అయోధ్య విమానాశ్రయాన్ని ఒక అంతర్జాతీయ విమానాశ్రయం గాచేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి; మరి దాని పేరు ను ‘‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’’ గా పెట్టడం జరిగింది
January 05th, 08:28 pm
అయోధ్య యొక్క ఆర్థికపరమైన సామర్థ్యాన్ని మరియు ప్రపంచ స్థాయి తీర్థ స్థలం గా దాని ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడం తో పాటు గా, విదేశీ తీర్థయాత్రికుల ను, పర్యటకుల ను దృష్టి లో పెట్టుకొని ఈ నగరం యొక్క తలుపులను తెరవడం కోసం అయోధ్య విమానాశ్రయాని కి అంతర్జాతీయ హోదా ను ఇవ్వడం చాలా మహత్వపూర్ణమైనటువంటిది అని చెప్పాలి.అయోధ్య ధామ్‌లో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
December 30th, 04:50 pm
అయోధ్యలో కొత్త విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ- అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడంపై హర్షం ప్రకటించారు. వాల్మీకి మహర్షి రామాయణం మనల్ని శ్రీరామునితో మమేకం చేసే జ్ఞానమార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధునిక భారతంలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం మనల్ని అయోధ్య క్షేత్రం-ఆధునిక మహా రామాలయంతో అనుసంధానిస్తుందని చెప్పారు. తొలిదశలో ఈ విమానాశ్రయం ఏటా 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించగలదని, రెండోదశ తర్వాత ఈ సంఖ్య 60 లక్షలకు పెరుగుతుందని తెలిపారు.