గుజ‌రాత్, గాంధీన‌గ‌ర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగం

September 16th, 11:30 am

జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వ‌చ్చిన‌ విశిష్ట అతిథులూ , నా మంత్రి మండ‌లి స‌భ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , ప‌లు దేశాల నుండి వ‌చ్చిన ప్రతినిధులు...

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం

September 16th, 11:11 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారు. మన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.

భారత జి 20 అధ్యక్ష హోదా భారత సాధారణ పౌరుల సామర్థ్యాన్ని వెలికి తీసింది: ప్రధాన మంత్రి

August 15th, 02:24 pm

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, దేశంలోని సామాన్య పౌరుడి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ ఎలా సహాయపడిందో వివరించారు. భారతదేశ సామర్ధ్యం , భారతదేశ అవకాశాలు ఆత్మవిశ్వాసం కొత్త శిఖరాలను దాటబోతున్నాయని, ఈ కొత్త ఆత్మవిశ్వాస శిఖరాలను కొత్త సామర్థ్యాలతో అందుకోవాలని ప్రధాన మంత్రి అన్నారు. “జీ-20 అధ్యక్ష పదవి భారత సామాన్య పౌరుడి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. నేడు దేశంలో జీ-20 సదస్సుకు ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్ కు లభించింది. గత ఏడాది కాలంగా భారతదేశంలోని ప్రతి మూలలో ఇలాంటి జీ-20 ఈవెంట్లు నిర్వహించడం వల్ల దేశంలోని సామాన్యుల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిం ది” అని అన్నారు.

మహిళల సశక్తీకరణ పై జి-20 మంత్రుల స్థాయి సమావేశం గుజరాత్ లోని గాంధీనగర్ లోజరుగ గా ఆ కార్యక్రమం లోవీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం పాఠం

August 02nd, 10:41 am

గాంధీ మహాత్ముని పేరిట ఏర్పాటైన గాంధీనగర్ లోకి మీకు అందరికి గాంధీనగర్ ఏర్పాటైన రోజు న నేను స్వాగతం పలుకుతున్నాను. అహమదాబాద్ లోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించే అవకాశం మీకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం, యావత్తు ప్రపంచం జలవాయు పరివర్తన ను గురించి, గ్లోబల్ వార్మింగు ను గురించి మరియు దీర్ఘకాలం మనుగడ లో ఉండే పరిష్కార మార్గాల ను వెతకవలసిన అత్యావశ్యకత ను గురించి చర్చిస్తున్నది. గాంధీ ఆశ్రమం లో మీరు గాంధీ గారి సీదాసాదా జీవన శైలి ని గురించి మరియు దీర్ఘకాలం మనుగడ లో ఉండేటటువంటి ఆయన దూరదర్శి ఆలోచనల ను గురించి ఆత్మనిర్భరత గురించి మరియు సమానత్వం గురించి ప్రత్యక్ష అనుభూతి ని పొందవచ్చు. ఆ విషయాలు మీకు తప్పక ప్రేరణదాయకమైనవి గా ఉంటాయి అని నేను అనుకొంటున్నాను. దాండి కుటీర్ మ్యూజియమ్ లో సైతం మీరు ఇదే తరహా అనుభూతి ని పొందవచ్చును, ఈ అవకాశాన్ని మీరు జారవిడుచుకోకండి. గాంధీ గారి కి చెందిన ప్రసిద్ధమైనటువంటి చరఖా.. అదే నూలు ను వడికే చక్రాన్ని దగ్గరలో ఉన్న ఒక పల్లె లో గంగాబెన్ అనే మహిళ మొదట కనుగొన్న సంగతి ని నేను ప్రస్తావించడం అసందర్భం అయిందేమీ కాదు. మీకు అందరికి తెలిసిన విషయం ఏమిటి అంటే అది అప్పటి నుండి గాంధీ గారు ఎల్లవేళ ల ఖాదీ దుస్తుల ను ధరిస్తూ వచ్చారు అనేదే. ఖాదీ ఆత్మనిర్భరత కు మరియు సస్టేనబలిటీ కి ఒక సంకేతం గా మారిపోయింది.

