మణిపూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 04th, 09:45 am
ఈ కార్యక్రమానికి హాజరైన మణిపూర్ గవర్నర్ లా. గణేశన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ జీ, ఉపముఖ్యమంత్రి వై. జోయ్‌కుమార్ సింగ్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు భూపేంద్ర యాదవ్ జీ మరియు రాజ్‌కుమార్ రంజన్ సింగ్ జీ, మణిపూర్ ప్రభుత్వంలోని మంత్రులు బిశ్వజిత్ సింగ్ జీ, లోసీ దిఖో జీ, లెట్‌పావో హాకిప్ జీ, అవాంగ్‌బౌ న్యూమై జీ, ఎస్ రాజేన్ సింగ్ జీ, వుంగ్‌జాగిన్ వాల్తే జీ, సత్యబ్రత సింగ్ జీ మరియు ఓ. లుఖియో సింగ్ జీ, పార్లమెంట్‌లోని నా సహచరులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు మణిపూర్‌లోని నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా! ఖురుంజారి!మణిపుర్ లోని ఇంఫాల్ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి
January 04th, 09:44 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మణిపుర్ లోని ఇంఫాల్ లో సుమారు 2950 కోట్ల రూపాయల విలువైన 9 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడంతో పాటు దాదాపు గా 1850 కోట్ల రూపాయల విలువైన 13 ప్రాజెక్టుల ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రహదారుల సంబంధిత మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, గృహనిర్మాణం, సమాచార సంబంధి సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, కళలు, ఇంకా సంస్కృతి సహా వివిధ రంగాల కు చెందినవి అయి ఉన్నాయి.