ఇ-రూపి అనేది ఒక వ్యక్తి అలాగే ప్రయోజన-నిర్దిష్ట చెల్లింపు వేదిక: ప్రధాని మోదీ
August 02nd, 04:52 pm
డిజిటల్ చెల్లింపు వ్యవస్థ కోసం నగదు రహిత మరియు కాంటాక్ట్‌లెస్ పరికరం ఇ-రూపిని ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త ప్లాట్‌ఫారమ్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వం డిబిటి పథకాన్ని బలోపేతం చేయడంలో ఇ-రూపి వోచర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. అందరికీ లక్ష్యంగా, పారదర్శకంగా మరియు లీకేజీ లేని డెలివరీకి ఇ-రూపి సహాయపడుతుందని ఆయన అన్నారు.డిజిటల్మాధ్యమం ద్వారా చెల్లింపుల సాధనం అయినటువంటి ‘ఇ-రూపీ’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 02nd, 04:49 pm
ఒక వ్యక్తి కి మరియు ఒక ప్రయోజనానికి ప్రత్యేకంగా రూపొందిన డిజిటల్ చెల్లింపు సాధనం అయినటువంటి ‘ఇ-రుపీ’ (e-RUPI) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ‘ఇ- రుపీ’ అనేది నగదు రహితమైనటువంటి, ఇచ్చి పుచ్చుకోవడం భౌతికం గా చేయనక్కరలేనటువంటి ఒక సాధనం.