ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంపాఠం

January 02nd, 01:01 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. 700 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో ఈ యూనివ‌ర్సిటీని నెల‌కొల్పుతారు. సింథ‌టిక్ హాకీ గ్రౌండ్‌, ఫుట్‌బాల్ గ్రౌండ్‌, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్‌, క‌బ‌డ్డీ గ్రౌండ్‌, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథ‌టిక్ ర‌న్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్‌, బ‌హుళ ఉప‌యోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాత‌న క్రీడా స‌దుపాయాలు, ప‌రిక‌రాల‌తో దీనిని ఏర్పాటు చేస్తారు.

"ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి శంకు స్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ."

January 02nd, 01:00 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. 700 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో ఈ యూనివ‌ర్సిటీని నెల‌కొల్పుతారు. సింథ‌టిక్ హాకీ గ్రౌండ్‌, ఫుట్‌బాల్ గ్రౌండ్‌, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్‌, క‌బ‌డ్డీ గ్రౌండ్‌, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథ‌టిక్ ర‌న్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్‌, బ‌హుళ ఉప‌యోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాత‌న క్రీడా స‌దుపాయాలు, ప‌రిక‌రాల‌తో దీనిని ఏర్పాటు చేస్తారు.

జనవరి 2న ప్రధానమంత్రి మీరట్ సందర్శన;

December 31st, 11:11 am

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2022 జనవరి 2న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1:00 గంటకు ఆయన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. మీరట్‌లోని సర్ధానా పట్టణ పరిధిలోగల సలావా, కైలి గ్రామాలలో రమారమి రూ.700 కోట్ల వ్యయంతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుంది. ప్రధాని ప్రముఖంగా దృష్టి సారించిన రంగాలలో క్రీడా సంస్కృతిని ప్రోదిచేయడం, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా భాగంగా ఉన్నాయి. మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చంద్‌ క్రీడా విశ్వవిద్యాలయం నిర్మాణం ప్రధాని దార్శనికతను సాకారం చేసే కృషిలో కీలకమైన ముందడుగు కానుంది.

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో 'రాష్ట్ర రక్ష సమర్పణ్ పర్వ్'లో ప్రధాన మంత్రి ప్రసంగపాఠం

November 19th, 05:39 pm

ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్, శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ శక్తివంతమైన కర్మయోగి ముఖ్యమంత్రి, శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, దేశ రక్షణ మంత్రి మరియు ఈ రాష్ట్ర విజయవంతమైన ప్రతినిధి మరియు నా సీనియర్ సహోద్యోగి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ జీ, ఎం.ఎస్.ఎం.ఈ సహాయ మంత్రి శ్రీ భానుప్రతాప్ వర్మ జీ, ఇతర అధికారులు, NCC క్యాడెట్‌లు మరియు పూర్వ విద్యార్థులు మరియు సహచరులు హాజరయ్యారు!

ఉత్తరప్ర‌దేశ్‌లోని ఝాన్సీలో ‘రాష్ట్ర రక్షా సంపర్పణ్‌ పర్వ్‌’లో పాల్గొన్న ప్ర‌ధానమంత్రి

November 19th, 05:38 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నిర్వహించిన 'రాష్ట్ర రక్షా సంపర్పణ్‌ పర్వ్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఝాన్సీ కోట ప్రాంగణంలో ఘనంగా సాగిన ఈ వేడుకల సందర్భంగా రక్షణశాఖకు సంబంధించిన అనేక వినూత్న కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ‘ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల సంఘం’ ఒకటి కాగా, ప్రధానమంత్రి అందులో తొలి సభ్యులుగా నమోదయ్యారు. అలాగే ఎన్‌సీసీ కేడెట్ల కోసం ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ సిమ్యులేషన్‌ ట్రైనింగ్‌’; జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించే ‘కియోస్క్‌’; భారత నావికాదళ నౌకల కోసం డీఆర్‌డీవో రూపొందించి-తయారుచేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ యుద్ధ కవచం ‘శక్తి’; తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌-డ్రోన్లు తదితరాలను ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌ రక్షణ పారిశ్రామిక కారిడార్‌ పరిధిలోని ఝాన్సీ విభాగంలో రూ.400 కోట్ల ‘భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.

భారతదేశ యువత కొత్తగా మరియు పెద్ద ఎత్తున ఏదైనా చేయాలని కోరుకుంటుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

August 29th, 11:30 am

మన్ కీ బాత్ సందర్భంగా, ప్రధాన మంత్రి ధ్యాన్‌చంద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు మరియు ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిన మన ఒలింపియన్ల గురించి మాట్లాడారు. దేశంలోని యువత రిస్క్ తీసుకొని ముందుకు సాగగల సామర్థ్యం కోసం ఆయన ప్రశంసించారు. మా నైపుణ్యం కలిగిన మానవశక్తి కృషిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు మరియు భగవాన్ విశ్వకర్మకు నివాళులు అర్పించారు.

ఇల్లు, విద్యుత్తు, టాయిలెట్లు, గ్యాస్, రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి ప్రాథమిక సౌకర్యాల లేమి మహిళల పైన, మరీ ముఖ్యం గా పేద మహిళల పైనప్రభావాన్ని చూపింది: ప్రధాన మంత్రి

August 10th, 10:43 pm

ఇంటి పై కప్పు నీటి చుక్కల తో కారుతూ ఉండడం, విద్యుత్తు సౌకర్యం లేకపోవడం, కుటుంబం లో సభ్యులు జబ్బు పడుతూ ఉండడం, బహిర్భూమి కి వెళ్లి రావడం కోసం చీకటి పడే వరకు వేచి ఉండవలసి రావడం, బడుల లో మరుగుదొడ్డి సదుపాయం కొరవడటం అనేవి మన మాతృమూర్తుల పై, మన పుత్రికల పై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింపచేస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మన మాతృమూర్తులు పొగ, వేడిమి ల బారిన పడి సతమతం కావడాన్ని మన తరం గమనిస్తూ వచ్చిందని చెబుతూ ఆయన తన స్వీయ అనుభవాన్ని గురించి ప్రస్తావించారు.

ఉజ్జ్వల యోజన ద్వారా ప్రజల జీవితాలు, ముఖ్యంగా వెలుగులు నింపిన మహిళల సంఖ్య అపూర్వమైనది: ప్రధాని మోదీ

August 10th, 12:46 pm

ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహోబా ఉత్తర ప్రదేశ్‌లో ఎల్పిజి కనెక్షన్లను అందజేయడం ద్వారా ప్రధాని మోదీ ఉజ్వల యోజన 2.0 ని ప్రారంభించారు. సోదరీమణుల ఆరోగ్యం, సౌలభ్యం మరియు సాధికారత నిర్ణయం ఉజ్జ్వల యోజన నుండి గొప్ప ప్రోత్సాహాన్ని పొందాయని ప్రధాన మంత్రి గుర్తించారు. ఈ పథకం మొదటి దశలో 8 కోట్ల మంది పేద, దళిత, వెనుకబడిన మరియు గిరిజన కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయి.

ఉజ్జ్వల 2.0 ను ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా నుంచి ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 10th, 12:41 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో ఎల్ పీజీ కనెక్షన్ లను లబ్ధిదారుల కు అప్పగించి, ‘ఉజ్జ్వల 2.0’ (ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన - (పిఎమ్ యువై) ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఉజ్జ్వల లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

ఖేల్ రత్న అవార్డు ను ఇక మీదట మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుంది: ప్రధాన మంత్రి

August 06th, 02:15 pm

ఖేల్ రత్న అవార్డు ను మేజర్ ధ్యాన్ చంద్ పేరు తో వ్యవహారం లోకి తీసుకు రావాలని భారతదేశం వ్యాప్తంగా పౌరుల వద్ద నుంచి తనకు ఎన్నో అభ్యర్థన లు వస్తున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పౌరుల ఈ భావనల ను గౌరవిస్తూ ఖేల్ రత్న అవార్డు ను ఇక నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా పిలవడం జరుగుతుందని ఆయన చెప్పారు.