యోగ ప్ర‌పంచం లో మూల‌ మూల‌ కు చేరుకొనేట‌ట్లుగా మ‌నం ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉండాలి: ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 21st, 08:40 am

యోగ ప్ర‌పంచం లోని మూల‌ మూల‌ కు చేరుకొనేట‌ట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అని యోగ ఆచార్యులకు, యోగ ప్ర‌చార‌కుల‌ కు, యోగ తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన ‘7వ అంత‌ర్జాతీయ యోగ దినం’ సంద‌ర్భం లో ప్ర‌సంగిస్తూ, ఈ సందేశాన్ని ఇచ్చారు.

కోవిడ్-ప్రభావిత ప్ర‌పంచం లో యోగ ఆశాకిర‌ణం గా ఉంద‌న్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 21st, 08:37 am

‘7వ అంత‌ర్జాతీయ యోగ దినం’ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మహమ్మారి కాలం లో యోగ కు ఉన్న పాత్ర ను గురించి తన అభిప్రాయాల ను వ్యక్తం చేశారు. ఈ క‌ఠిన సమయం లో యోగ ప్ర‌జ‌ల కు ఒక శ‌క్తి సాధ‌నం గాను, ఆత్మవిశ్వాసాన్ని అందించిన సాధనం గాను త‌న‌ ను తాను రుజువు చేసుకొంది అని ఆయ‌న అన్నారు. మ‌హ‌మ్మారి కాలం లో యోగ దినాన్ని మ‌ర‌చిపోవ‌డం అనేది యోగ త‌మ సంస్కృతి లో అంత‌ర్భాగం కాన‌టువంటి దేశాల‌ కు సుల‌భ‌మైన విష‌య‌మే అని, అయితే దానికి బ‌దులు గా, ప్ర‌పంచ స్థాయి లో యోగ ప‌ట్ల ఉత్సాహం వృద్ధి చెందింది అని ఆయ‌న అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగపాఠం

June 21st, 06:42 am

నేడు, ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొ౦టున్నప్పుడు, యోగా ఒక ఆశాకిరణ౦గా ఉ౦ది. రెండు సంవత్సరాలుగా, ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో పెద్ద బహిరంగ కార్యక్రమాలు జరగకపోవచ్చు, కానీ యోగా దినోత్సవం పట్ల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. కరోనా ఉన్నప్పటికీ, ఈసారి యోగా దినోత్సవం స్వస్థత కోసం యోగా అనే ఇతివృత్తం లక్షలాది మంది ప్రజలలో యోగా పట్ల ఉత్సాహాన్ని పెంచింది. ప్రతి దేశం, ప్రతి సమాజం మరియు ప్రతి ఒక్కరూ కలిసి ఒకరి బలం గా మారాలని నేను కోరుకుంటున్నాను.

‘7వ అంత‌ర్జాతీయ యోగ దినం’ సంద‌ర్భం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

June 21st, 06:41 am

మ‌హ‌మ్మారి విరుచుకు ప‌డుతున్న‌ప్ప‌టికీ కూడా ఈ సంవ‌త్స‌రం అంత‌ర్జాతీయ యోగ దినం తాలూకు ఇతివృత్తం అయిన‌ ‘యోగ ఫార్ వెల్‌ నెస్’ ప్ర‌జ‌ల నైతిక స్థైర్యాన్ని పెంచింది అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ప్ర‌తి ఒక్క దేశం, ప్ర‌తి ఒక్క స‌మాజం, ప్ర‌తి ఒక్క వ్య‌క్తి ఆరోగ్యం గా ఉండాలి అని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు. మ‌నం అంద‌రం ఏక‌తాటి మీద నిల‌చి, ఒక‌రిని మ‌రొక‌రం బ‌ల‌ప‌ర‌చుకొంటామ‌న్న ఆశ‌ ను ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఈ రోజు న ‘7వ అంత‌ర్జాతీయ యోగ దినాన్ని’ జ‌రుపుకొంటున్న సంద‌ర్భం గా ఆయ‌న ప్ర‌సంగిస్తూ ఈ మాట‌లు అన్నారు.