ప్రపంచ శాంతి కోసం కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తనలో ప్రధానమంత్రి ప్రసంగం
February 03rd, 07:48 pm
కృష్ణగురు సేవాశ్రమంలో గుమిగూడిన సాధువులు, ఋషులు మరియు భక్తులందరికీ నా గౌరవప్రదమైన ప్రణామాలు. కృష్ణగురు ఏకనామ అఖండ కీర్తన గత నెల రోజులుగా జరుగుతోంది. కృష్ణగురు జీ ప్రచారం చేసిన ప్రాచీన భారతీయ విజ్ఞానం, సేవ మరియు మానవత్వం ఈనాటికీ కొనసాగడం నాకు సంతోషంగా ఉంది. గురుకృష్ణ ప్రేమానంద్ ప్రభు జీ ఆశీస్సులు మరియు సహకారంతో మరియు కృష్ణగురు భక్తుల కృషితో, ఈ కార్యక్రమంలో ఆ దైవత్వం స్పష్టంగా కనిపిస్తుంది. నేను అస్సాం వచ్చి మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుకున్నాను! నేను గతంలో కృష్ణగురువు జీ పవిత్ర నివాసానికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. కానీ నేను అక్కడికి రాలేకపోయిన నా ప్రయత్నాలలో కొన్ని వైఫల్యాలు ఉండవచ్చు. ఆ కృష్ణగురువును కోరుకుంటున్నాను'ప్రపంచ శాంతి కోసం ‘కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన’ నుద్దేశించి ప్రధాని ప్రసంగం
February 03rd, 04:14 pm
ప్రపంచ శాంతికోసం పాటుపడుతూ అస్సాంలోని బారపేటలో ఉన్న కృష్ణ గురు సేవాశ్రంలో జరుగుతున్న ‘కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన’ నుద్దేశించి ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యకమం జనవరి 6 న మొదలై నెలరోజులపాటు సాగింది. దీనికి హాజరైన వారినుద్దేశించిన ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. కృష్ణగురు పురాతన భారత సంప్రదాయ జ్ఞానాన్ని, సేవను, మానవతావాదాన్ని ప్రచారం చేయగా ఆ బోధనలు నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. గురు కృష్ణ ప్రేమానంద ప్రభు జీ బోధనల దైవిక స్వభావం, ఆయన శిష్యుల కృషి ఈ సందర్భంగా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. గతంలోనూ, ఈ రోజు కూడా వ్యక్తిగతంగా నేరుగా పాల్గొనాలని భావించినా కుదరకపోవటంతో వీలైనంత త్వరలో అలాంటి అవకాశం దక్కేలా కృష్ణగురు ఆశీస్సులందుకున్నారు.ఫిబ్రవరి 3వ తేదీ నాడు ప్రపంచ శాంతి కై ఏర్పాటు చేసిన కృష్ణగురు ఏక్ నామ్అఖండ కీర్తన్ కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
February 01st, 10:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం ఫిబ్రవరి 3 వ తేదీ నాడు సాయంత్రం పూట 4:30 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన్ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ శాంతి ని ఆకాంక్షిస్తూ అసమ్ లోని బార్ పేటా లో గల కృష్ణగురు సేవాశ్రమ్ లో ఏర్పా చేయడమైంది. ప్రధాన మంత్రి కృష్ణగురు సేవాశ్రమ్ యొక్క భక్త జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.