మహిళల కుసాధికారిత కల్పన అంశం పై ఏర్పాటైన జి-20 మంత్రుల స్థాయి సమాశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 02nd, 10:40 am

సమావేశం లో పాల్గొన్న జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, గాంధీ మహాత్ముని పేరిట ఏర్పడ్డ గాంధీనగర్ యొక్క స్థాపన దినం సందర్భం లో ప్రముఖుల కు స్వాగత వచనాల ను పలికారు. వారి కి అహమదాబాద్ లోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించే అవకాశం లభిస్తున్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. జలవాయు పరివర్తన మరియు గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాల కు సత్వర మరియు దీర్ఘకాలిక పరిష్కారాల ను కనుగొనవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం ద్వారా గాంధీ జీ యొక్క జీవన శైలి తాలూకు సరళత్వాన్ని మరియు స్థిరత్వం, ఆత్మనిర్భరత, ఇంకా సమానత్వం ల వంటి దూరదృష్టి తో కూడిన ఆయన ఆలోచనల ను కూడాను గుర్తెరగవచ్చు అని ప్రధాన మంత్రి వివరించారు. ప్రముఖుల కు ఆశ్రమం సందర్శన ప్రేరణాత్మకం కాగలదన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. దాండి కుటీర్ మ్యూజియమ్ ను కూడాను దర్శించవలసింది గా ఆయన సూచన చేశారు. గాంధీ గారు ఉపయోగించిన ఒక చరఖా అక్కడకు దగ్గరలోనే ఉన్న ఒక పల్లె లో గంగాబెన్ అనే ఒక మహిళ కు దొరికింది అని ఆయన వెల్లడించారు. అప్పటి నుండి గాంధీ గారు ఖాదీ ని ధరించడం మొదలుపెట్టారు, ఖాదీ అనేది ఆత్మనిర్భత కు మరియు సస్టేనబులిటీ కి ప్రతీక గా నిలచిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధానితో 2022 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌ శిక్షణార్థి అధికారుల సమావేశం

July 25th, 07:56 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌) 2022 బ్యాచ్‌ శిక్షణార్థి అధికారులు ఇవాళ లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ నం.7లోగల ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో విస్తృతంగా సంభాషించారు. ఉద్యోగ బాధ్యతులు స్వీకరించిన తర్వాత ఇప్పటిదాకా వారి అనుభవాల గురించి ఆరాతీశారు. ఈ మేరకు వారు తమ శిక్షణ సమయంలో గ్రామ సందర్శన, భారత్ దర్శన్‌, సాయుధ దళాలతో సంధానంసహా అనుభవాలను ఆయనతో పంచుకున్నారు. మొట్టమొదటగా తాము గమనించిన జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన వంటి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల పరివర్తన ప్రభావం గురించి కూడా వారు ప్రధానికి వివరించారు.

India achieved its non-fossil installed electric capacity target nine years in advance: PM Modi

July 22nd, 10:00 am

PM Modi addressed the G20 Energy Ministers Meet in Goa. Throwing light on India’s efforts in green growth and energy transition, he pointed out that India was the most populated nation and the fastest-growing large economy in the world and yet was strongly moving towards its climate commitments. The PM informed that India achieved its non-fossil installed electric capacity target nine years in advance and set a higher target for itself.

జి 20 ఇంధన మంత్రుల సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 22nd, 09:48 am

