అస్సాం రోజ్గార్ మేళాలో ప్రధాని వీడియో సందేశం
May 25th, 05:13 pm
అస్సాం ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందిన యువత, వారి కుటుంబాలను నేను అభినందిస్తున్నాను. నేను గత నెలలో బిహు సందర్భంగా అస్సాం వచ్చాను. ఆ మహత్తర సంఘటన జ్ఞాపకం ఇప్పటికీ నా మదిలో తాజాగా ఉంది. ఆ సమయంలో జరిగిన ఈ సంఘటన అస్సామీ సంస్కృతిని కీర్తించడానికి చిహ్నం. నేటి 'రోజ్గార్ మేళా' (ఉపాధి మేళా) అస్సాంలోని బిజెపి ప్రభుత్వం యువత భవిష్యత్తు గురించి చాలా సీరియస్గా ఉందనే వాస్తవానికి చిహ్నం. అసోంలో ఎంప్లాయిమెంట్ ఫెయిర్ ద్వారా ఇప్పటికే 40 వేల మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఈ రోజు సుమారు 45 వేల మంది యువతకు నియామక పత్రాలను అందజేశారు. యువత అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.అస్సాం రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని వీడియో సందేశం
May 25th, 05:00 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అస్సాం రోజ్ గార్ మేళాను ఉద్దేశించి వీడియో ప్రసంగం చేశారు. అస్సాం ప్రభుత్వంలో ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైన యువతను, వారి కుటుంబ సభ్యులను ప్రధాని అభినందించారు. గత నెలలో బిహు సందర్భంగా జరిగిన భారీ కార్యక్రమానికి హాజరు కావటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ కార్యక్రమం అస్సామీ సంస్కృతిని అద్భుతంగా చూపటం ఇప్పటికీ తన మనసులో తాజాగా ఉందన్నారు. ఈరోజు జరిగిన రోజ్ గార్ మేళా అస్సాం యువత భవిష్యత్ పట్ల ప్రభుత్వానికి ఉన్న ఆసక్తికి నిదర్శనమన్నారు. దీనికంటే ముందే అస్సాంలో రోజ్ గార్ మేళా ద్వారా 40 వేలామందికి పైగా యువతీయువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఈరోజు 45 వేలమంది యువతకు నియామక పత్రాలు అందజేశామని చెబుతూ, వాళ్ళకు అద్భుతమైన భవిష్యత్ ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.గుజరాత్ లోని గాంధీనగర్ లో అఖిల భారతీయ శిక్షా సంఘ్ అధివేషన్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 12th, 10:31 am
అఖిల భారతీయ ప్రాథమిక శిక్షక్ సంఘ్, ఈ జాతీయ సదస్సుకు నన్ను ఎంతో ఆప్యాయతతో ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు. స్వాతంత్య్రం వచ్చిన 'అమృత్ కాల'లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాష్ట్రంలోని మొత్తం విద్యా వ్యవస్థను మార్చడానికి ప్రాథమిక ఉపాధ్యాయులతో కలిసి పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముఖ్యమంత్రి చెప్పినట్లు గుజరాత్ లో డ్రాపవుట్ రేటు ఒకప్పుడు 40 శాతం ఉండేది. ముఖ్యమంత్రి చెప్పినట్లు అది మూడు శాతం కంటే తక్కువకు పడిపోయింది. గుజరాత్ ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. గుజరాత్ లోని ఉపాధ్యాయులతో నాకున్న అనుభవాలు జాతీయ స్థాయిలో కూడా విధాన రూపకల్పనలో మాకు ఎంతగానో తోడ్పడ్డాయి.గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన అఖిల్భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
May 12th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య యొక్క 29 వ ద్వివార్షిక (ప్రతి రెండేళ్లకు ఒక సారి జరిగే) సమావేశం అయినటువంటి ‘అఖిల్ భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్’’ లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను ప్రధాన మంత్రి సందర్శించారు. ‘టీచర్స్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్ యుకేశన్’ (విద్య రంగం లో చోటు చేసుకొనే మార్పుల లో కేంద్ర స్థానం గురువుల దే) అనేది ఈ సమావేశం యొక్క ఇతివృత్తం గా ఉంది.‘మన్ కీ బాత్’ రెండోవిడత 19వ సంచికలో భాగంగా 27.12.2020న ప్రధానమంత్రి ప్రసంగం
December 27th, 11:30 am
మిత్రులారా! దేశంలోని సామాన్యులు ఈ మార్పును అనుభవించారు. నేను దేశంలో అద్భుతమైన ఆశల ప్రవాహాన్ని కూడా చూశాను. చాలా సవాళ్లు ఉన్నాయి. చాలా సమస్యలు కూడా వచ్చాయి. కరోనా కారణంగా సప్లై చైన్ తో పాటు అనేక విషయాల్లో ప్రపంచంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. కాని మనం ప్రతి సంక్షోభం నుండి కొత్త పాఠాలు నేర్చుకున్నాం. దేశంలో కొత్త సామర్ధ్యం కూడా ఏర్పడింది. మాటల్లో చెప్పాలనుకుంటే ఈ సామర్ధ్యం పేరు 'స్వావలంబన'.India has a rich legacy in science, technology and innovation: PM Modi
December 22nd, 04:31 pm
Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.PM delivers inaugural address at IISF 2020
December 22nd, 04:27 pm
Prime Minister Narendra Modi delivered the inaugural address at India International Science Festival (IISF) 2020. PM Modi said, All our efforts are aimed at making India the most trustworthy centre for scientific learning. At the same time, we want our scientific community to share and grow with the best of global talent.ఉపాధ్యాయ దినం సందర్భంగా ఉపాధ్యాయుల సముదాయానికి ప్రధాన మంత్రి వందనాలు; పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
September 05th, 11:14 am
ఉపాధ్యాయ దినం సందర్భంగా ఉపాధ్యాయుల సముదాయానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని పురస్కరించుకొని ఆయనకు కూడా ప్రధాన మంత్రి నివాళులు అర్పించారు.మన్ కీ బాత్ - మనసులో మాట తేదీ: 27.08.2017
August 27th, 11:36 am
మన దేశం అనేక భిన్నత్వాలతో నిండి ఉంది. ఈ భిన్నత్వాలు ఆహారం, జీవనశైలి, వస్త్రధారణ వరకే పరిమితం కాదు. జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి.