ఒబిసిలకు, ఆర్థికం గా బలహీనమైన వర్గాల వారికి వైద్య కోర్సుల లో రిజర్వేషన్ నుకల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించడాన్ని ప్రశంసించిన ప్ర‌ధాన మంత్రి

July 29th, 05:17 pm

అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్/ డెంటల్ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/ డెంటల్ కోర్సుల కు ఉద్దేశించిన అఖిల భారత కోటా పథకం లో ఒబిసి లకు 27 శాతం రిజర్వేషను ను, ఆర్థికం గా బలహీనమైనటువంటి వర్గాల వారికి 10 శాతం రిజర్వేషను ను వర్తమాన విద్య సంవత్సరం నుంచి కల్పించాలని ప్రభుత్వం మహత్తర నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పొగడారు.

వైద్య విద్య మీద భారత ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం

July 29th, 03:38 pm

దార్శనికుడైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శనంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆలిండియా కోటా పథకంలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సులలో ( ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డిప్లొమా/బిడిఎస్/ఎండిఎస్) ఇతర వెనుకబడిన తరగతులకు (ఒబిసిలు) 27%, ఆర్థికంగా బలహీనవర్గాల (ఇ డబ్ల్యు ఎస్) వారికి 10% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ విద్యా సంవత్సరం, అంటే 2021-22 నుంచే అమలు లోకి వస్తుంది.