కోవిడ్ -19 పరిస్థితిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి జరిపిన సంభాషణ పూర్తి పాఠం

July 16th, 12:07 pm

కరోనాకు వ్యతిరేకంగా దేశం చేస్తోన్న పోరాటంలో అనేక ముఖ్యమైన సమస్యలపై మీరందరూ మీ అభిప్రాయాన్ని చెప్పారు. రెండు రోజుల క్రితం ఈశాన్య ప్రాంతంలోని గౌరవనీయ ముఖ్యమంత్రులందరితో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం నాకు లభించింది. పరిస్థితి ఆందోళన కలిగించే రాష్ట్రాలతో నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను.

కోవిడ్ స్థితి పై చ‌ర్చించ‌డం కోసం 6 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తో స‌మావేశం నిర్వ‌హించిన ప్ర‌ధాన మంత్రి

July 16th, 12:06 pm

కోవిడ్ కు సంబంధించిన స్థితి ని గురించి చ‌ర్చించ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌మిళ నాడు, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, ఒడిశా, మ‌హారాష్ట్ర, కేర‌ళ ల ముఖ్య‌మంత్రుల తో స‌మావేశ‌మ‌య్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ స‌మావేశం లో పాల్గొన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవ‌డం లో సాధ్య‌మైన అన్ని విధాలు గాను సాయాన్ని అందించిన ప్ర‌ధాన మంత్రి కి ముఖ్య‌మంత్రులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. వారి వారి రాష్ట్రాల లో వైర‌స్ వ్యాప్తి ని క‌ట్ట‌డి చేయడం కోసం తీసుకొంటున్న‌ చ‌ర్య‌ల ను గురించి, పౌరుల కు టీకా మందు ఇప్పించే కార్య‌క్ర‌మం లో పురోగ‌తి ని గురించి ప్ర‌ధాన మంత్రి దృష్టి కి ముఖ్య‌మంత్రులు తీసుకు వ‌చ్చారు. పౌరుల కు టీకా మందు ఇప్పించే వ్యూహాని కి సంబంధించిన క్షేత్ర స్థాయి స్పంద‌న ను కూడా వారు తెలియ‌ జేశారు.

కోవిడ్-19 స్థితిపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగపాఠం

April 20th, 08:49 pm

దేశం ఈ రోజు కరోనాకు వ్యతిరేకంగా మళ్లీ పెద్ద యుద్ధం చేస్తోంది. కొన్ని వారాల క్రితం వరకు పరిస్థితి స్థిరంగా ఉంది. కానీ కరోనా రెండవ వేవ్ తుఫానుగా మారింది. మీరు పడిన బాధ , మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న బాధను నాకు పూర్తిగా తెలుసు. గతంలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశ ప్రజలందరి తరఫున నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యుడిగా, నేను మీ దుఃఖంలో పాల్గొంటున్నాను. సవాలు పెద్దదే, కానీ మనం అందరం కలిసి మన సంకల్పం, మన ధైర్యం మరియు సన్నద్ధతతో దానిని అధిగమించాలి.

కోవిడ్-19 స్థితి పై దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

April 20th, 08:46 pm

దేశం లో కోవిడ్-19 స్థితిగతుల పై దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. ఇటీవలి కాలం లో మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి సంతాపాన్ని ప్రకటించారు. ‘‘ఈ విషాద సమయం లో, మీ కుటుంబం లో ఒక సభ్యుని లాగా, మీ దు:ఖం లో నేను పాలుపంచుకొంటున్నాను. సవాలు పెద్దది.. అయితే దీనిని మనం అందరం కలసి మన సంకల్పం తో, నిబ్బరం తో, సన్నాహాల తో దీనిని అధిగమించవలసి ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కరోనా కు వ్యతిరేకంగా యుద్ధం చేయడం లో వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్, పారిశుధ్య కార్మికులు, ఏమ్ బ్యులన్స్ డ్రైవర్ స్, భద్రత దళాలు, రక్షక భట బలగాలు అందించిన తోడ్పాటు ను ఆయన ఎంతగానో కొనియాడారు.

2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 28th, 11:30 am

2021వ సంవత్సరం మార్చి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 75 భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాల గ్రహీతలతో ప్రధాని సంభాషణ మూల పాఠం

January 25th, 12:08 pm

‘ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ (పిఎమ్ఆర్‌బిపి)’ గ్ర‌హీత‌ల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భం లో మ‌హిళ‌లు & బాల‌ల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ‌మతి స్మృతి జుబిన్ ఇరానీ కూడా హాజరయ్యారు.

‘రాష్ట్రీయ బాల పుర‌స్కార్‌, 2021’ గ్ర‌హీత‌ల‌ తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

January 25th, 12:00 pm

‘ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ (పిఎమ్ఆర్‌బిపి)’ గ్ర‌హీత‌ల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భం లో మ‌హిళ‌లు & బాల‌ల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీ‌మతి స్మృతి జుబిన్ ఇరానీ కూడా హాజరయ్యారు.

దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్యక్రమాన్ని ప్రారంభించిన శుభ సందర్భంగా ప్రధాన‌మంత్రి ప్రసంగ మూల పాఠం

January 16th, 10:31 am

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌నరేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫెరిన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ప్ర‌పంచంలోకెల్లా ఇది అత్యంత పెద్ద కార్య‌క్ర‌మం. దేశ వ్యాప్తంగా వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో మొత్తం 3006 సెష‌న్ కేంద్రాల‌ను ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్‌గా అనుసంధానం చేశారు.

దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

January 16th, 10:30 am

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌నరేంద్ర‌మోదీ ఈరోజు వీడియో కాన్ఫెరిన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ప్ర‌పంచంలోకెల్లా ఇది అత్యంత పెద్ద కార్య‌క్ర‌మం. దేశ వ్యాప్తంగా వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో మొత్తం 3006 సెష‌న్ కేంద్రాల‌ను ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వ‌ర్చువ‌ల్‌గా అనుసంధానం చేశారు.

బ్లూమ్ బ‌ర్గ్ న్యూ ఎకాన‌మీ ఫోర‌మ్ 3వ వార్షిక స‌మావేశాన్ని ఉద్దేశించి న‌వంబ‌ర్ 17న ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

November 17th, 06:42 pm

బ్లూమ్ బ‌ర్గ్ ఫిలాంత్రొఫీస్ లో మైకేల్‌, ఆయ‌న బృందం చేస్తున్న అద్భుత‌మైన కృషిని ప్ర‌శంసిస్తూ నేను ప్ర‌సంగం ప్రారంభిస్తున్నాను. భార‌త స్మార్ట్ సిటీల కార్య‌క్ర‌మం రూప‌క‌ల్ప‌న‌కు ఆ బృందం చ‌క్క‌ని మ‌‌ద్ద‌తు అందించింది.

పట్టణీకరణలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చిన – ప్రధానమంత్రి

November 17th, 06:41 pm

పట్టణ కేంద్రాల పునరుజ్జీవనం అనే అంశాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, పూర్వ వైభవాన్ని సాధించే ప్రక్రియలో ప్రజల పూర్తి భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పారు. ప్రజలను అతిపెద్ద వనరులుగా, సమాజాలను అతి పెద్ద నిర్మాణ వ్యవస్థలుగా ప్రధానమంత్రి అభివర్ణిస్తూ, సమాజాలు మరియు మన ప్రజలు మనకు అందుబాటులో ఉన్న అతి పెద్ద వ్యాపార వనరులుగా ఉన్నాయన్న సంగతిని, ఈ మహమ్మారి పునరుద్ఘాటించింది. ఈ కీలకమైన, ప్రాథమిక వనరులను పెంపొందించుకోవడం ద్వారా కోవిడ్ అనంతర ప్రపంచాన్ని నిర్మించాలి.” అని పేర్కొన్నారు.

For the first time since independence street vendors are getting affordable loans: PM

October 27th, 10:35 am

PM Narendra Modi interacted with beneficiaries of PM SVANIDHI Yojana from Uttar Pradesh through video conferencing. The Prime Minister said for the first time since independence street vendors are getting unsecured affordable loans. He said the maximum applications of urban street vendors have come from UP.

PM Modi interacts with beneficiaries of PM SVANidhi Scheme from Uttar Pradesh

October 27th, 10:34 am

PM Narendra Modi interacted with beneficiaries of PM SVANIDHI Yojana from Uttar Pradesh through video conferencing. The Prime Minister said for the first time since independence street vendors are getting unsecured affordable loans. He said the maximum applications of urban street vendors have come from UP.

‘మన్ కీ బాత్’ రెండోవిడత 17వ సంచికలో భాగంగా 25.10.2020న ప్రధానమంత్రి ప్రసంగం

October 25th, 11:00 am

మిత్రులారా! ఈ పండుగలలో కూడా సరిహద్దుల్లో నిలబడి ఉన్న మన ధైర్యవంతులైన సైనికులను మనం గుర్తుంచుకోవాలి. వారంతా భారతమాటకు సేవ చేస్తూ రక్షిస్తున్నారు. వారందరినీ గుర్తు చేసుకుంటూ మనం మన పండుగలను జరుపుకోవాలి. భారతమాత ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలను గౌరవించడానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించాలి. మీరు సరిహద్దులో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీతోనే ఉందని, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తోందని నా ధైర్యవంతులైన సైనికులకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుమారులు, కుమార్తెలు ఉన్న ఆ కుటుంబాల త్యాగానికి నేను వందనం చేస్తున్నాను. దేశానికి సంబంధించిన కొంత బాధ్యత కారణంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వ్యవసాయ రంగం, మన రైతులు, మన గ్రామాలు ఆత్మనిర్భర్ భారత్‌కు పునాది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