ఇంధన మార్పు విషయంలో ప్రతి దేశానికి భిన్నమైన వాస్తవికత , మార్గం ఉన్నప్పటికీ, ప్రతి దేశం లక్ష్యాలు ఒకటేనని తాను గట్టిగా నమ్ముతున్నట్టు ప్రధాన మంత్రి చెప్పారు. హరిత వృద్ధి, ఇంధన మార్పు లో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అనీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, అయినప్పటికీ దాని వాతావరణ కట్టుబాట్ల వైపు బలంగా కదులుతోందని ప్రధాన మంత్రి తెలిపారు. భారతదేశం తన శిలాజేతర స్థాపిత విద్యుత్ సామర్థ్య లక్ష్యాన్ని తొమ్మిదేళ్ల ముందుగానే సాధించిందని, తనకంటూ ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ప్రధాన మంత్రి తెలియజేశారు. 2030 నాటికి శిలాజేతర స్థాపిత సామర్థ్యాన్ని 50 శాతం సాధించాలని దేశం యోచిస్తోందని ఆయన పేర్కొన్నారు. సౌర, పవన విద్యుదుత్పత్తిలో భారతదేశం కూడా ప్రపంచ సారథ్య దేశాలలో ఒకటి అని ప్రధాన మంత్రి అన్నారు. పావగడ సోలార్ పార్కు , మొధేరా సోలార్ విలేజ్ లను సందర్శించడం ద్వారా క్లీన్ ఎనర్జీ పట్ల భారతదేశ నిబద్ధతను , స్థాయిని వీక్షించే అవకాశం వర్కింగ్ గ్రూప్ ప్రతినిధులకు లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

సిఒపి28 అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ సుల్తాన్ అల్ జాబెర్ తో ప్రధాన మంత్రి సమావేశం

July 15th, 05:33 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 15 న అబుదాబిలో సిఒపి 28 ప్రెసిడెంట్ గా నియమితులైన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ గ్రూప్ సిఇఒ డాక్టర్ సుల్తాన్ అల్ జాబెర్ తో సమావేశమయ్యారు.

India-USA partnership augurs well for the democracy: PM Modi in his address to the US Congress

June 23rd, 07:17 am

PM Modi addressed a Joint Sitting of the US Congress. He spoke about the rapid strides made in India-US bilateral relations and shared his vision for elevating bilateral ties. He also outlined the enormous progress made by India and the opportunities that it presents for the world.

యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

June 23rd, 07:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ హౌస్ ఆప్ రిప్రెజెంటెటివ్స్ స్పీకర్ శ్రీ కెవిన్ మేక్ కార్థీ, సీనెట్ లో సంఖ్యాబలమున్న నేత శ్రీ చార్ల్ స్ శూమర్, సీనెట్ లో రిపబ్లికన్ పార్టీ నేత శ్రీ మిచ్ మేక్ కోనెల్ మరియు సభ లో డెమోక్రెటిక్ పార్టీ నేత శ్రీ హకీమ్ జెఫ్రీస్ లు ఆహ్వానించిన మీదట 2023 వ సంవత్సరం లో జూన్ 22 తేదీ న యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల స్మారకోత్సవ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

April 09th, 01:00 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ భూపేందర్ యాదవ్ జీ, శ్రీ అశ్విని కుమార్ చౌబే జీ, ఇతర దేశాల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఇతర ప్రతినిధులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు

April 09th, 12:37 pm

టైగర్ పోజెక్టు 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా క‌ర్ణాట‌క‌, మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐ.బీ.సీ.ఏ) ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ సమర్థతపై రూపొందించిన 5వ సారాంశ నివేదిక - ‘పులుల సంరక్షణ కోసం అమృత్ కాల్ దృష్టి’ ప్రచురణలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అఖిల భారత పులుల (5వ) అంచనా సారాంశ నివేదికలో పులుల సంఖ్యను ప్రకటించారు. టైగర్‌ పాజెక్టు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.

ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 18th, 02:43 pm

నేటి సమావేశంలో కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు శ్రీ నరేంద్ర తోమర్ జీ, శ్రీ మన్సుఖ్ మాండవియా జీ, శ్రీ పీయూష్ గోయెల్ జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ; గయానా, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, సూడాన్, సురినామ్ మరియు గాంబియా నుండి గౌరవనీయ మంత్రులు; ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వ్యవసాయం, పోషణ మరియు ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు మరియు నిపుణులు; దేశంలోని స్టార్టప్ ప్రపంచంలోని వివిధ ఎఫ్.పి.ఓ లు మరియు యువ స్నేహితులు; దేశంలోని ప్రతి మూల హాజరైన లక్షల మంది రైతులు; ఇతర ప్రముఖులు, స్త్రీలు మరియు పెద్దమనుషులు!

ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సుకు ప్రధానమంత్రి శ్రీకారం

March 18th, 11:15 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సును ప్రారంభించారు. న్యూఢిల్లీలోని పూసా రోడ్డులో ‘ఎన్‌ఎఎస్‌సి’ సముదాయంలోగల ‘ఐఎఆర్‌ఐ’ ప్రాంగణంలోని సుబ్రమణ్యం హాలులో ఉదయం 11:00 గంటలకు మొదలైన ఈ సదస్సు రెండు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిరుధాన్యాల సంబంధిత అంశాలన్నిటిపైనా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిరుధాన్యాలపై రైతులు, వినియోగదారులు, ఇతర భాగస్వాములకు ప్రోత్సాహం-అవగాహన; చిరుధాన్య విలువ శ్రేణి విస్తరణ; చిరుధాన్యాలతో ఆరోగ్య-పోషక ప్రయోజనాలు; మార్కెట్‌ సంధానం; పరిశోధన-అభివృద్ధి వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. ప్రపంచ సదస్సుతోపాటు చిరుధాన్య ప్రదర్శన, విక్రయ-కొనుగోలుదారుల సమావేశ సంబంధిత కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, సందర్శించారు. అంతేగాక స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం డిజిటల్‌ రూపంలో భారత చిరుధాన్యాలు (శ్రీ అన్న).. అంకుర సంస్థల సంగ్రహాన్ని, చిరుధాన్య ప్రమాణాల పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.

న్యూఢిల్లీలో మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

February 12th, 11:00 am

ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ, సర్వదేశిక్ ఆర్యప్రతినిధి సభ అధ్యక్షుడు శ్రీ సురేష్ చంద్ర ఆర్య జీ, ఢిల్లీ ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షుడు శ్రీ ధరంపాల్ ఆర్య జీ, శ్రీ వినయ్ ఆర్య జీ, నా మంత్రివర్గ సహచరులు కిషన్ రెడ్డి జీ, మీనాక్షి లేఖి జీ మరియు అర్జున్ రామ్ మేఘవాల్ జీ, ప్రతినిధులందరూ, సోదర సోదరీమణులారా!

న్యూఢిల్లీలో మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి శ్రీకారం స్మారక లోగోను ఆవిష్కరించిన ప్రధాని

February 12th, 10:55 am

మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు నిర్వహించే వేడుకలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించి, స్మారక లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ వేదిక వద్దకు వచ్చేముందు ఆర్యసమాజ్‌ ప్రత్యక్ష ప్రదర్శనల ప్రదేశాన్ని ప్రధానమంత్రి తిలకించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న యజ్ఞంలో ఆహుతి సమర్పణ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో వెలిగించిన మహర్షి దయానంద సరస్వతి ప్రబోధ జ్యోతిని దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తం చేసేదిశగా యువతరం ప్రతినిధులకు ఆయన ‘ఎల్‌ఇడి దీపాన్ని’ అందజేశారు.

‘దక్షిణార్ధ దేశాల గళం’ సదస్సులో అధినేతల గోష్ఠి ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తుది పలుకులు

January 13th, 06:37 pm

మీ స్ఫూర్తిదాయక వ్యాఖ్యలకు ధన్యవాదాలు! నిజంగా ఈ అభిప్రాయాలు-ఆలోచనల ఆదానప్రదానం ఎంతో ప్రయోజనకరం. ఇది దక్షిణార్ధ దేశాల ఉమ్మడి ఆకాంక్షలను ప్రతిబింబించింది.

జి20కి భారత్‌ అధ్యక్షతపై లోగో.. ఇతివృత్తం.. వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

November 08th, 07:15 pm

భారతదేశం ‘జి20’ కూటమికి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్‌ మాధ్యమంద్వారా ఆవిష్కరించిన లోగో, ఇతివృత్తం, వెబ్‌సైట్‌ కింది విధంగా ఉన్నాయి:

India is a rapidly developing economy and continuously strengthening its ecology: PM Modi

September 23rd, 04:26 pm

PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.