భార‌త‌దేశం మ‌రియు నార్డిక్ దేశాల మ‌ధ్య శిఖ‌ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా సంయుక్త ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

April 18th, 12:57 pm

ఈ రోజు స్టాక్ హోమ్ లో భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, డెన్మార్క్ ప్ర‌ధాని శ్రీ లార్స్ లోకే రస్ ముసెన్, ఫిన్ లాండ్ ప్ర‌ధాని శ్రీ జుహా శిపిల, ఐస్‌లాండ్‌ ప్ర‌ధాని శ్రీ కత్రిన్ జాకబ్స్ దాతిర్ మరియు నార్వే ప్ర‌ధాని శ్రీ ఎర్‌నా సోల్‌బ‌ర్గ్, స్వీడ‌న్ ప్ర‌ధాని శ్రీ స్టీఫ‌న్ లోఫ్‌వెన్ లు ఒక శిఖ‌ర స‌మ్మేళ‌నంలో పాలుపంచుకొన్నారు. ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నానికి స్వీడిష్ ప్ర‌ధాని మ‌రియు భార‌త‌దేశ ప్ర‌ధాన‌ మంత్రి ఆతిథేయి లుగా వ్య‌వ‌హ‌రించారు.

స్వీడన్ లో భారత ప్రధానమంత్రి పర్యటన (16-17 ఏప్రిల్ 2018)

April 17th, 11:12 pm

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా, 'ఇండియా-నార్డిక్ సమ్మిట్: షేర్డ్ వాల్యూస్, మ్యూచువల్ ప్రోస్పెరిటీ' అనే శీర్షికతో భారతదేశం మరియు స్వీడన్ ఇండియా-నార్డిక్ సదస్సును నిర్వహించాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ మరియు నార్వే ప్రధానమంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. నార్డిక్ దేశాలతో భారతదేశం గణనీయమైన ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. వార్షిక ఇండియా-నోర్డిక్ ట్రేడ్ సుమారు 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశంలో సంచిత నార్డిక్ ఎఫ్డిఐకి 2.5 బిలియన్ డాలర్లు.