శస్త్రచికిత్స చేయించుకొన్న బ్రెజిల్ అధ్యక్షుడు త్వరగా కోలుకుని, ఆరోగ్యవంతుడవ్వాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 12th, 09:50 pm
ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొన్న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూలా డా సిల్వా త్వరగా కోలుకోవాలని, చక్కని ఆరోగ్యం కలగాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
November 20th, 08:05 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాకియో లూలా ద సిల్వా తో సమావేశమయ్యారు. శ్రీ లూలా ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, జి-20, ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. పేదరికం, క్షుద్బాధల నిర్మూలన కోసం ప్రపంచ స్థాయి సహకార సమితిని ప్రారంభించాలన్న శ్రీ లూలా యోచన పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మోదీ, సంస్థకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని వెల్లడించారు. మూడు దేశాల జి-20 ప్రత్యేక బృందం (ట్రోయికా) సభ్య దేశంగా బ్రెజిల్ జి-20 ఎజెండాకు శ్రీ మోదీ సంపూర్ణ మద్దతును తెలిపారు. జి-20 కార్యాచరణ పత్రంలో సుస్థిరాభివృద్ధి, ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి లక్ష్యాలను పేర్కొనడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు ప్రాముఖ్యాన్నివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే యేడాది బ్రెజిల్ చేపట్టనున్న ‘బ్రిక్స్’ సదస్సు, ‘కాప్-30’ అధ్యక్ష బాధ్యతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ, బ్రెజిల్ కు భారత్ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.‘‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’’పై జి20 సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం
November 18th, 08:00 pm
నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు... జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి గొప్ప ఏర్పాట్లను చేసినందుకు, అలాగే జి20 కి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడంలో సాఫల్యాన్ని సాధించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలా కు నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను.‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అనే అంశాలు ప్రధానంగా జి 20 కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 18th, 07:55 pm
‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అంశాలు ప్రధానంగా ఈ రోజున నిర్వహించిన జి 20 శిఖరాగ్ర సమావేశ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు, అతిథి మర్యాదలు చక్కని పద్ధతిలో చేస్తున్నందుకు బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిస్ ఇనాషియో లూలా డిసిల్వా కు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. బ్రెజిల్ లో నిర్వహిస్తున్న జి 20 కార్యక్రమాలు స్థిరాభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తుండడం ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఆందోళనలపై శ్రద్ధ వహిస్తూ, న్యూ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చేసిన నిర్ణయాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆయన అన్నారు. జి 20 కూటమికి భారతదేశం అధ్యక్షత వహించిన కాలంలో, ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అంటూ ఇచ్చిన పిలుపు రియో చర్చల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు.అయిదు రోజుల నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
November 16th, 12:45 pm
మిత్రులారా, అయిదు రోజుల నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల పర్యటనకు బయలుదేరబోతున్నాను. అధ్యక్షుడు శ్రీ బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు, పశ్చిమాఫ్రికా ప్రాంతంలో మనకు మిత్రదేశమైన నైజీరియాలో నేను తొలిసారిగా పర్యటించబోతున్నాను. ప్రజాస్వామ్యం, బహుళవాదాల పట్ల ఇరుదేశాలకూ గల నిబద్ధత పునాదిగా ఏర్పడ్డ ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈ పర్యటన సందర్భంగా మరింత పటిష్ఠమవగలదు. ఇక ఎంతో అభిమానంతో నాకు హిందీలో ఆహ్వాన సందేశాలు పంపిన నైజీరియా మిత్రులనూ, స్థానిక భారతీయులనూ కలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
November 12th, 07:44 pm
నవంబర్ 16-21 తేదీల్లో నైజీరియా, బ్రెజిల్, గయానాలలో అధికారిక పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. నైజీరియాలో, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన పాల్గొంటారు. బ్రెజిల్‌లో జరిగే జీ20 సదస్సులో ఆయన పాల్గొంటారు. గయానాలో, ప్రధాన మంత్రి సీనియర్ నేతలతో చర్చలు జరుపుతారు, పార్లమెంట్లో ప్రసంగిస్తారు మరియు కారికొమ్-ఇండియా సమ్మిట్‌లో పాల్గొంటారు, ఇది కరీబియన్ ప్రాంతంతో సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ఉద్ఘాటిస్తుంది.వర్చువల్ జీ-20 సదస్సులో ప్రధాని ముగింపు ప్రకటన (నవంబర్ 22, 2023)
November 22nd, 09:39 pm
మీ విలువైన ఆలోచనలన్నింటినీ మరోసారి అభినందిస్తున్నాను. మీరు ఓపెన్ మైండ్ తో మాట్లాడినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో టెలిఫోన్ లో మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు
November 10th, 08:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా దా సిల్వా ఈ రోజు న టెలిఫోన్ మాధ్యం ద్వారా మాట్లాడారు.బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
September 10th, 08:06 pm
న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు గౌరవనీయ లూయీ ఇనాసియో లూలా డిసిల్వాతో 2023 సెప్టెంబరు 10న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని అధ్యక్షులు లూలా అభినందించారు. కాగా, వచ్చే ఏడాది జి-20కి బ్రెజిల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు.భారత్-బ్రెజిల్ సంయుక్త ప్రకటన
September 10th, 07:47 pm
న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో గౌరవనీయ గణతంత్ర భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాననీయ గణతంత్ర బ్రెజిల్ సమాఖ్య అధ్యక్షులు లూయీ ఇనాసియో లూలా డిసిల్వా 2023 సెప్టెంబరు 10న సమావేశమయ్యారు.జి-20 శిఖరాగ్ర సదస్సు సమాపనోత్సవంలో ప్రధాని వ్యాఖ్యల అనువాద పాఠం
September 10th, 02:12 pm
ఈ నేపథ్యంలో జి-20 తదుపరి అధ్యక్ష బాధ్యత స్వీకరించనున్న బ్రెజిల్‌కు అచంచల మద్దతు ప్రకటిస్తున్నాం. మా ఉమ్మడి లక్ష్యాలను బ్రెజిల్ నాయకత్వంలో ఈ కూటమి మరింత ముందుకు తీసుకెళ్లగలదని విశ్వసిస్తున్నాం.బ్రెజిల్ అధ్యక్షునితో భారత ప్రధానమంత్రి సమావేశం
May 21st, 09:49 am
హిరోషిమాలో జి7 దేశాల శిఖరాగ్ర సభ వేదిక వద్ద ఆదివారం బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ ఇనాకియో లులా డా సిల్వాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.బ్రెజిల్ అధ్యక్షుని గా శ్రీ లుయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 02nd, 07:38 pm
బ్రెజిల్ అధ్యక్షుని గా శ్రీ లుయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా పదవీ బాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలిపారు.బ్రెజిల్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ లుయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
October 31st, 12:26 pm
బ్రెజిల్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ లుయిజ్ ఇనాసియో డీ సిల్వా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.