‘‘మూడు కొత్త నేర విచారణ చట్టాలు’’ విజయవంతంగా అమలు.. దేశానికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 03rd, 12:15 pm
చండీగఢ్‌కు రావడమంటే అది నా సొంత ప్రజల మధ్యకు వచ్చినట్లు అనిపిస్తుంది. చండీగఢ్ గుర్తింపు శక్తి స్వరూపిణి చండీదేవి మాతతో జతపడి ఉంది. చండీ మాత సత్యానికి, న్యాయానికి ప్రతీక. ఇదే భావన భారతీయ న్యాయ సంహితకు, భారతీయ నాగరిక్ సురక్ష సంహితకు పునాదిగా ఉంది. దేశ ప్రజలు ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని తీసుకొని ముందుకు సాగిపోతున్న కాలంలో, మన రాజ్యాంగానికి 75 సంవత్సరాలు అయిన వేడుకలను మనం జరుపుకొంటున్న క్రమంలో రాజ్యాంగ ఆదర్శాల నుంచి ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం విజయ ప్రస్థానంలో మరో మెట్టు అని చెప్పాలి. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో ప్రస్తావించుకొన్న ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక ప్రత్యేక చర్య. కొద్దిసేపటి కిందటే నేను ఈ చట్టాలు అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించాను. ఈ అంశాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను న్యాయశాస్త్ర విద్యార్థులు, న్యాయవాదుల సంఘం సభ్యులు (బార్), న్యాయాధికారులు సహా అందరూ.. వారి వీలునుబట్టి చూడాల్సిందని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితలు ఆచరణలోకి వచ్చినందుకుగాను పౌరులందరికీ నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. చండీగఢ్ పాలన యంత్రాంగంలోని వారందరినీ అభినందిస్తున్నాను.కొత్తగా తెచ్చిన మూడు నేరవిచారణ చట్టాల అమలు విజయవంతం చండీగఢ్‌లో దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి
December 03rd, 11:47 am
పెనుమార్పులతో తీసుకువచ్చిన మూడు కొత్త నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్.. విజయవంతం కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్‌లో జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ... చండీదేవి మాతతో చండీగఢ్ గుర్తింపు జతపడి ఉందన్నారు. శక్తులలో ఒక రూపమే చండీదేవి, సత్యానికి, న్యాయానికి ప్రతీక చండీదేవి అని ఆయన అన్నారు. ఇవే అంశాలను ఆధారంగా చేసుకొని భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలను సమగ్రంగా రూపొందించారన్నారు. దేశ ప్రజలు... భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తి కావడాన్ని స్మరించుకొంటున్న, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) సంకల్పంతో ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం ఒక గొప్ప సందర్భం అని ప్రధాని అన్నారు. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక గట్టి ప్రయత్నమని కూడా ఆయన అన్నారు. ఈ కొత్త చట్టాలను అమలుచేస్తున్న తీరుతెన్నులపై ఒక ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటుచేయగా ఆ ప్రదర్శనలో కొంత భాగాన్ని తాను కాసేపటి కిందటే చూశానని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. చట్టాలు అమలవుతున్న తీరును వివరించే ఈ ప్రత్యక్ష ప్రదర్శనను చూడాల్సిందిగా ప్రజలను ప్రధానమంత్రి కోరారు. కొత్తగా తెచ్చిన మూడు నేర విచారణ చట్టాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా దేశ పౌరులందరికీ ఆయన తన స్నేహపూర్వక అభినందనలు తెలిపారు. చండీగఢ్ పాలన యంత్రాంగంలో ప్రతి ఒక్కరినీ కూడా ఆయన అభినందించారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభోపాన్యాసం
November 25th, 10:31 am
చల్లని ఆహ్లాదకర వాతావరణంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి... మనం 2024 సంవత్సరం చివరి అంకానికి చేరుకున్నాం.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు దేశం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది.PM Modi's conversation with Lakhpati Didis in Jalgaon, Maharashtra
August 26th, 01:46 pm
PM Modi had an enriching interaction with Lakhpati Didis in Jalgaon, Maharashtra. The women, who are associated with various self-help groups shared their life journeys and how the Lakhpati Didi initiative is transforming their lives.Judiciary has consistently played the moral responsibility of being vigilant : PM Modi in Jodhpur
August 25th, 05:00 pm
Prime Minister Narendra Modi attended the Platinum Jubilee celebrations of the Rajasthan High Court in Jodhpur, where he highlighted the importance of the judiciary in safeguarding democracy. He praised the High Court's contributions over the past 75 years and emphasized the need for modernizing the legal system to improve accessibility and efficiency.రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 25th, 04:30 pm
