మూడో వీర బాల దినోత్సవం సందర్భంగా 17 మంది రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్రధాని సంభాషణ
December 26th, 09:55 pm
నేను మూడు పుస్తకాలు రాశాను. నాకు చదవడమంటే ఇష్టం.. అందుకే నేను పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. నాకో అరుదైన వ్యాధి ఉంది.. నేనింకో రెండేళ్లే జీవిస్తానని చెప్పారు. కానీ మా అమ్మ, మా అక్క, మా బడి... నేను పుస్తకాలు ప్రచురించే సంస్థల సహకారంతోనే నేనిప్పుడిలా ఉన్నాను.రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సంభాషించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 26th, 09:54 pm
ముఖాముఖి సందర్భంగా, పిల్లల నేపథ్యాలను విన్న ప్రధానమంత్రి.. జీవితంలో మరింత కృషిచేయాలంటూ వారిని ప్రోత్సహించారు. పుస్తకాలు రాసిన ఓ బాలికతో సంభాషించారు. తన పుస్తకాలకు ఎలాంటి స్పందన వచ్చిందో అడగగా.. మిగతా పిల్లలు కూడా సొంతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారని ఆ బాలిక బదులిచ్చింది. ఇతర చిన్నారుల్లో కూడా ప్రేరణ కలిగించిన ఆ బాలికను శ్రీ మోదీ ప్రశంసించారు.Our constitution embodies the Gurus’ message of Sarbat da Bhala—the welfare of all: PM Modi
December 26th, 12:05 pm
The Prime Minister, Shri Narendra Modi participated in Veer Baal Diwas today at Bharat Mandapam, New Delhi.Addressing the gathering on the occasion of the 3rd Veer Baal Diwas, he said their Government had started the Veer Baal diwas in memory of the unparalleled bravery and sacrifice of the Sahibzades.న్యూఢిల్లీలో జరిగిన వీర బాల దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
December 26th, 12:00 pm
ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వీర బాల దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మూడో వీర బాల దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. సాహిబ్‌జాదాల అసమాన సాహసం, త్యాగాలకు గుర్తుగా వీర బాల దివస్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించిందని తెలియజేశారు. కోట్లాది మంది భారతీయులకు జాతీయ స్ఫూర్తిని కలిగించే పండుగగా ఇది మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉత్సవం చిన్నారులు, యువతలో ధైర్యాన్ని నింపుతోందని అన్నారు. సాహసం, ఆవిష్కరణలు, శాస్త్ర-సాంకేతికత, క్రీడలు, కళల్లో వీర బాల పురస్కారం అందుకున్న 17 మంది చిన్నారులను ప్రశంసించారు. ఈ దేశపు చిన్నారులు, వివిధ రంగాల్లో రాణించేలా యువతలో నిండిన సామర్థ్యాన్ని ఈ పురస్కారాలు తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో గురువులు, వీర సాహిబ్‌జాదాలకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. పురస్కార గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను , అత్యధిక సామర్ధ్యం కలిగిన కంప్యూటింగ్ సిస్టమ్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 26th, 05:15 pm
గౌరవ ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, దేశంలోని వివిధ పరిశోధనా సంస్థల గౌరవ డైరెక్టర్లు, ప్రముఖ సీనియర్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు , పరిశోధకులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు మహిళలు , పెద్దలు!మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 26th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా దాదాపు రూ.130 కోట్ల విలువైన మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేశారు. ‘నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్’ (ఎన్ఎస్ఎం) కింద దేశీయంగా రూపొందించిన ఈ సూపర్ కంప్యూటర్లను పుణె, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో ఏర్పాటు చేశారు. దేశంలో నిర్వహించే అగ్రగామి పరిశోధనలకు ఇవి ఇతోధికంగా తోడ్పడతాయి. దీంతోపాటు వాతావరణం, వాతావరణ మార్పులపై పరిశోధనల కోసం రూపొందించిన ‘హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పిసి) వ్యవస్థ’ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.