ప్రధానమంత్రితో చెస్ చాంపియన్ కోనేరు హంపి భేటీ

January 03rd, 08:42 pm

చదరంగ క్రీడలో విజేత కోనేరు హంపి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమయ్యారు. భారతదేశానికి గొప్ప గర్వకారణంగా నిలిచినందుకు కోనేరు హంపిని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఆమె పదునైన మేధస్సు, అచంచల దృఢనిశ్చయం తేటతెల్లం అయ్యాయన్నారు.