మహారాష్ట్ర నుండి బయలు దేరిన సమయంలో వాతావరణం సరిగా లేనికారణంగా- జరిగిన ఆలస్యానికి చింతిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేసిన ఆయన, భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాజస్థాన్ హైకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నదని అన్నారు. ఎందరో మహానుభావులు అందించిన న్యాయం, వారి చిత్తశుద్ధీ, అంకితభావాన్నీ గౌరవించుకునే సందర్భమిది అని ప్రధాన మంత్రి అన్నారు. రాజ్యాంగం పట్ల దేశానికి ఉన్న విశ్వాసానికి నేటి కార్యక్రమం ఒక ఉదాహరణ అని, ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేవారందరికీ, రాజస్థాన్ ప్రజలకూ ప్రధాని అభినందనలు తెలియజేశారు.మహారాష్ట్రలోని జలగావ్ లో జరిగిన లఖ్పతి దీదీ సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 25th, 01:00 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఈ ప్రాంతానికి చెందిన నా తోటి మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారు, ఈ ప్రాంత ఆడబిడ్డ రక్షా ఖడ్సే గారు. ఉప ముఖ్యమంత్రులు శ్రీ అజిత్ పవార్ గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చిన తల్లులు, సోదరీమణులు... నా కళ్ళు చూడగలిగినంతవరకు ఇక్కడ మాతృమూర్తుల సముద్రం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ దృశ్యం మనసుకు ఎంతో హాయినిస్తోంది.మహారాష్ట్ర, జలగావ్‌లో నిర్వహించిన లక్షాధికార సోదరీమణుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 25th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో నిర్వహించిన లఖ్ పతి దీదీ సమ్మేళన్ (లక్షాధికార సోదరీమణుల సమావేశం)లో పాల్గొన్నారు. మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల లక్షాధికారులైన 11 లక్షలమంది సోదరీమణులకు ధ్రువ పత్రాలను అందించి సత్కరించింది.Many people want India and its government to remain weak so that they can take advantage of it: PM in Ballari
April 28th, 02:28 pm
Prime Minister Narendra Modi launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed a mega rally in Ballari. In Ballari, the crowd appeared highly enthusiastic to hear from their favorite leader. PM Modi remarked, “Today, as India advances rapidly, there are certain countries and institutions that are displeased by it. A weakened India, a feeble government, suits their interests. In such circumstances, these entities used to manipulate situations to their advantage. Congress, too, thrived on rampant corruption, hence they were content. However, the resolute BJP government does not succumb to pressure, thus posing challenges to such forces. I want to convey to Congress and its allies, regardless of their efforts... India will continue to progress, and so will Karnataka.”Your every vote will strengthen Modi's resolutions: PM Modi in Davanagere
April 28th, 12:20 pm
Addressing his third rally of the day in Davanagere, PM Modi iterated, “Today, on one hand, the BJP government is propelling the country forward. On the other hand, the Congress is pushing Karnataka backward. While Modi's mantra is 24/7 For 2047, emphasizing continuous development for a developed India, the Congress's work culture is – ‘Break Karo, Break Lagao’.”Congress insulted our Rajas and Maharajas, but when it comes to Nizams & Nawabs, their mouths are sealed: PM Modi in Belagavi
April 28th, 12:00 pm
Prime Minister Narendra Modi today launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed back-to-back mega rallies in Belagav. PM Modi stated, “When India progresses, everyone becomes happy. But the Congress has been so indulged in 'Parivarhit' that it gets perturbed by every single developmental stride India makes.”PM Modi addresses public meetings in Belagavi, Uttara Kannada, Davanagere & Ballari, Karnataka
April 28th, 11:00 am
Prime Minister Narendra Modi today launched the poll campaign in full swing for the NDA in Karnataka. He addressed back-to-back mega rallies in Belagavi, Uttara Kannada, Davanagere and Ballari. PM Modi stated, “When India progresses, everyone becomes happy. But the Congress has been so indulged in 'Parivarhit' that it gets perturbed by every single developmental stride India makes.”భారత సర్వోన్నత న్యాయస్థానం-సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
January 28th, 01:00 pm
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, విదేశాల నుంచి వచ్చిన మన అతిథి న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, అటార్నీ జనరల్ వెంకటరమణి గారు, బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా గారు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆదిష్ అగర్వాల్ గారు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ.
January 28th, 12:19 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను జనవరి 28న, డిల్లీిలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, పౌర కేంద్రిత సమాచార సాంకేతిక పరిజ్ఞాన చర్యలను ప్రారంభించారు. ఇందులో డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్టులు (డిజి ఎస్‌సిఆర్) , డిజిటల్ కోర్టులు 2.0, సుప్రీంకోర్టు కొత్త వెబ్ సైట్ ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. సుప్రీంకోర్టు 75 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్బంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అలాగే భారత రాజ్యంగం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం 23 సెప్టెంబరు, 2023
September 23rd, 10:59 am
ప్రపంచ న్యాయ విభాగానికి చెందిన ప్రముఖులందరినీ కలవడం, వారందరి మధ్యన ఉండే అవకాశం రావడం నాకు ఒక అద్భుతమైన అనుభవం. భారత్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు నేడు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడ ఉన్నారు. ఇంగ్లండ్ లార్డ్ చాన్సలర్ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇంగ్లండ్ కు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనేందుకు మన మధ్యన ఉన్నారు. అలాగే కామన్వెల్త్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు కూడా వచ్చారు. ఆ రకంగా నేటి ఈ అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు ‘‘వసుధైవ కుటుంబకం’’ (ప్రపంచం అంతా ఒకే కుటుంబం) అనే భారత్ సెంటిమంట్ కు ఒక చిహ్నంగా నిలిచింది. భారత్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అంతర్జాతీయ అతిథులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమం చేపట్టే బాధ్యత హృదయపూర్వకంగా స్వీకరించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాను.న్యూఢిల్లీలో ‘అంతర్జాతీయ న్యాయవాద సదస్సు-2023’ను ప్రారంభించిన ప్రధానమంత్రి
September 23rd, 10:29 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ‘అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు-2023’ను ప్రారంభించారు. జాతీయ-అంతర్జాతీయ ప్రాముఖ్యంగల వివిధ చట్టపరమైన అంశాలపై అర్థవంతమైన సంప్రదింపులు-చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడటం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. అలాగే ఆలోచనలు-అనుభవాల ఆదానప్రదానాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారంతోపాటు చట్టపరమైన సమస్యలపై అవగాహనను బలోపేతం చేయడం దీని ప్రధానోద్దేశాలు.Central Hall of Parliament inspires us to fulfill our duties: PM Modi
September 19th, 11:50 am
PM Modi addressed the Members of Parliament in the Central Hall during the Special Session. Speaking about the Parliament Building and the Central Hall, PM Modi dwelled on its inspiring history. He recalled that in the initial years this part of the building was used as a kind of library. He remembered that this was the place where the Constitution took shape and transfer of power took place at the time of Independence.పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 19th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సంయుక్త సభా మందిరంలో ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. గణేష్ చతుర్థి నేపథ్యంలో మొదట సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సౌధంలో సభా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ “దేశాన్ని వికసిత భారతంగా మార్చాలనే సంకల్పం, దృఢదీక్షతో మనం కొత్త పార్లమెంటు భవనానికి వెళ్తున్నాం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో, జి.20 అవినీతి వ్యతిరేక, మంత్రులస్థాయి సమావేశానికి సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో ప్రసంగం.
August 12th, 10:21 am
జి 20, అవినీతి వ్యతిరేక మినిస్టీరియల్ సమావేశం భౌతిక స్థాయిలో తొలిసారిగా జరుగుతున్నందున మీఅందరికీ నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. మీరు నోబుల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నగరమైన కోల్ కతాలో సమావేశమౌతున్నారు. వారు తమ రచనలలో అత్యాశ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు, ఎందుకంటే, అది వాస్తవాన్ని గ్రహించకుండా మనల్ని నిరోధిస్తుంది. ప్రాచీన ఉపనిషత్ లు మా గ్రుథ అని సూచించాయి. అంటే , అత్యాశపనికిరాదని సూచించాయి.అవినీతి నిరోధంపై జి-20 సచివులస్థాయి భేటీలో ప్రధాని ప్రసంగం
August 12th, 09:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అవినీతి నిరోధంపై కోల్‌కతాలో నిర్వహించిన జి-20 సచివుల స్థాయి సమావేశంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా నోబెల్ పురస్కార గ్రహీత అయిన గురుదేవుడు రవీంద్రనాథ్ టాగూర్ నగరం కోల్‌కతా వచ్చిన ప్రముఖులకు ఆయన స్వాగతం పలికారు. అవినీతి నిరోధంపై జి-20 సచివుల స్థాయి సమావేశం ప్రత్యక్షంగా నిర్వహించడం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఠాగూర్ రచనలను ప్రస్తావిస్తూ- ఎవరికైనా దురాశ తగదని, అది సత్యాన్వేషణకు అడ్డుగోడగా నిలుస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ‘మా గృథా’.. అంటే- దురాశకు తావుండరాదు’ అన్న ప్రాచీన భారతీయ ఉపనిషత్తు ఉద్బోధను ప్రధాని ఉటంకించారు.