సౌర మరియు అంతరిక్ష రంగాలలో భారతదేశం యొక్క అద్భుతాలకు ప్రపంచం ఆశ్చర్యపోతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

October 30th, 11:30 am

ఇప్పుడు మనం పవిత్రమైన ఛత్ పూజ, సూర్య భగవానుడి ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు సూర్యుని ఆరాధించడంతో పాటు ఆయన వరం గురించి కూడా చర్చించుకోవాలి. సూర్య భగవానుడి వరం 'సౌరశక్తి'. సోలార్ ఎనర్జీ ఈరోజుల్లో ఎంత ముఖ్యమైన అంశమంటే ఈరోజు ప్రపంచం మొత్తం తన భవిష్యత్తును సౌరశక్తిలో చూస్తోంది. సూర్య భగవానుడిని భారతీయులకు శతాబ్దాలుగా ఆరాధిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ జీవన విధానానికి కేంద్రం సూర్యుడే. భారతదేశం నేడు తన సాంప్రదాయిక అనుభవాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడిస్తోంది. అందుకేనేడుసౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో చేరాం. మన దేశంలోని పేద,మధ్యతరగతి ప్రజల జీవితాల్లో సౌరశక్తి తెచ్చిన మార్పులు కూడా అధ్యయనం చేసే అంశం.

ముప్ఫైఆరో జాతీయ క్రీడలు 2022 లో 10ఏళ్ల వయస్సు కలిగిన మల్లఖంబ్ క్రీడాకారుడు చిరంజీవి శౌర్యజీత్ ప్రదర్శన ను ప్రశంసించినప్రధాన మంత్రి

October 08th, 10:01 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 36వ జాతీయ క్రీడలు 2022 లో అందరికంటే తక్కువ వయస్సు కలిగిన మల్లఖంబ్ క్రీడాకారుడు చిరంజీవి శౌర్యజపీత్ యొక్క ప్రదర్శన ను మెచ్చుకొన్నారు.