
వేసవి సెలవులను ఎదగడానికి, జ్ఞానార్జనకు ఉపయోగించుకోండి: యువతను ప్రోత్సహించిన ప్రధానమంత్రి
April 01st, 12:05 pm
దేశమంతటా యువ మిత్రులకు వేసవి సెలవులు మొదలవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సెలవుల కాలాన్ని ఆనందం, జ్ఞానార్జనలతోపాటు జీవితంలో వ్యక్తిగతంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలంటూ వారిని ప్రధాని ప్రోత్సహించారు.