కువైట్ లో ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ 'హలా మోదీ 'లో ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం
December 21st, 06:34 pm
నేను కువైట్‌కు వచ్చి కేవలం రెండున్నర గంటలు మాత్రమే అయింది. అయితే, నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇది నా ప్రాంతం అనే భావన, ఆత్మీయతా భావం నన్ను అల్లుకుపోయినట్టు అనిపిస్తోంది. మీరు అందరూ భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, కానీ మీ అందరినీ చూసినప్పుడు, నాకు ఒక మినీ భారత దేశం కనిపిస్తోంది. ఇక్కడ నేను ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల నుంచి వేర్వేరు భాషలు, మాండలికాలు మాట్లాడే ప్రజలను చూస్తున్నాను. అయినా, అందరి హృదయాలలో ఒకే విధమైన ప్రతిధ్వని వినిపిస్తోంది, అందరి హృదయాలలో ఒకే గొంతు మారుమోగుతోంది – భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై!కువైట్‌లో ‘హలా మోదీ’ కార్యక్రమం: భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 21st, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ నగరంలో షేక్ సాద్ అల్-అబ్దుల్లా ఇండోర్ స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ‘హలా మోదీ’లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కువైట్‌లోని విభిన్న వర్గాలకు చెందిన భారత జాతీయులు హాజరయ్యారు.Maha Kumbh is a divine festival of our faith, spirituality and culture: PM in Prayagraj
December 13th, 02:10 pm
PM Modi inaugurated development projects worth ₹5500 crore in Prayagraj, highlighting preparations for the 2025 Mahakumbh. He emphasized the cultural, spiritual, and unifying legacy of the Kumbh, the government's efforts to enhance pilgrimage facilities, and projects like Akshay Vat Corridor and Hanuman Mandir Corridor.ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
December 13th, 02:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యే వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, పవిత్ర సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్‌కు, మహాకుంభమేళాకు వచ్చే సాధువులు, సన్యాసులకు భక్తితో నమస్కరించారు. కృషి, అంకితభావంతో మహా కుంభమేళాను విజయవంతం చేస్తున్న ఉద్యోగులు, శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా జరిగే పరిమాణాన్ని, స్థాయి గురించి వివరిస్తూ, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే మహాయజ్ఞంగా, ప్రతి రోజూ లక్షల మంది భక్తుల పాల్గొనే, ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ‘‘ప్రయాగరాజ్ నేలపై సరికొత్త చరిత్ర లిఖితమవుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న మహా కుంభమేళా దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును నూతన శిఖరాలకు తీసుకెళుతుందతని, ఈ ఐక్యత ‘మహాయజ్ఞం’ గురించి ప్రపంచమంతా చర్చిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహా కుంభమేళాని విజయవంతంగా నిర్వహించాలన్నారు.డిసెంబరు 13న ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన
December 12th, 02:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 13న ఉత్తరప్రదేశ్‌ను సందర్శించనున్నారు. ఆయన ప్రయాగ్‌రాజ్‌కు వెళ్ళి, మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాలకు సంగమ్ స్థలానికి చేరుకొని పూజ, దర్శనం కార్యక్రమాల్లో పాలుపంచుకొంటారు. మధ్యాహ్నం దాదాపు 12 గంటల 40 నిమిషాలకు అక్షయ వట వృక్షానికి పూజచేసి, ఆ తరువాత హనుమాన్ మందిర్, సరస్వతీ కూప్‌లో దర్శనం, పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఇంచుమించు ఒంటిగంటన్నరకు ఆయన మహాకుంభ్ ప్రదర్శన స్థలాన్ని చేరుకొని, ఆ ప్రదేశమంతా కలియతిరుగుతారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత, మధ్యాహ్నం సుమారు 2 గంటలకు రూ. 5500 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభిస్తారు.