September 27th, 11:00 am

కథలు ప్రజల సృజనాత్మక, సంవేదనశీలతను ప్రకటిస్తాయి. కథ శక్తిని తెలుసుకోవాలంటే తల్లి తన చిన్న పిల్లవాడి ని నిద్ర పుచ్చడానికో లేదా అన్నం తినిపించడానికో చెప్పే కథ చూడండి. నేను నా జీవితంలో చాలా కాలం దేశమంతటా సంచరించాను. దేశాటనయే నా జీవితంగా గడిపాను. ప్రతి రోజు ఒక కొత్త ఊరు, కొత్త ప్రజలు, కొత్త కుటుంబాలు. కానీ నేను కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలతో తప్పకుండ మాట్లాడేవాడిని. అపుడపుడు పిల్లలతో అనేవాడిని.. పిల్లలూ… నాకు ఏదైనా కథ చెప్పండి అని. నేను ఆశర్యపోయేవాడిని. పిల్లలు నాతో అనేవారు మేం జోకులు చెప్తాం. మీరు కూడా జోకులే చెప్పండి అని. , అంకుల్.. మీరు మాకు జోకులు చెప్పండి అనేవారు. అంటే వారికి కథలతో అసలు పరిచయమే లేదు. చాలావరకు వారి జీవితం జోకులతో గడిచిపోయింది.

ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ‘ఫిట్ ఇండియా డైలాగ్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

September 24th, 12:01 pm

దేశానికి స్ఫూర్తి కలిగించిన ఏడుగురు మహానుభావులకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరంతా మీ అనుభవాలను ఫిట్ నెస్ కు సంబంధించిన విభిన్న అంశాలపై మీ అనుభవాలను పంచుకున్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. నేటి ఈ చర్చ కార్యక్రమం అన్ని రకాల వయసుల వారితోపాటు విభిన్నమైన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

వ‌య‌సుకు త‌గిన దేహ‌దారుఢ్యానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

September 24th, 12:00 pm

ఈ సంద‌ర్భం లో ఏర్పాటైన ‘‘ఫిట్ ఇండియా డైలాగ్’’ కార్య‌క్ర‌మంలో భాగంగా శ్రీ మోదీ క్రీడాకారులతో, ఫిట్‌నెస్ నిపుణులతో, ప్రముఖులు మరికొందరితో మాట్లాడారు. వర్చువల్ మాధ్య‌మంలో జ‌రిగిన ఈ సంభాష‌ణ లో పాల్గొన్న‌ వారు తాము అనుస‌రిస్తున్న దేహ‌దారుఢ్యం సంబంధిత సూత్రాల‌తో పాటు, వారి నిత్య జీవితంలోని అనుభ‌వాల‌ ను ప్ర‌ధాన మంత్రి తో ఇష్టాగోష్టి తరహా లో పంచుకొన్నారు.

కోవిడ్ వ్యాప్తి ప్రబలంగా ఉన్న ఏడు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల సిఎంలు, ఆరోగ్యమంత్రుల వర్చువల్ మీడియా సమావేశంలో ప్రధాని ప్రసంగం

September 23rd, 07:35 pm

ఈ రోజు మనం కరోనా సంక్షోభం గురించి మాట్లాడుతున్నాం, ఇది దేశ ఆరోగ్య చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున, ఆయుష్మాన్ భారత్- ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన ప్రారంభించబడింది.

ఏడు తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లో కోవిడ్ సన్నద్ధత-స్పందనపై ప్రధాని సమీక్ష

September 23rd, 07:30 pm

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో కోవిడ్‌ సన్నద్ధత, స్పందనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముఖ్యమంత్రులు, ఇతర అధికార ప్రముఖులతో తన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర దేశీయాంగ, రక్షణ, ఆరోగ్య శాఖల మంత్రులతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. అలాగే ఆయా రాష్ట్రాల హోం, ఆరోగ్యశాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం-ఆరోగ్యశాఖల కార్యదర్శులుసహా డీజీపీ కూడా హాజరయ్యారు. వీరేకాకుండా ప్రధానమంత్రి కార్యాలయం, మంత్రిమండలి కార్యదర్శి, నీతి ఆయోగ్‌ సభ్యుడు, కేంద్ర ఆరోగ్య-హోంశాఖల కార్యదర్శులతోపాటు ఐసీఎంఆర్‌, ఇతర సంబంధిత అధికారులు కూడా పాలుపంచుకున్నారు.

Govt is able to provide free food grains to the poor and the needy due to our farmers & taxpayers: PM

June 30th, 04:01 pm

In his address to the nation, Prime Minister Modi announced that the Pradhan Mantri Garib Kalyan Anna Yojana will now be extended till the end of November. The biggest benefit of this will be to those poor people and especially the migrant workers. The PM also thanked the hardworking farmers and the honest taxpayers, because of whom the government was being able to provide free food grains to the poor.