మన గ్రామాలను రూపాంతరం చేసినప్పుడే, భారతదేశం రూపాంతరం చెందుతుంది: ప్రధాని మోదీ

April 24th, 01:47 pm

మధ్యప్రదేశ్లోని మండ్లాలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ, గ్రామాలకు సేవ చేయాలనే వారి నిబద్ధతను పునరుద్ఘాటించాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాలను గుర్తుచేస్తూ, 'గ్రామ స్వరాజ్'కు ప్రాముఖ్యత గురించి గాంధీ మాట్లాడారని ప్రధాని ప్రస్తావించారు.

రాష్ట్రీయ గ్రామ్ స్వ‌రాజ్ అభియాన్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ఆదివాసీ ల స‌ర్వ‌తోముఖ అభివృద్ధికి ఒక మార్గ‌సూచీ ఆవిష్క‌ర‌ణ‌

April 24th, 01:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌ధ్య ప్ర‌దేశ్ లోని మండ‌లా లో ఈ రోజు జరిగిన ఒక జ‌న‌ స‌భ‌ లో రాష్ట్రీయ గ్రామ్‌ స్వ‌రాజ్ అభియాన్ ను ప్రారంభించారు. రాగ‌ల అయిదు సంవ‌త్స‌రాల కాలంలో ఆదివాసీ ల స‌ర్వ‌తోముఖ అభివృద్ధి కి ఉద్దేశించిన ఒక మార్గ‌సూచీ ని ఆయ‌న ఈ సందర్భంగా ఆవిష్క‌రించారు.

రేపు పంచాయతీ రాజ్ దినం సందర్భంగా మధ్య ప్రదేశ్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి; రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్ అభియాన్ ను ఆయన ప్రారంభిస్తారు

April 23rd, 05:35 pm

రేపు అనగా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీ రాజ్ దినం సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఆయన ఒక జన సభ లో రాష్ట్రీయ గ్రామీణ్ స్వరాజ్ అభియాన్ ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్త పంచాయతీ రాజ్ ప్రతినిధులను ఉద్దేశించి మండలా నుండి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.