సింగపూర్ సంస్థ ఏఈఎంను సందర్శించిన ప్రధానమంత్రి
September 05th, 12:31 pm
సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ సంస్థ ఏఈఎంను సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో కలసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. అంతర్జాతీయ సెమీకండక్టర్ రంగంలో ఏఈఎం పాత్ర, దాని కార్యకలాపాలతో పాటు భారత్ లో వ్యాపార ప్రణాళికల గురించి సంస్థ ప్రతినిధులు వివరించారు. సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమల సమాఖ్య ఆ దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమల అభివృద్ధి, భారత్ లో ఉన్న అవకాశాలు, సహకారం గురించి క్లుప్తంగా వివరించింది. ఈ రంగానికి చెందిన ఇతర సింగపూర్ సంస్థల ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాల్సిందిగా సింగపూర్ సెమీకండక్టర్ సంస్థలను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.సింగపూర్ ప్రధానితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం
September 05th, 10:22 am
భారత్ -సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలలో చోటుచేసుకొన్న పురోగతిని నేతలు ఇద్దరూ వారు జరిపిన చర్చలలో భాగంగా సమీక్షించారు. ద్వైపాక్షిక చర్చలలో మరింత విస్తృతికి అవకాశాలు అపారంగా ఉన్నాయని, ఈ సంబంధాన్ని ఒక సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు. ఇది భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి సైతం పెను ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. ఆర్థిక సంబంధాలలో బలమైన పురోగతిని నేతలు లెక్కలోకి తీసుకొని, రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని, పెట్టుబడులను మరింతగా పెంచుకొందామంటూ పిలుపునిచ్చారు. భారత్ లో దాదాపు 160 బిలియన్ డాలర్ల మేరకు సింగపూర్ పెట్టుబడి పెట్టి భారత్ కు ఒక ప్రముఖ ఆర్థిక భాగస్వామ్య దేశంగా ఉన్న విషయాన్ని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో వేగంగా చోటుచేసుకొంటున్న నిలకడతో కూడిన వృద్ధి సింగపూర్ వ్యాపార సంస్థలకు పెట్టుబడులు పెట్టడానికి గొప్ప అవకాశాలను ప్రసాదించిందని కూడా ఆయన అన్నారు. రక్షణ, భద్రత, సముద్ర సంబంధిత సహకారం, విద్య, కృత్రిమ మేధ (ఎఐ), ఫిన్‌టెక్, సరికొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతిక విజ్ఞాన ప్రధాన రంగాలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం వంటి రంగాలలో ఇప్పటికే కొనసాగుతున్న సహకారాన్ని కూడా వారు సమీక్షించారు. ఉభయ దేశాల ఆర్థిక బంధాలను, రెండు దేశాల ప్రజల మధ్య గల పరస్పర సంబంధాలను ఇప్పటి కన్నా మరింత పెంపొందింపచేసుకోవడానికి ఈ రెండు దేశాల మధ్య సంధానాన్ని పటిష్ట పరచవలసిన అవసరం ఉందని ఇద్దరు నేతలు పేర్కొన్నారు. గ్రీన్ కారిడార్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కూడా వారు అభిప్రాయపడ్డారు.సింగపూర్ ప్రధానితో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రన మోదీ వ్యాఖ్యలు
September 05th, 09:00 am
మీరు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనిద్దరి మధ్య జరుగుతున్న తొలి సమావేశం ఇది. మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీ 4జీ నాయకత్వంలో సింగపూర్ మరింత వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.PM Modi arrives in Singapore
September 04th, 02:00 pm
PM Modi arrived in Singapore. He will hold talks with President Tharman Shanmugaratnam, Prime Minister Lawrence Wong, Senior Minister Lee Hsien Loong and Emeritus Senior Minister Goh Chok Tong.భారతదేశం యొక్కసంగీత చరిత్ర వైవిధ్యభరిత సంగీత రచన ; అంతేకాక మరి వేలసంవత్సరాల నుండి వర్ధిల్లినటువంటి లయ మాధ్యం ద్వారా అది ప్రతిధ్వనిస్తూ వస్తోంది: ప్రధాన మంత్రి
November 14th, 09:43 am
సితార్ వాద్య సాధన అంటే సింగపూర్ ఉప ప్రధాని కి ఉన్నటువంటి అమితమైన మక్కువ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.