కర్ణాటకలోని మల్ఖేడ్‌లో కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాల అర్హులైన లబ్ధిదారులకు టైటిల్ డీడ్ (హక్కు పత్రాల) పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 19th, 02:30 pm
కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ జీ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు భగవంత్ ఖుబా జీ, కర్ణాటక ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు మరియు శాసనసభ్యులు మరియు మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారాకర్నాటకలోని కలబురుగిలో కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాలలో 50 వేలమంది లబ్ధిదారులకు హకు పత్రాలు పంపిణీ చేసిన ప్రధాని
January 19th, 02:26 pm
కర్ణాటకలో కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ప్రధాని నరేంద్ర మోదీ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభ నుద్దేశించి ప్రసంగిస్తూ, జనవరిలో రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అదే పవిత్రమైన జనవరిలో కర్ణాటక ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం కీలకమైన అడుగు ముందుకేసిందని ప్రధాని అన్నారు. ఇది బంజారాలకు చాలా ఆనందం కలిగించే సమయమని, 50 వేల కుటుంబాలకు భూమి హక్కు పత్రాలు లభించాయని గుర్తు చేశారు. దీనివలన కలబురుగి, యాదగీర్, రాయచూర్, బీదర్, విజయపురా జిల్లాల్లోని తండాలలో నివసించే వారి పిల్లలకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందంటూ బంజారాలకు అభినందనలు తెలియజేశారు.జనవరి 19 న ప్రధాని కర్ణాటక, మహారాష్ట్ర పర్యటన
January 17th, 07:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జనవరి 19 న కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటిస్తారు. కర్ణాటకలో యాద్గిర్, కలబురుగి జిల్లాల్లో పర్యటిస్తారు. సుమారు 12 గంటల సమయంలో యాద్గిర్ జిల్లా కోడెకల్ లో ప్రధాని నీటిపారుదల, త్రాగునీటి, జాతీయ రహదార్లు తదితర అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం సుమారు 2.15 కు కలబురుగి జిల్లా మాల్ఖేడ్ చేరుకుంటారు. అక్కడ కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేస్తారు. అక్కడే నేషనల్ హైవే ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు. సుమారు 5 గంటలకు ముంబయ్ లో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సుమారు 6.30కి ముంబయ్ మెట్రో రెండు లైన్స్ ప్రారంభించి మెట్రోలో ప్రయాణిస్తారు.