న్యూ ఢిల్లీలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 26th, 04:10 pm
కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ ప్రతిష్టాత్మక సంస్థల అధ్యక్షులు, దౌత్యవేత్తలు, దేశం నలుమూలల నుండి ఈ రోజు ఈ కార్యక్రమంలో మాతో చేరిన బాల బాలికలు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ స్మారక చరిత్రాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 26th, 12:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ (వీరబాలల దినోత్సవం) నేపథ్యంలో నిర్వహించిన చారిత్రక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దాదాపు 300 మంది బాల కీర్తనిలు ఆలపించిన ‘షాబాద్ కీర్తన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలో దాదాపు 3 వేల మంది చిన్నారులతో నిర్వహించిన కవాతును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. కాగా, 2022 జనవరి 9న గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకల నేపథ్యంలో ఆయన కుమారులైన సాహిబ్‌జాదా- ‘బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్’ల అమరత్వానికి గుర్తుగా ఏటా డిసెంబరు 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే.