ధనుష్కోడిలోని కోదండరామ దేవాలయంలో పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి

January 21st, 03:41 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధనుష్కోడిలోని కోదండరామస్వామి దేవాలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ దేవాలయం పూర్తిగా కోదండరామస్వామికే అంకితం అయింది. కోదండరామ అంటే విల్లు పట్టుకున్న రాముడు. ధనుష్కోడి అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. విభీషణుడు తొలి సారి శ్రీరాముని కలిసి శరణు కోరిన ప్రదేశంగా దీన్ని చెబుతారు. విభీషణునికి శ్రీరాములవారు పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది అని కొందరు చెబుతారు.

జనవరి 20-21 తేదీలలో తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్న ప్రధాని

January 18th, 06:59 pm

జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ ఆలయంలో వివిధ పండితులు కంబ రామాయణం నుండి పద్యాలను పఠించడాన్ని కూడా ప్రధాన మంత్రి వింటారు.