఆఫ్రికా అవెన్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రక్షణ కార్యాలయ సముదాయాలను ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 వ సంవత్సరంలో కొత్త భారతదేశ అవసరాలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా దేశ రాజధానిని అభివృద్ధి చేయడంలో భారతదేశం మరో అడుగు ముందుకేసిందని చెప్పారు.కస్తూర్ బా గాంధీ మార్గ్ లోను, ఆఫ్రికా ఎవిన్యూ లోను డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్సె స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 16th, 11:00 am
న్యూ ఢిల్లీ లోని కస్తూర్ బా గాంధీ మార్గ్, ఆఫ్రికా ఎవిన్యూ లలో నిర్మాణం జరిగిన డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆఫ్రికా ఎవిన్యూ లో రక్షణ శాఖ కార్యాలయ భవన సముదాయాన్ని ఆయన సందర్శించి, సైన్యం, నౌకాదళం, వాయు సేన ల అధికారుల తో, సివిలియన్ ఆఫీసర్స్ తో సంభాషించారు కూడా.గతంలోని భయానక పరిస్థితులను ఏ దేశమూ విస్మరించడం సరికాదు: ప్రధాని మోదీ
August 28th, 08:48 pm
జలియన్‌వాలా బాగ్ స్మారక్ యొక్క పునర్నిర్మించిన సముదాయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. జలియన్ వాలా బాగ్ భారతదేశ స్వాతంత్య్రం కోసం చనిపోవడానికి లెక్కలేనన్ని విప్లవకారులను మరియు సర్దార్ ఉద్ధమ్ సింగ్, సర్దార్ భగత్ సింగ్ వంటి పోరాటయోధులను ప్రేరేపించిన ప్రదేశం అని ప్రధాని అన్నారు. ఏప్రిల్ 13, 1919 యొక్క ఆ 10 నిమిషాలు మన స్వాతంత్ర్య పోరాటంలోని అమర కథగా మారాయని, ఈ కారణంగా మనం ఈ రోజు స్వేచ్ఛ యొక్క అమృత్ మహోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామని ఆయన అన్నారు.పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
August 28th, 08:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పునర్నిర్మిత జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్మారకం వద్ద ఏర్పాటుచేసిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంగణం ఉన్నతీకరణలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యకలాపాలను కూడా ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ప్రధానమంత్రి ఈ సందర్భంగా వీరభూమి పంజాబ్‌తోపాటు పవిత్రమైన జలియన్‌వాలా బాగ్ ప్రాంగణానికి శిరసాభివందనం చేశారు. స్వేచ్ఛా జ్వాలలను ఆర్పివేయడం కోసం పరాయి పాలకుల అనూహ్య అమానుష హింసాకాండకు గురైన భరతమాత బిడ్డలకు ఆయన సగౌరవ వందనం సమర్పించారు.పునర్నిర్మించిన జలియన్‌వాలా బాగ్ స్మారక్ నుండి సంగ్రహావలోకనం
August 27th, 07:38 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 28, శనివారం నాడు జలియన్ వాలా బాగ్ స్మారక్ యొక్క పునరుద్ధరించిన సముదాయాన్ని జాతికి అంకితం చేస్తారు. స్మారక్‌లో అభివృద్ధి చేసిన మ్యూజియం గ్యాలరీలను ఆయన ప్రారంభిస్తారు. కాంప్లెక్స్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న బహుళ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమం ప్రదర్శిస్తుంది.పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని ఆగస్టు 28న జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి
August 26th, 06:51 pm
పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్ స్మారక ప్రాంగణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఆగస్టు 28న సాయంత్రం 6:25 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు స్మారకం వద్ద నిర్మించిన మ్యూజియం గ్యాలరీలను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాంగణం నవీకరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి.జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
April 13th, 09:25 am
జాలియాంవాలా బాగ్ సామూహిక హత్య ఘటన లో అమరులైన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.శహీదీ దివస్ సందర్భం లో అమరవీరుల కు నమస్సు లు అర్పించిన ప్రధాన మంత్రి
March 23rd, 09:08 am
ఈ రోజు న శహీదీ దివస్ సందర్భం లో కీర్తిశేషులు భగత్ సింహ్ కు, సుఖ్ దేవ్ కు, రాజ్ గురు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
February 07th, 11:41 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అస్సాంలో రెండు ఆస్పత్రులకు పునాదిరాళ్ళు వేసి, అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలోని ధేకిజులి ప్రాంతం వద్ద రాష్ట్రరహదారులు, ప్రధాన జిల్లా రహదారుల కోసం అసోమ్ మాలా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ శరబానంద సోనోవాల్, కేంద్ర మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, అస్సాం ప్రభుత్వ మంత్రులు, బోడోలాండ్ టెరిటోరియల్ రీజన్ చీఫ్ శ్రీ ప్రమోద్‌బోరో పాల్గొన్నారు.